పుష్కర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు | Pushkarni to go to the bathroom, two persons missing | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు

Published Sun, Jul 19 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

Pushkarni to go to the bathroom, two persons  missing

ఏటూరునాగారం : పుష్కర స్నానం చేసేందుకు గోదావరి నదిలో లోతుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతైన సంఘటన శనివారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని సింగారంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం..   సింగారం గ్రామానికి చెందిన గడ్డం ముకుందరావు, ఆయన భార్య స్వాతి, యశ్వంత్, భార్గవి, తన అక్క కొడుకు గడ్డం ప్రవీణ్‌కుమార్‌తో కలిసి గోదావరి స్నానానికి వెళ్లారు.

గోదావరిలో సరదాగా ముకుందరావు, ప్రవీణ్ కుమార్‌లు ఈతకొడుతుండగా ఒక్కసారిగా నదిలో పెద్ద గొయ్యి రావడంతో మునిగిపోయారు. నీళ్లు మింగుతూ బుడుగలు పైకి వ చ్చారుు. ఒడ్డుపై ఉన్న స్వాతి, గ్రామస్తులు ఇద్దరు మునిగిపోతున్నారని కేకలు వేసి లబోదిబోమని మొత్తుకున్నారు. ఆ సమయంలో ఈత వచ్చిన వ్యక్తులు దగ్గరలో లేకపోవడంతో వారిని కాపాడుకోలేకపోయామని స్వాతి రోదిస్తూ తెలిపింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement