Pushkarni bath
-
ఇది శిశుపాలుడిలాంటి సర్కారు
నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి • శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తోంది.. దేవుడు క్షమించడు • పుష్కర స్నానాలకు వెళ్లి విద్యార్థులు చనిపోతే.. • ఈతకెళ్లి మృతి చెందారనడం దుర్మార్గం • విద్యార్థుల మృతికి ఇసుక మాఫియానే ప్రధాన కారణం • వారి మరణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి • ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల సహాయం అందించాలి • బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్ సాక్షి ప్రతినిధి, అమరావతి/వీరులపాడు : పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఈతకెళ్లి మృత్యువాతపడ్డారంటూ దుర్మార్గంగా మాట్లాడుతోంది... ఇంతకంటే దుర్మార్గపు చర్య మరొకటి ఉంటుందా? అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తోందని, ఆ తర్వాత దేవుడు కూడా క్షమించడని నిప్పులు చెరిగారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబే విద్యార్థుల మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కర స్నానాలకు వెళ్లి చనిపోయిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పుష్కర స్నానాలకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్నారు. చందర్లపాడు మండలం ఏటూరు ఘాట్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్నానాలకు వచ్చే భక్తులకు పులిహోర పంపిణీ చేసిన అధికార పార్టీ నేతలు.. విద్యార్థులు చనిపోయిన తర్వాత ఏటూరు ఘాట్ అనధికారికమని మాట మార్చారని విమర్శించారు. అక్కడ ఘాట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే, నాయకుల స్వాగత ఫ్లెక్సీలు ఉన్నాయని, పుష్కర స్నానాలు చేస్తున్న వార్తా కథనాలు ఈనాడు పత్రికలోనూ వచ్చాయని చెబుతూ.. పత్రిక క్లిప్పింగ్ చూపించారు. ‘అసలు నా కుమారునికి ఈత కొట్టటమే రాదు. విధి ఆడిన వింత నాటకంలో అనాథలుగా మిగిలాం’ అని నగేష్ తండ్రి రాజగోపాలాచారి బోరున విలపించడం కలిచివేసిందని చెప్పారు. పుష్కరాల పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, బినామీలకు నామినేషన్ మీద పనులు అప్పగించి అందినకాడికి దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఇసుక మాఫియానే మింగేసింది మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అసత్య ప్రచారాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతికి ప్రభుత్వం ప్రోత్సహించిన ఇసుక మాఫియానే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. అధికార పార్టీ నాయకులు నిబంధనలను ఉల్లంఘించి నదిలో సుమారు 50 అడుగుల లోతు వరకు ఇసుక తోడి గుంతలు చేశారని చెప్పారు. ఈ విషయం తెలియని విద్యార్థులు నదిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల సహాయం అందించిన విధంగా కృష్ణా పుష్కరాలలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కూడా రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చేతులు దులుపుకున్న ప్రభుత్వం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నానని తెలుసుకుని అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హడావిడిగా మృతుల కుటుంబాలను పరామర్శించి రూ.3 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారని జగన్ విమర్శించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. యూనిఫాం నిబంధన లేకుంటే బతికేవాడు చెరువుకొమ్ము పాలెం(నందిగామ): డిగ్రీ కాలేజీలో యూనిఫాం నిబంధన లేకుంటే తన అన్న బతికేవాడని పాశం గోపిరెడ్డి చెల్లెలు శ్రావణి జగన్ వద్ద వాపోయింది. నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంలో గోపిరెడ్డి తల్లిదండ్రులను వారింటికి వెళ్లి జగన్ పరామర్శించారు. యూనిఫాం తప్పకుండా ధరించాలనే నిబంధన లేకుంటే.. తన అన్న గోపిరెడ్డి పుష్కర స్నానానికి వెళ్లేవాడు కాదని శ్రావణి ఈ సందర్భంగా చెప్పింది. పుష్కరాలు వచ్చి తమ ఇంట్లో విషాదం తెచ్చిపెట్టాయని గోపిరెడ్డి తల్లిదండ్రులు వెంకటేశ్వరరెడ్డి, రజని కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది జయంతి (వీరులపాడు)/ తోటరావులపాడు(చందర్లపాడు): పుష్కర స్నానాల్లో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. తమను ఓదార్చడానికి వచ్చిన జగన్‌ను చూడగానే నగేష్ తల్లిదండ్రులు రాజ గోపాలచారి, దుర్గారాణి, సోదరి స్రవంతి కన్నీటి పర్యంతమయ్యారు. ‘వైఎస్ అన్నా, మీరన్నా నగేష్‌కు ఎంతో అభిమానం. జగనన్నను ఒక్కసారైనా కలవాలని అంటుండేవాడు. చివరకు నగేష్ మృతి చెందితే మమ్మలను పరామర్శించటానికి వచ్చావా అన్నా’ అంటూ గుండెలవిసేలా రోదించారు. ‘రోజుటి మాదిరిగానే ఆ రోజు కూడా కళాశాలకు వెళుతున్నాని చెప్పి వెళ్లాడు. యూనిఫాం వేసుకురాలేదని యాజమాన్యం బయటకు పంపటంతో 11 మంది స్నేహితులుతో కలిసి పుష్కర స్నానానికి వెళ్లినట్లు తెలిసింది. నా కుమారుడు పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందితే ఈతకు వెళ్లి మృతి చెందాడని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నా కుమారునికి ఈత కొట్టటమే రాదు’ అంటూ బోరున విలపించారు. కుటుంబానికి అండగా ఉంటామని నగేష్ తల్లిదండ్రులను ఓదార్చి.. చమర్చిన కళ్లతో జగన్ వెనుదిరిగారు. అనంతరం పుష్కరస్నానానికి వెళ్లి మృతి చెందిన ములకలపల్లి హరీష్ కుటుంబ సభ్యులను చందర్లపాడు మండ లం తోటరావులపాడు గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతుడు హరీష్ తండ్రి ముకుందరావు, తల్లి చిట్టెమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
పుష్కరాలకు వెళ్తూ పరలోకాలకు..
