NARSINHA
-
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సింగరాజుపల్లి(దేవరుప్పుల) : వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని సింగరాజుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ ఎల్లప్ప వ్యవసాయ బావి వద్ద నారుమడి కోసం మోటారు వేయగా నీళ్లు దుర్వాసనతో వచ్చాయి. వెంటనే చుట్టుపక్క పొలాల్లో ఉన్న రైతుల సహకారంతో బావిలో పరిశీలించగా గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దీనిపై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ట్రెరుునీ ఎస్సై రామారావు, ఏఎస్సై విద్యాసాగర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బావి పక్కనే ఉన్న బండరాయిపై విడిచిన బట్టలు, మరోచోట చెప్పుల జత కనిపించాయి. స్థానికుల సహకారంతో బావిలోని మృతదేహాన్ని బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక యువకులు మృతదేహాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి సింగరాజుపల్లి అల్లూరి సీతారామరాజు సెంటర్ వద్ద దాని గురించి చర్చిస్తుండగా.. అక్కడున్న పల్లపు లక్ష్మీ మృతుడిని తన అల్లుడు ఇరుగదిండ్ల నర్సింహ(30)గా గుర్తించింది. మూడు రోజులుగా అతడు కనిపించకుండా పోరుునట్లు పేర్కొంది. కాగా హైదరాబాద్‌లోని నాగోల్ సమీపంలోని తట్టె అన్నారానికి చెందిన ఇరుకుదిండ్ల నర్సింహ తమకు దగ్గరి బంధువుని పల్లపు లక్ష్మి పేర్కొంది. రెండో వివాహంగా తమ కూతురు రేణుకను ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి చేశామన్నారు. హైదరాబాద్‌లో అరటిపండ్ల కంపెనీలో పనిచేసే నర్సింహ తన భార్యను తీసుకెళ్లేందుకు మూడు రోజుల క్రితం సింగరాజుపల్లికి వచ్చాడు. అరుుతే పల్లపు లక్ష్మీ దంపతులు బాలింతరాలైన తమ కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. దీంతో తానూ కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని చెప్పి, బయటికి వెళ్లినట్లు లక్ష్మి వివరించింది. ఈక్రమంలో బావిలో శవమై కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. -
బైక్- కారు ఢీ.. ఇద్దరు మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి శివారులోని అనాజ్‌పురం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన పర్వతాలు(55), నర్సింహ(45) బైక్‌పై భువనగిరికి వచ్చి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. -
అల్లుడికి అత్తింటి వేధింపులు
భర్త వేధింపులకు తాళలేక పోలీసులను ఆశ్రయించిన మహిళలను చూశాం....అత్త ఆరళ్లు భరించలేని కోడళ్ల గోడు విన్నాం.. కానీ, అత్తింటి వారు తనను భయపెట్టి, భార్యను కాపురానికి రాకుండా చేస్తున్నారంటూ ఓ అల్లుడు పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన గురువారం కాటేదాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మైలార్‌దేవ్‌పల్లి వినాయక్‌నగర్ బస్తీకి చెందిన నర్సింహకు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుజాతతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇదిలా ఉండగా, భార్యను రెండో కాన్పు కోసం తీసుకువెళ్లిన అత్తింటివారు ఏడాది దాటినా తిరిగి పంపించడం లేదు. ఇదేమని అడిగితే తనపై దాడి చేయడమే కాకుండా దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కాపురానికి రాకపోవడంతో.. గత్యంతరం తాను కూడా అత్తారింట్లోనే ఉండేందుకు నిర్ణయించుకన్నాననీ.. ఇటీవల నాలుగు రోజులు అక్కడే ఉనన్నీ తెలిపాడు. రెండు రోజులు బాగానే చూసుకున్నా.. తర్వాత తనంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించాడు. తన భార్యను కాపురానికి పంపించేలా చూడాలని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. -
ఆ జన్మాంతం తోడై వెళ్లాడు
