లండన్ డాక్టర్‌కు డ్రైవర్ బురిడీ | London doctor to the driver buridi | Sakshi
Sakshi News home page

లండన్ డాక్టర్‌కు డ్రైవర్ బురిడీ

Published Sun, Jul 19 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

లండన్ డాక్టర్‌కు డ్రైవర్ బురిడీ

లండన్ డాక్టర్‌కు డ్రైవర్ బురిడీ

లండన్ డాక్టర్‌కు డ్రైవర్ బురిడీ పుష్కరాల్లో కారు, నగలుతో ఉడాయించిన వైనం
 
రాజమండ్రి క్రైం: లండన్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తూ.. పుష్కరాల కోసం వచ్చిన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన డాక్టర్ రెడ్డి నారాయణచౌదరి కారు, నగలు తీసుకుని డ్రైవర్ ఉడాయించాడు. 13న లండన్ నుంచి మండపేట వచ్చిన నారాయణచౌదరి శనివారం కుటంబసభ్యులతో రాజమండ్రి చేరుకున్నారు. నగరంలోని ఒక హోటల్ వద్ద కారు నిలిపి కుటుంబసభ్యులతో పుష్కర స్నానం ఆచరించేందుకు వీఐపీ ఘాట్‌కు వెళ్లారు.

తిరిగి వచ్చి చూడగా కారు(ఏపీ 28 డీఆర్ 4408), డ్రైవర్ గౌతమ్‌కృష్ణ కనిపించలేదు. డ్రైవర్‌కు ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారులో 5.5 లక్షల విలువైన డైమండ్ రింగులు, చెవి పోగులు, నగలు, రూ. 60వేల నగదు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. కూకట్‌పల్లికి చెందిన గౌతమ్‌కృష్ణను 13 నుంచి ఆప్టింగ్ డ్రైవర్‌గా పెట్టుకున్నామని నారాయణచౌదరి చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement