సింగరాజుపల్లి(దేవరుప్పుల) : వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని సింగరాజుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ ఎల్లప్ప వ్యవసాయ బావి వద్ద నారుమడి కోసం మోటారు వేయగా నీళ్లు దుర్వాసనతో వచ్చాయి. వెంటనే చుట్టుపక్క పొలాల్లో ఉన్న రైతుల సహకారంతో బావిలో పరిశీలించగా గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దీనిపై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ట్రెరుునీ ఎస్సై రామారావు, ఏఎస్సై విద్యాసాగర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బావి పక్కనే ఉన్న బండరాయిపై విడిచిన బట్టలు, మరోచోట చెప్పుల జత కనిపించాయి. స్థానికుల సహకారంతో బావిలోని మృతదేహాన్ని బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక యువకులు మృతదేహాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి సింగరాజుపల్లి అల్లూరి సీతారామరాజు సెంటర్ వద్ద దాని గురించి చర్చిస్తుండగా.. అక్కడున్న పల్లపు లక్ష్మీ మృతుడిని తన అల్లుడు ఇరుగదిండ్ల నర్సింహ(30)గా గుర్తించింది. మూడు రోజులుగా అతడు కనిపించకుండా పోరుునట్లు పేర్కొంది.
కాగా హైదరాబాద్‌లోని నాగోల్ సమీపంలోని తట్టె అన్నారానికి చెందిన ఇరుకుదిండ్ల నర్సింహ తమకు దగ్గరి బంధువుని పల్లపు లక్ష్మి పేర్కొంది. రెండో వివాహంగా తమ కూతురు రేణుకను ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి చేశామన్నారు. హైదరాబాద్‌లో అరటిపండ్ల కంపెనీలో పనిచేసే నర్సింహ తన భార్యను తీసుకెళ్లేందుకు మూడు రోజుల క్రితం సింగరాజుపల్లికి వచ్చాడు. అరుుతే పల్లపు లక్ష్మీ దంపతులు బాలింతరాలైన తమ కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. దీంతో తానూ కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని చెప్పి, బయటికి వెళ్లినట్లు లక్ష్మి వివరించింది. ఈక్రమంలో బావిలో శవమై కనిపించడం అనుమానాలకు తావిస్తోంది.