భార్య చితిని చూస్తూనే కన్నుమూసిన భర్త హైదరాబాద్: ఏడడుగులు నడిచి ఏడు జన్మలు తోడుంటానని తాళి కట్టే సమయంలో చేసుకున్న వాగ్ధానాన్ని నిజం చేస్తూ ప్రాణాలొదిలాడో వృద్ధుడు. బతికున్నంతకాలం ఎంతో అన్యోన్యంగా జీవించిన దంపతులు చావులోనూ వీడలేకపోయారు. భార్య మృతిని తట్టుకోలేక ఆమె చితి వద్దే ప్రాణాలొదిలాడు భ ర్త. ఆజన్మాంతం తోడున్నాను.. చావులోనూ నీతోనే ఉంటానంటూ తనువు చాలించాడు. ఈ సంఘటనను చూసిన కుటుంబ సభ్యుల, బంధువుల దుఃఖం కట్టలు తెంచుకుంది. తాను నడవలేని స్థితిలో ఉన్నా కూడా భార్యను కడసారి చూపు చూడాలనే ఆశతో శ్మశాన వాటికకు వెళ్లి చివరకు ఆమె చితి పక్కనే కన్ను మూయడం పలువుర్ని తీవ్రంగా కలచి వేసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఉప్పల్ బీరప్పగడ్డకు చెందిన గర్నెపల్లి నర్సింహ(80), మీనమ్మ(75) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు సత్యనారాయణ, భిక్షపతి, వెంకటేష్ కుమార్, కూతురు భారతమ్మ ఉన్నారు. కాగా మీనమ్మ అనారోగ్యంతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందింది. బుధవారం కుటుంబ సభ్యులు మీనమ్మ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఉప్పల్ నాలా వద్దగల శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. భర్త నర్సింహ తాను నడవలేని స్థితిలో ఉన్నా కూడా కడసారిగా తన భార్యను చూడాలని పట్టుబట్టడంతో అతడిని ఆటోలో శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. అంత్యక్రియల్లో భాగంగా చిన్న కొడుకు వెంకటేష్ చితి చుట్టూ తిరిగి నిప్పు పెట్టేలోపు అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న నర్సింహ కూడా కన్నుమూశాడు. దీంతో హతాశులైన కుటుంబ సభ్యులు కాసేపటి తరువాత నర్సింహ మృతదేహానికి కూడా అక్కడే అంత్యక్రియలు చేశారు. (ఉప్పల్) -
అత్తారింటికి వెళ్తే..
అల్లుడిని చితకబాదిన అత్త తాగిన మైకంలో చిందులు తీవ్రగాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అమాయక అల్లుడు కాటేదాన్,న్యూస్‌లైన్: మేనత్తను తన తాతయ్య వద్దకు తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడి చివరకు ఒప్పించి మెప్పించి తీసుకెళ్తాడు హీరో.. ఇది ఇటీవల వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఉద్దేశం. కానీ కట్టుకున్న భార్యను పంపించండి అత్తా..అని మర్యాదగా అడిగినందుకు తీవ్రంగా దాడిచేసింది ఇక్కడి అత్త. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బుద్వేల్‌లో జరిగింది. తాగిన మైకంలో అత్త చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన అల్లుడు చివరకు ఎలాగోలా బయటపడి పోలీసులను ఆశ్రయిం చాడు. వివరాలి ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన నర్సింహకు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన శంకరమ్మ కూతురితో మూడేళ్లక్రితం పెళ్లయ్యింది. పదిరోజుల క్రితం నర్సింహ భార్య పుట్టింటికొచ్చింది. కూలీ పనిచేసుకునే నర్సింహ తనభార్యను కాపురానికి పంపించాలంటూ శుక్రవారం నగరానికొచ్చి అత్త శంకర మ్మను కోరాడు. అంతే అప్పటికే తాగినమైకంలో ఉన్న అత్త నర్సింహపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. అంతటితో ఆగకుండా కొట్టి జేబులో ఉన్న డబ్బులు లాక్కొని ఏంచేసుకుం టావో చేసుకోపో..అని తరిమేసింది. నుదిటిపై తీవ్రగాయమై రక్తంరావడంతో అల్లుడు నర్సింహ అత్తపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్దఉన్న డబ్బులు లాక్కుందని, ఊరికివెళ్లేం దుకు ఎవరైనా చిల్లర డబ్బులిస్తే వెళ్లిపోతానంటూ పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతిఒక్కరినీ నర్సింహ వేడుకోవడం విస్మయానికి గురిచేసింది.