ఖమ్మం జిల్లాలో ఇద్దరు మృతి
జిల్లాలో జరిగిన ఘటనల్లో మరో ఇద్దరు వృద్ధులు దుర్మరణం
మహబూబాబాద్ రూరల్: పుష్కర స్నానం కోసం బయలుదేరిన మానుకోటకు చెందిన ఇద్దరు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతుల బంధువులు, ప్రత్యక్ష సాక్షుల కథనం.. మానుకోట మండలం వీఎస్ లక్ష్మీపురం మంక్త్యాతండాకు చెందిన బానోత్ గంగమ్మ, ఆమె కుమారుడు బాలకృష్ణ అలియాస్ నరేష్, కోడలు సుజాత, బానోత్ సామ్లీ, ఆమె కొడుకు గణేష్, కోడలు మంగమ్మ, మనుమలు రామ్‌చరణ్, కిరణ్‌కుమార్, ఇదే తండాకు చెందిన బానోత్ సంధ్య, బానోత్ బాబురావు, బానోత్ ప్రవీణ్‌లు టాటాఏస్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుష్కర స్నానం కోసమని బుధవారం రాత్రి 10 గంటలకు బయలుదేరారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న టాటాఏస్- డీసీఏం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బానోత్ బాలకృష్ణ అలియాస్ నరేష్ (25), బానోత్ కిరణ్‌కుమార్ (01) అక్కడిక్కడే మృతిచెందారు.
కొత్తగట్టులో వృద్ధురాలు..
ఆత్మకూరు: పుష్కర యాత్రకు వచ్చిన ఓ ఓవృద్ధురాలు మండలంలోని కొత్తగట్టు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నగరంచింతల శాంతమ్మ (68) బంధువులతో కలిసి 20న రాత్రి తిరుపతి నుంచి మినీ బస్సులో పుష్కర, తీర్థయాత్రలకు బయలుదేరింది. బుధవారం రాత్రి కొత్తగట్టు సమీపంలో శాంతమ్మ మూత్ర విసర్జనకని బస్సు దిగింది. రోడ్డు దాటుతుండగా పరకాలకు వెళ్తున్న కారు శాంతమ్మ ను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
పుష్కరాలకు వస్తూ పరలోకాని
ఏటూరునాగారం: నల్గొండ జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన గొర్రెంకల పెంటమ్మ (60) టాటాఏస్‌లో రామన్నగూడెం పుష్కరఘాట్‌కు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున తాడ్వాయి, చిన్నబోయినపల్లి మధ్య వాహనం ప్రమాదానికి గురికావడంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది.
పుష్కరాలకు వెళ్తూ పరలోకాలకు..
Published Fri, Jul 24 2015 2:14 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement