ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
పులివెందుల టౌన్: పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఆదివారం పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్సార్ జిల్లా పులివెందుల అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ గోపీనాథ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వరప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల గడ్డ అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు అన్నారు.
మన రాష్ట్రానికి ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను ఈ ప్రాంత ప్రజలు అందించారని తెలిపారు. టీడీపీ, బీజేపీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్‌కు పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పవన్ కల్యాణ్ పులివెందుల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment