రూట్ మార్చిన సెన్సార్ మాజీ చీఫ్
సెన్సార్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన పహ్లజ్ నిహ్లాని, ఆ పదవి నుంచి తప్పుకున్న తరువాత మాట మార్చారు. పదవిలో ఉండగా చాలా సినిమాల రిలీజ్ విషయంలో అడ్డుపడ్డ పహ్లజ్, ప్రస్తుతం తాను బోల్డ్ కంటెంట్ కు వ్యతిరేకం కాదంటూ ప్రకటించారు. తాను బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు సరైన సర్టిఫికేషన్ ఇచ్చేందుకు మాత్రమే పోరాడానని చెపుతున్నారు.
అంతేకాదు మరో అడుగు ముందుకేసి అడల్ట్ మూవీగా తెరకెక్కిన జూలీ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయటంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ చీఫ్ గా ఉండగా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ఇబ్బందులకు గురి చేసిన పహ్లజ్, ఇప్పుడు తానే స్వయంగా అడల్ట్ మూవీ రిలీజ్ కు సహకరించటం సరికాదన్న వాదన వినిపిస్తుంది.
Never objected BOLD content, but always insisted on FAIR CERTIFICATION. Glad to be distributor of @Julie2Film, a FILM for an ADULT FAMILY ! https://t.co/8V3hCQkI39
— Pahlaj Nihalani (@NihalaniPahlaj) 8 September 2017