ఖమ్మం జిల్లాలో ఇద్దరు మృతి జిల్లాలో జరిగిన ఘటనల్లో మరో ఇద్దరు వృద్ధులు దుర్మరణం మహబూబాబాద్ రూరల్: పుష్కర స్నానం కోసం బయలుదేరిన మానుకోటకు చెందిన ఇద్దరు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతుల బంధువులు, ప్రత్యక్ష సాక్షుల కథనం.. మానుకోట మండలం వీఎస్ లక్ష్మీపురం మంక్త్యాతండాకు చెందిన బానోత్ గంగమ్మ, ఆమె కుమారుడు బాలకృష్ణ అలియాస్ నరేష్, కోడలు సుజాత, బానోత్ సామ్లీ, ఆమె కొడుకు గణేష్, కోడలు మంగమ్మ, మనుమలు రామ్‌చరణ్, కిరణ్‌కుమార్, ఇదే తండాకు చెందిన బానోత్ సంధ్య, బానోత్ బాబురావు, బానోత్ ప్రవీణ్‌లు టాటాఏస్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుష్కర స్నానం కోసమని బుధవారం రాత్రి 10 గంటలకు బయలుదేరారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న టాటాఏస్- డీసీఏం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బానోత్ బాలకృష్ణ అలియాస్ నరేష్ (25), బానోత్ కిరణ్‌కుమార్ (01) అక్కడిక్కడే మృతిచెందారు. కొత్తగట్టులో వృద్ధురాలు.. ఆత్మకూరు: పుష్కర యాత్రకు వచ్చిన ఓ ఓవృద్ధురాలు మండలంలోని కొత్తగట్టు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నగరంచింతల శాంతమ్మ (68) బంధువులతో కలిసి 20న రాత్రి తిరుపతి నుంచి మినీ బస్సులో పుష్కర, తీర్థయాత్రలకు బయలుదేరింది. బుధవారం రాత్రి కొత్తగట్టు సమీపంలో శాంతమ్మ మూత్ర విసర్జనకని బస్సు దిగింది. రోడ్డు దాటుతుండగా పరకాలకు వెళ్తున్న కారు శాంతమ్మ ను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పుష్కరాలకు వస్తూ పరలోకాని ఏటూరునాగారం: నల్గొండ జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన గొర్రెంకల పెంటమ్మ (60) టాటాఏస్‌లో రామన్నగూడెం పుష్కరఘాట్‌కు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున తాడ్వాయి, చిన్నబోయినపల్లి మధ్య వాహనం ప్రమాదానికి గురికావడంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. -
బంపర్ ఆఫర్!
