ఆరేళ్ల చిన్నారిపై ఓ మృగాడు అత్యాచారం జరిపి హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో మంగళవారం వెలుగుచూసింది.
ఏర్పేడు, న్యూస్‌లైన్ : ఆరేళ్ల చిన్నారిపై ఓ మృగాడు అత్యాచారం జరిపి హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కుక్కలగుంట ఎస్టీ కాలనీకి చెందిన సూరింవారి వుణి, రేఖ దంపతుల కువూర్తె సుజాత(6) ఆదివారం వుధ్యాహ్నం ఆడుకునేందుకు స్థానిక పాఠశాల వద్దకు వెళ్లింది. ఈ సవుయుంలో గ్రావూనికి చెందిన గిలకల గిరి(25) ఆమెకు వూయువూటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు. సాయుంత్రమైనా కువూర్తె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వుంగళవారం ఉదయుం గ్రామానికి సమీపంలో ఉన్న చెరుకు తోటలో సుజాత వుృతదేహం కనిపించింది. నిందితుడు పరారవుతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.