సాక్షి, కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
తన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని తెలిపారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు.
తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.
దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.
My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024
Comments
Please login to add a commentAdd a comment