- నక్కపల్లి నుంచి ఆటోలో రూ.200లు - గాజువాక నుంచి వ్యాన్‌లో రూ.350లు - తిరుగు ప్రయాణంలోనూ దైవ దర్శనాలు - ఆసక్తి చూపుతున్న పుష్కర యాత్రికులు సాక్షి, విశాఖపట్నం: పుష్కర స్నానం చేయడమే జీవిత పరమార్థంగా భావిస్తున్న యాత్రిలకు ఆటోలు, వ్యాన్ల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఆర్టీసీతో పోల్చుకుంటే అతి తక్కువ చార్జీకే వీరు రాజమండ్రి తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. పైగా 12 నుంచి 16 గంటల్లోపై యాత్ర ముగించి ఇంటి వద్ద దించుతున్నారు. డబ్బు, సమయం కూడా ఆదా అవుతుండడంతో పలువురు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. గాజువాక, అనకాపల్లి నుంచి టాటా ఏస్, మ్యాజిక్, తూఫాన్, జీపులు వంటి వాహనాల్లో వాటి యజమానులు రాజమండ్రికి ట్రిప్పులు వేస్తున్నారు. ఒక్కో వాహనంలో కనీసం 12 నుంచి 15 మందిని ఎక్కించుకుంటున్నారు. ఈ ప్యాకేజీలో గాజువాక నుంచి రూ.4500-5000లు, అనకాపల్లి నుంచైతే రూ.4000లు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కొక్కరికి సగటున రానూపోనూ రూ.300 నుంచి 350లకు మించడం లేదు. గాజువాక నుంచి రాజమండ్రికి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.200.లు, డీలక్స్‌కు రూ.220లు, సూపర్ లగ్జరీకి రూ.250లు టిక్కెట్టు ధర ఉంది. మరోవైపు నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం తదితర ప్రాంతాల నుంచి ఆటోలను నేరుగా 100-120 కి.మీల దూరంలో ఉన్న రాజమండ్రికి తిప్పుతున్నారు. ఆయా చోట్ల నుంచి ఒక్కొక్కరికి కేవలం రూ.200లకే పుష్కరాలకు తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. ఆటోలు, వ్యాన్లు చిన్న వాహనాలు కావడంతో పుష్కర ఘాట్ల సమీపం వరకూ వెళ్లనిస్తున్నారు. దీనివల్ల వీరికి ఎక్కువ దూరం నడవాల్సిన పనీ లేదు. రాజమండ్రి లోని పుష్కర ఘాట్లు రద్దీగా ఉంటే ఆవల భక్తుల తాకిడి తక్కువగా ఉన్న కొవ్వూరు ఘాట్లకూ తీసుకెళ్తున్నారు. తిరుగు ప్రయాణంలో దారిలో ఉన్న పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మ ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో ఆటోవాలాకు డీజిల్ ఖర్చు రూ.500లు పోను రోజుకు రూ.1500ల ఆదాయం సమకూరుతోంది. ఇది ఉభయ తారకంగా ఉండడంతో పదేసి మంది కలిసి ఒక ఆటోను బుక్ చేసుకుని పుష్కరయాత్ర పూర్తి చేసుకుంటున్నారు. ఆర్టీసీతో పోల్చుకుంటే వ్యాన్, జీపు, ఆటో చార్జీలు బాగా తక్కువ ఉండడం, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కకపోవడం, కిలోమీటర్ల మేర నడక తప్పడం వంటివి బేరీజు వేసుకుని వాటికి మొగ్గు చూపుతున్నారు. పైగా ఉదయం బయల్దేరితే సాయంత్రానికో, రాత్రికో తీసుకొచ్చి దించేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఇవెంతో ఉపయోగంగా ఉంటున్నాయి. -
గుండె నిండా గోదారి
పుష్కర స్నానం ఎవరు చేస్తారు? అంటే సాధారణంగా పెద్దలు, వృద్ధులు, భక్తి,ఆధ్యాత్మిక భావాలున్నవారు అని టక్కున చెబుతాం.. కానీ ప్రస్తుత పుష్కరాలకు అన్ని వయసులవారూ తరలివస్తున్నారు. ముఖ్యంగా యువతరంగం ఉప్పొంగుతోంది. పుష్కర స్నానం పుణ్యఫలం అని భావించిన తల్లిదండ్రులు, నడివయస్సు వారు తమ చిన్నారులను తీసుకొస్తుంటే.. జీవిత పడమటి పొద్దున ఉన్న వృద్ధులు మళ్లీ పుష్కరాలు చూసే అవకాశం వస్తుందో లేదోనని స్నానానికి తరలివస్తున్నారు. యువత పుణ్యంతోపాటు ఆనందానుభూతులు ఆస్వాదించడానికి వెల్లువలా గోదారి చెంతకు పోటెత్తుతున్నారు. చిన్నారులు, యువకులు అఖండ గోదారి అందాలను చూసి పులకించిపోతున్నారు. గుండెనిండా గోదారిని నింపుకుని ఉత్సాహంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. యువకులు నదీమతల్లి ఒడిలో సెల్ఫీలు తీసుకుంటూ విన్యాసాలు చేస్తున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ పుష్కరానుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నానాలకు తరలివచ్చిన యువతలో కొందరి మనోగతం ఇదీ..! - సాక్షి, రాజమండ్రి/వీఐపీఘాట్ (రాజమండ్రి) పుష్కరాలను ఎంజాయ్ చేశా.. మాది విజయనగరం. సోమవారం పుష్కరాలకు స్నేహితులతో కలిసి వచ్చా. ప్రయాణ కష్టాలను పక్కన పెడితే లక్షలాది మందితో గోదావరి కన్నుల పండుగగా ఉంది. భక్తి గురించి తెలియదు కానీ.. ఇంతమంది మధ్యలో పుష్కర స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేశా. మంచి అనుభూతి మిగిలింది. - హరీష్, డిగ్రీ విద్యార్థి, విజయనగరం పుష్కరాల కోసమే వచ్చా.. గోదావరి గురించి పెద్దలు చెబితే విన్నాం. