పొన్నాల పుష్కర స్నానం | PONNALA Pushkarni bath | Sakshi

పొన్నాల పుష్కర స్నానం

Published Fri, Jul 17 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

పొన్నాల పుష్కర స్నానం

పొన్నాల పుష్కర స్నానం

మంగపేట: పీసీసీ మాజీచీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజనాల శ్రీహరి, ఆపార్టీ ముఖ్య నాయకులు గురువారం మంగపేటలో పుష్కర స్నానం చేశారు. పొన్నాల లక్ష్మయ్య పితృ దేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం నాయకులు మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య తన సతీమణి అరుణ పేరిట స్వామివారికి రూ. లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్, బండా ప్రకాష్, ఎర్రబెల్లి వరద రాజేశ్వరావు, రమాకాంత్‌రెడ్డి, మల్లేష్‌యాదవ్, నమిళ్ల శ్రీనివాస్, రాజారపు ప్రతాప్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సోమయ్య, మాజీ సర్పంచ్ గోను తిరుపతి తదితరులు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement