భర్త వేధింపులకు తాళలేక పోలీసులను ఆశ్రయించిన మహిళలను చూశాం....అత్త ఆరళ్లు భరించలేని కోడళ్ల గోడు విన్నాం.. కానీ, అత్తింటి వారు తనను భయపెట్టి, భార్యను కాపురానికి రాకుండా చేస్తున్నారంటూ ఓ అల్లుడు పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన గురువారం కాటేదాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మైలార్‌దేవ్‌పల్లి వినాయక్‌నగర్ బస్తీకి చెందిన నర్సింహకు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుజాతతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇదిలా ఉండగా, భార్యను రెండో కాన్పు కోసం తీసుకువెళ్లిన అత్తింటివారు ఏడాది దాటినా తిరిగి పంపించడం లేదు. ఇదేమని అడిగితే తనపై దాడి చేయడమే కాకుండా దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన భార్య కాపురానికి రాకపోవడంతో.. గత్యంతరం తాను కూడా అత్తారింట్లోనే ఉండేందుకు నిర్ణయించుకన్నాననీ.. ఇటీవల నాలుగు రోజులు అక్కడే ఉనన్నీ తెలిపాడు. రెండు రోజులు బాగానే చూసుకున్నా.. తర్వాత తనంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించాడు. తన భార్యను కాపురానికి పంపించేలా చూడాలని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.