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో గోదాట్లో మునిగితే మంచిదన్నారు. అందుకే వచ్చాం. చాలా బాగుంది. లక్షల మందితో కలిసి గోదావరిలో మునగడం ఇంకా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం. - మౌనిక, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం. వాసవీ కాలేజ్, హైదరాబాద్ అమ్మా.. నాన్నలు చెబితే వచ్చా.. మాది విజయవాడ. గోదావరి గురించి అమ్మానాన్నలు చెప్పారు. పుష్కరాలు చాలా గొప్పగా జరుగుతాయన్నారు. పుష్కర స్నానం చేస్తే మంచిదంట. గోదావరిలో మునగడం గొప్ప ఎంజాయ్మెంట్. అందుకే వచ్చా. - మానస, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం. బెంగళూరు దయానందసాగర్ కాలేజీ పుష్కరాలను చూద్దామని.. పుష్కరాలను ఇంతకు ముందు చూడలేదు. ఎలా జరుగుతాయో చూడాలని వచ్చా. పైగా మా పెద్దలు గోదావరిలో మునిగితే పుణ్యమన్నారు. పుణ్యంతో పాటు ఎంజాయ్ చేయొచ్చని వచ్చా. ఆనందంగా ఉది. - మానస,ఇంటర్ ,విశాఖపట్టణం భక్తితోపాటు ఆనందం కూడా.. మాది నిడదవోలు. గోదావరి పుష్కరాలలో స్నానాలు చేస్తే మంచిదన్నారు. అందుకే గోదావరి తల్లిని మొక్కేందుకు వచ్చాం. భక్తితోపాటు ఆనందం కూడా పొందాం. పుష్కరాలు చూడడం మరవలేని అనుభూతి. - శిరీష, బీటెక్, లావణ్య ఇంటర్ రెండవ సంవత్సరం భక్తితోనే వచ్చాం.. మాది హైదరాబాద్. గోదావరి పుష్కరాలలో స్నానాలు చేస్తే మంచిదన్న నమ్మకం. మా పెద్దలు ఇదే చెప్పారు. అందుకే పుష్కరాలకు వచ్చాం. లక్షల మంది జనం మధ్య గోదావరి తీరాన్ని చూస్తే అద్భుతంగా ఉంది. చూడడానికి రెండు కళ్లూ చాలట్లేదు. ఇది మధురానుభూతి. - అఖిల్, బీటెక్ బెంగళూర్, నీహారిక బీటెక్ రెండో సంవత్సరం, గాయత్రి కాలే జ్ వైజాగ్ -
మహాజనపాతం
గోదావరికి వెల్లువొచ్చినట్టు.. పుష్కర రాజధాని రాజమహేంద్రిని ముంచెత్తిన జనప్రవాహం.. జలపాతాన్ని తలపించింది. పావన గోదావరిలో పుణ్యస్నానం చేయాలన్న ఆతృతతో అన్నివైపుల నుంచీ భక్తజనవాహిని ఈ నగరిని చుట్టేసింది. ఏ రోడ్డు చూసినా.. ఏ సందు చూసినా.. గుంపులుగుంపులుగా సాగుతున్న జనమే.. వారు నడిచే ప్రతి దారీ గోదారి దరికే దారి తీశాయి. వారు చేరిన ప్రతి కూడలీ అడుగుతీసి అడుగు వేయలేనంతగా కిక్కిరిసిపోయాయి. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి నగరం.. సోమవారం జనసాగరమే అయింది. జిల్లాలోని ఇతర స్నానఘట్టాల్లోనూ ఇటువంటి దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయి. - ఘాట్ల వద్ద జనజాతర - సోమవారం ఒక్క రోజే 35 లక్షల మంది పుష్కర స్నానం - నేటితో రెండు కోట్లు దాటనున్న యాత్రికుల సంఖ్య రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు పోటెత్తిన భక్తజన వరద కాస్త తగ్గినా.. పుష్కరాల ప్రధాన వేదికగా ఉన్న రాజమండ్రి నగరం, జిల్లాలోని గోదావరి తీర గ్రామాలు ఇంకా జనవాహిని ముంపులోనే ఉన్నాయి. శని, ఆదివారాలతో పోల్చుకుంటే జనం కొంతవరకూ తగ్గినా కానీ అంచనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో యాత్రికులు సోమవారం కూడా పుష్కర స్నానాలకు తరలివచ్చారు. వారి రాకతో రాజమండ్రి నగరం, గ్రామీణ ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లు, ఆయా ప్రాంతాలు కిటకిటలాడాయి. రాజమండ్రి నగరంలోని కొన్ని ప్రాంతాలు ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన జనంతో కిక్కిరిసిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా 35,11,746 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. రాత్రికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా. పుష్కరాలు ఆరంభమైన తరువాత ఇప్పటి వరకు 1.91 కోట్ల మందికిపైగా భక్తులు స్నానాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తొలి రోజైన 14న 18.01 లక్షలు, 15న 16.32 లక్షలు, 16న 22.42 లక్షలు, 17న 22.11 లక్షలు, 18న 38.95 లక్షలు, 19న 37.86 లక్షలు, సోమవారం 35.11 లక్షల (రాత్రి తొమ్మిది గంటలకు) మంది స్నానాలు చేశారు. 1.40 లక్షల పిండప్రదానాలు జరిగాయి. సోమవారం గ్రామీణ ఘాట్లలో సైతం భక్తుల తాకిడి స్వల్పంగా తగ్గింది. కోటిపల్లిలో 2 లక్షల మంది స్నానాలు చేయడం గమనార్హం. అప్పనపల్లి ఘాట్‌లో 1.50 లక్షలు, సోంపల్లిలో 90 వేలు, మురమళ్లలో 50 వేలు, గేదెల్లంకలో 35 వేలు, కుండలేశ్వరంలో 65 వేల మంది చొప్పున భక్తులు స్నానాలు చేశారు. నేటితో రెండు కోట్లు జిల్లావ్యాప్తంగా పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య మంగళవారంతో రెండు కోట్లకు చేరనుంది. గడచిన ఏడు రోజుల్లో ఇప్పటివరకూ 1.91 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. మరో 9 కోట్ల మంది భక్తులు స్నానం చేస్తే భక్తుల సంఖ్య రెండు కోట్లకు చేరనుంది. నిరంతరాయంగా 24 గంటలూ స్నానాలకు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ఉదయానికే స్నానాలు చేసినవారి సంఖ్య రెండు కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 24 గంటల స్నానంతో తగ్గిన ఒత్తిడి పుష్కర స్నానాలకు వచ్చే యాత్రికుల సంఖ్య స్వల్పంగా తగ్గడంతోపాటు, 24 గంటలూ స్నానాలు చేసే అవకాశం కల్పించడంతో ఘాట్ల వద్ద భక్తుల సందడి చాలావరకూ తగ్గినట్టు కనిపించింది. ప్రముఖుల పుష్కర స్నానాలు సోమవారం పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటి జయప్రద పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కర స్నానానికి వచ్చిన జయప్రద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ సినీ హాస్య నటులు గౌతంరాజు, చిట్టిబాబు కూడా పుష్కర స్నానాలు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కమిషనర్ పూనం మాలకొండయ్య, వైఎస్సార్సీపీకి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పుష్కర స్నానాలు చేసినవారిలో ఉన్నారు. -
పుష్కర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు
ఏటూరునాగారం : పుష్కర స్నానం చేసేందుకు గోదావరి నదిలో లోతుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతైన సంఘటన శనివారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని సింగారంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. సింగారం గ్రామానికి చెందిన గడ్డం ముకుందరావు, ఆయన భార్య స్వాతి, యశ్వంత్, భార్గవి, తన అక్క కొడుకు గడ్డం ప్రవీణ్‌కుమార్‌తో కలిసి గోదావరి స్నానానికి వెళ్లారు. గోదావరిలో సరదాగా ముకుందరావు, ప్రవీణ్ కుమార్‌లు ఈతకొడుతుండగా ఒక్కసారిగా నదిలో పెద్ద గొయ్యి రావడంతో మునిగిపోయారు. నీళ్లు మింగుతూ బుడుగలు పైకి వ చ్చారుు. ఒడ్డుపై ఉన్న స్వాతి, గ్రామస్తులు ఇద్దరు మునిగిపోతున్నారని కేకలు వేసి లబోదిబోమని మొత్తుకున్నారు. ఆ సమయంలో ఈత వచ్చిన వ్యక్తులు దగ్గరలో లేకపోవడంతో వారిని కాపాడుకోలేకపోయామని స్వాతి రోదిస్తూ తెలిపింది. -
లండన్ డాక్టర్‌కు డ్రైవర్ బురిడీ
లండన్ డాక్టర్‌కు డ్రైవర్ బురిడీ పుష్కరాల్లో కారు, నగలుతో ఉడాయించిన వైనం రాజమండ్రి క్రైం: లండన్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తూ.. పుష్కరాల కోసం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన డాక్టర్ రెడ్డి నారాయణచౌదరి కారు, నగలు తీసుకుని డ్రైవర్ ఉడాయించాడు. 13న లండన్ నుంచి మండపేట వచ్చిన నారాయణచౌదరి శనివారం కుటంబసభ్యులతో రాజమండ్రి చేరుకున్నారు. నగరంలోని ఒక హోటల్ వద్ద కారు నిలిపి కుటుంబసభ్యులతో పుష్కర స్నానం ఆచరించేందుకు వీఐపీ ఘాట్‌కు వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా కారు(ఏపీ 28 డీఆర్ 4408), డ్రైవర్ గౌతమ్‌కృష్ణ కనిపించలేదు. డ్రైవర్‌కు ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారులో 5.5 లక్షల విలువైన డైమండ్ రింగులు, చెవి పోగులు, నగలు, రూ. 60వేల నగదు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. కూకట్‌పల్లికి చెందిన గౌతమ్‌కృష్ణను 13 నుంచి ఆప్టింగ్ డ్రైవర్‌గా పెట్టుకున్నామని నారాయణచౌదరి చెప్పారు. -
అటెన్షన్ ప్లీజ్
2004 కృష్ణా పుష్కరాల్లో ఐదుగురు మృతి గోదావరి పుష్కరాల్లో 27మంది దుర్మరణం ఆ అనుభవాలతో పాఠాలు నేర్వండి కృష్ణా పుష్కర ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళిక అవసరం ప్రజాప్రతినిధులు, అధికారులూ ఇప్పుడే మేల్కోండి పరమ పవిత్రమైన పుష్కరస్నానం పాపాలు తొలగించే పుణ్యయాత్ర కావాలి గానీ.. చిన్నచిన్న మానవ తప్పి దాలకు కన్నీటి యాత్రగా మిగిలిపోకూడదు. గోదావరి పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో 27మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుణపాఠంగా నేర్చుకుని కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. కోట్లలో ఖర్చు చూపించి ప్రచారం ఆర్భాటంగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు సమన్వయంతో సౌకర్యాలు కల్పిస్తేనే పుష్కరాలు విజయవంతమవుతాయన్నది సత్యం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలపై ‘సాక్షి’ కథనం.. విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల్లో తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా 27మంది భక్తుల ప్రాణాలు పోయాయి. మానవ తప్పిదంతో పాటు ప్రచార ఆర్భాటం.. సౌకర్యాల లేమి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో కృష్ణానదికి పుష్కరాలు జరగనున్నాయి. నూతన రాజధానిలో జరిగే తొలి పుష్కరాలు కావడంతో భారీ అంచనాలే ఉంటాయి. కాబట్టి అధికారులు స్పందించి ఇప్పటి నుంచే కృష్ణా పుష్కర ఏర్పాట్లపై దృష్టిసారిస్తే బాగుంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ దుర్ఘటనను మరిచిపోకండి 2004వ సంవత్సరంలో జరిగిన కృష్ణా పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ఐదుగురు చనిపోయారు. తొలిరోజు తెల్లవారుజామునే కృష్ణానది అప్రాన్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 15మంది గాయాలపాలయ్యారు. దీంతో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే స్పందించి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని కృష్ణా పుష్కరాలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుర్గాఘాటే కీలకం సుమా.. కృష్ణా పుష్కరాలకు దుర్గాఘాటే కీలకం. ఇంద్రకీలాద్రి దిగువనే ఉన్న ఈ ఘాట్‌లో స్నానం ఆచరించి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక ప్రాధాన్యతనిస్తారు. దీంతో ఘాట్‌కు రోజూ లక్షలమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దుర్గాఘాట్‌తో పాటు భవానీ, పున్నమి, పద్మావతి, సీతమ్మవారి పాదాల ఘాట్లను ఇప్పటినుంచే అభివృద్ధి చేయడం ప్రారంభించాలి. చివరి నిమిషంలో పనులు తల పెడితే తూతూమంత్రంగా ముగించే అవకాశం ఉంది. ఇక పనులు ప్రారంభించాలి ►ప్రతి ఘాట్లోనూ రోజూ కనీసం 10వేల నుంచి 25వేల మంది భక్తులు పుణ్యసాన్నాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఘాట్లలో సౌకర్యాలు కల్పించడం తప్పనిసరైన విషయం. ► వీఐపీలు వారికి కేటాయించిన ఘాట్లలోనే స్నానాలు ఆచరించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ► ఘాట్ల వద్ద ఒకేసారి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తొక్కిసలాట జరగకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటుచేసి భక్తుల్ని క్రమపద్ధతిలో నదిలో వదిలేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ► వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు నదిలో దిగి ప్రమాదాలకు గురికాకుండా జల్లు సాన్నాలు ప్రతి స్నాన ఘట్టంలోనూ కనీసం వంద చొప్పున ఏర్పాటు చేయాలి. నదిలోకి వెళ్లి స్నానం చేద్దామనే వికలాంగుల కోసం ర్యాంపులు అవసరం. ►మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మొబైల్ టాయిలెట్లు ఒక్కో ఘాట్లోనూ కనీసం 50 చొప్పున ఏర్పాటుచేయాలి. ఘాట్లలో తాగేందుకు మంచినీటి పంపులు సిద్ధం చేయాలి. ►ఇక విద్యుత్ సదుపాయాలు, జనరేటర్లు, క్యూలైన్లు ఇప్పటి నుంచే ప్రారంభిస్తే నాణ్యతతో కూడిన ఏర్పాట్లు భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ► ఘాట్లు లేని ప్రదేశాల్లో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రయత్నించకుండా నో ఎంట్రీ బోర్డులు సిద్ధం చేయాలి. అప్రాన్ వంటి ప్రదేశాల్లో స్నానాలకు దిగినప్పుడు, నదిలో సుడిగుండాలు ఉన్న ప్రదేశాలను ఇప్పటినుంచే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. భక్తులను హెచ్చరించాలి. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు కీలకం కృష్ణానదిలో స్నానాలు చేసిన భక్తులు ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైన కీలక ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలి. ►దర్శనం కోసం వచ్చే వారికోసం ఐదువరసల క్యూలు ఏర్పాటుచేయాలి. ►దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదం తీసుకునే సౌకర్యం కల్పించాలి. ►దుర్గాఘాట్ నుంచి వచ్చే భక్తులు కొండపైకి చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు అడ్డుకాకుండా చూడాలి. ►ఉచిత భోజనం వద్ద తొక్కిసలాట జరగకుండా చూడాలి. ఈ జాగ్రత్తలు అవసరం దేశం నలుమూలల నుంచి కనీసం 50లక్షల మంది భక్తులు కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే, బస్స్టేషన్ల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం ఉత్తమం. రైల్వే, బస్సు ప్లాట్‌ఫాంలపై వేలసంఖ్యలో భక్తులు నిలిచిపోతారు. తొక్కిసలాట జరగకుండా ప్లాట్‌ఫాంలను విస్తరించాలి. లేదా ప్రయాణికులను వేర్వేరు ప్రాంతాల్లో దిగేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారుచేయాలి. ఠపోలీస్ సిబ్బందిని ఎక్కడెక్కడ నియమించాలి, భక్తులకు ఏయే సలహాలు ఇవ్వాలి, సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటుచేయాలి.. వంటి విషయాలను ఇప్పటినుంచే కూలంకషంగా చర్చించుకోవడం ఉత్తమం.ప్రత్యేక రైళ్లు, బస్సుల సమాచారాన్ని పుష్కర ఘాట్ల వద్ద, ఇంద్రకీలాద్రి వద్ద, నగరంలోని ముఖ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి.దుర్గాఘాట్ ఒక్కటే కాకుండా అన్ని ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించేలా ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహించాలి. ముందస్తు ప్రణాళిక అవసరం ఏ కార్యక్రమానికైనా సరే ముందస్తు ప్రణాళిక, దాని అమలు అవసరం. మొదటి రోజే కాదు.. 12 రోజులూ పవిత్రమైన రోజులేనని, నది ప్రారంభమైన ప్రాంతం నుంచి చివరి వరకు అంతా పవిత్రమైన ప్రాంతమేనని ప్రచారం చేయాలి. అధికార యంత్రాంగం కూడా పెద్దలు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. - డాక్టర్ ఎంసీ దాస్, విద్యావేత్త, విశ్లేషకుడు రెండు సమావేశాలు నిర్వహించాం.. కృష్ణా పుష్కరాల విజయవంతం కోసం ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించాం. దుర్గాఘాట్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వెయ్యిమందికి జల్లు స్నానాలు, పిండ ప్రదానాలకు వేరే ఏర్పాట్లు చేస్తాం. 50 బాత్రూమ్లు, 50 లెట్రిన్స్ అదనంగా ఉంటాయి. ఘాట్‌రోడ్డులో ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేస్తాం. కొండపైకి రాలేని భక్తుల కోసం ఐదు ఘాట్లలో అమ్మవారి, అయ్యవారి నమూనా దేవాలయాలు ఏర్పాటుచేస్తాం. మూడు షిప్టులలో అర్చకులు, గుమస్తాలను ఏర్పాటుచేసి ప్రసాదాలు విక్రయిస్తాం. - సీహెచ్ నర్సింగరావు, దుర్గగుడి ఈవో -
పొన్నాల పుష్కర స్నానం
మంగపేట: పీసీసీ మాజీచీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజనాల శ్రీహరి, ఆపార్టీ ముఖ్య నాయకులు గురువారం మంగపేటలో పుష్కర స్నానం చేశారు. పొన్నాల లక్ష్మయ్య పితృ దేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం నాయకులు మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య తన సతీమణి అరుణ పేరిట స్వామివారికి రూ. లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్, బండా ప్రకాష్, ఎర్రబెల్లి వరద రాజేశ్వరావు, రమాకాంత్‌రెడ్డి, మల్లేష్‌యాదవ్, నమిళ్ల శ్రీనివాస్, రాజారపు ప్రతాప్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సోమయ్య, మాజీ సర్పంచ్ గోను తిరుపతి తదితరులు ఉన్నారు. -
నేడు విజయవాడకు వైఎస్ జగన్
రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో పుష్కర స్నానం హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళ, బుధవారాల్లో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సోమవారం పర్యటన వివరాలు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న వైఎస్ జగన్ మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 1 గంటకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6 గంటలకు కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొంటారు. బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో జగన్ పుష్కర స్నానం ఆచరిస్తారు. ఆ తరువాత రాజమండ్రి కోటిలింగాల క్షేత్రంలోని మార్కండేయస్వామి దర్శనం చేసుకుంటారని రఘురాం తెలిపారు. -
ఘాట్ ఇక్కడ.. నీళ్లు అక్కడ..!
పుష్కర స్నానం.. ఓ ప్రహసనం అధికారుల ఇష్టారాజ్యం కనీస సర్వే చేయకుండా ఇంజినీర్ల నిర్వాకం ఇసుకలో కిలోమీటరు నడిస్తేనే నీళ్లు ఒడ్డుకు చేరువగా నీళ్లున్న ప్రాంతాలను పట్టించుకోని అధికారులు హైదరాబాద్: ఓ అభివృద్ధి పనిచేపట్టే సమయంలో ముందుగా సర్వే చేయడం తప్పనిసరి... అదీ లక్షలాది నమ్మకంతో కూడుకున్నది అయినప్పుడు మరింత ముందుచూపు అవసరం. కానీ, ఇంజనీరింగ్ అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఇష్టారీతిగా పనులు చేపట్టడం వల్ల అటు డబ్బు వృథా కావడమే కాక.. భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. కుంభమేళా తరహాలో జరుపుతామంటూ ఆర్భాటం చేస్తున్న గోదావరి పుష్కరాల విషయంలో అధికారుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. దీంతో పుష్కర భక్తులకు పుణ్యస్నానం ఈసారి ఓ ప్రహసనమే కాబోతోంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం ముళ్లకట్ట వద్ద అధికారులు దాదాపు రూ.4.50 కోట్లు వెచ్చించి 168 మీటర్ల పొడవుతో భారీ ఘాట్‌ను నిర్మించారు. కానీ, ఇక్కడ నీళ్లజాడేలేదు. భక్తులు నదీ స్నానం చేయాలంటే ఘాట్ దిగి ఇసుకలో కిలోమీటర్ దూరంలోని అవతలి ఒడ్డుకు వెళ్లాల్సిందే. రోడ్డుకు చేరువగా ఉంటుందన్న ఒకేఒక్క కారణంతో ఇక్కడ ఘాట్లు కట్టేశారు. ఈ ప్రాంతానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఒడ్డును ఆనుకునే నీటి ప్రవాహం ఉంది. ఎండాకాలంలోనూ అక్కడ నీటి ప్రవాహం ఉంటుందనే విషయం స్థానికంగా అందరికీ తెలుసు. కానీ, వానలు పడకుంటే ముళ్లకట్ట వద్ద నీళ్లుండవనే కనీస విషయాన్ని కూడా గుర్తించకుండా అక్కడ ఘాట్‌ను కట్టారు. పోనీ ఒడ్డుకు నీటి ప్రవాహం ఉన్నచోటే స్నానం చేద్దామంటే.. అక్కడ మూడు మీటర్ల ఎత్తుతో ఒడ్డు ఉంటుంది. దిగడం చాలా కష్టం. పొలాలు ఉండడంతో అక్కడి వరకు వెళ్లడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముందే ఆ ప్రాంతాన్ని గుర్తించి రైతుల అనుమతితో అప్రోచ్ రోడ్డు వేసి ఘాట్లు కట్టి ఉంటే బాగుండేదని స్వయంగా మంత్రులే పేర్కొంటుండడం విశేషం. ఆవలివైపు వెళ్తే గట్టునానుకునే భారీ నీటి ప్రవాహం ఉంది. అయితే అక్కడ ఒడ్డు చాలా ఎత్తుగా ఉండడంతో నీటిలో దిగటం ప్రమాదకరం. ఘాట్ల వద్ద నీళ్లు లేవన్న ఉద్దేశంతో భక్తులెవరైనా అక్కడ స్నానం చేసే ప్రయత్నం చేస్తే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉంది. ఇక రామన్నగూడెం వద్ద గతంలో నిర్మించిన పాత ఘాట్లున్నాయి. అక్కడ నీటి జాడ లేకపోయినా రూ.50 లక్షలు వెచ్చించి పాతవాటిని కొత్తగా మార్చారు. భక్తులు నీటికోసం ఆ ఘాట్లు దిగి నదిలోకి కనీసం అరకిలోమీటరు దూరం వెళ్లాలి. ఇసుకలో నడక కష్టమన్న ఉద్దేశంతో మంత్రుల సూచన మేరకు అధికారులు తాజాగా ఇసుకబస్తాలు వేసి బాట ఏర్పాటు చేశారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌నగర్ వద్ద ఒడ్డును ఆనుకునే భారీగా నీటి ప్రవాహం ఉంది. కొత్త ఘాట్లు అక్కడే నిర్మించి ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉండేది. మంగపేట వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించిన ఘాట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి. 50 మీటర్ల మేర ఇసుకలో నడిస్తే తప్ప నీటి జాడలేదు.