Pahlaj Nihalani
-
‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’
గ్లామరస్ మాఫియా కారణంగానే తమ సినిమాకు థియేటర్లు దొరకలేదని, అందుకే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని బాలీవుడ్ మూవీ ‘రంగీలా రాజా’ నిర్మాత, సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) మాజీ చైర్మన్ పహ్లజ్ నిహలానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ సెన్సార్ బోర్డు చైర్మన్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించినందు వల్లే కొంతమంది నన్ను టార్గెట్ చేశారు. నా కారణంగా హీరో గోవిందాను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను, గోవిందాను అంతం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది. కార్పోరైటేజషన్ పేరుతో నా వంటి నిర్మాతలను అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా భయపడేది లేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయం గురించి మాట్లాడిన గోవిందా.. ‘ గత తొమ్మిదేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నా సినిమాలకు థియేటర్లు దొరకకుండా కొంతమంది అడ్డుతగులుతున్నారు. నేనేమీ రాజకీయాల్లో లేనుకదా. దయచేసి నా పనిని సక్రమంగా చేసుకోనివ్వండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గోవిందా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంగీలా రాజా’ సినిమా శుక్రవారం విడుదలైంది. -
మాల్యాపై బయోపిక్ టైటిల్ ఏంటంటే..
సాక్షి, న్యూఢిల్లీ : బయోపిక్‌ల హవా నడుస్తున్న క్రమంలో పలువురి జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు సీబీఎఫ్సీ మాజీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ వెల్లడించారు. విజయ్ మాల్యా పాత్రను ప్రముఖ నటుడు గోవింద పోషిస్తారని చెప్పారు. మాల్యా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తానని, మాల్యాగా గోవింద అలరిస్తాడని చెప్పుకొచ్చారు. సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని, దీన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తానని నిహ్లాని తెలిపారు. ఈ సినిమా టైటిల్ రంగీలా రాజా అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 35 ఏళ్ల తర్వాత నిహ్లాని దర్శకత్వంలో గోవింద నటిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే ఓ పాటను చిత్రీకరించారని తెలిసింది. విజయ్ మాల్యా బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడై బ్రిటన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. మాల్యా అప్పగింతపై ప్రస్తుతం బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతోంది. -
రూట్ మార్చిన సెన్సార్ మాజీ చీఫ్
సెన్సార్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన పహ్లజ్ నిహ్లాని, ఆ పదవి నుంచి తప్పుకున్న తరువాత మాట మార్చారు. పదవిలో ఉండగా చాలా సినిమాల రిలీజ్ విషయంలో అడ్డుపడ్డ పహ్లజ్, ప్రస్తుతం తాను బోల్డ్ కంటెంట్ కు వ్యతిరేకం కాదంటూ ప్రకటించారు. తాను బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు సరైన సర్టిఫికేషన్ ఇచ్చేందుకు మాత్రమే పోరాడానని చెపుతున్నారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి అడల్ట్ మూవీగా తెరకెక్కిన జూలీ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయటంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ చీఫ్ గా ఉండగా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ఇబ్బందులకు గురి చేసిన పహ్లజ్, ఇప్పుడు తానే స్వయంగా అడల్ట్ మూవీ రిలీజ్ కు సహకరించటం సరికాదన్న వాదన వినిపిస్తుంది. Never objected BOLD content, but always insisted on FAIR CERTIFICATION. Glad to be distributor of @Julie2Film, a FILM for an ADULT FAMILY ! https://t.co/8V3hCQkI39 — Pahlaj Nihalani (@NihalaniPahlaj) 8 September 2017 -
మహిళా జర్నలిస్ట్‌పై కేసు
న్యూఢిల్లీ: వివాదాలతో సావాసం చేసే జాతీయ సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లాని 23 ఏళ్ల మహిళా టీవీ జర్నలిస్టుపై కేసు పెట్టారు. తనను ఆమె వేధింపులు, భయాందోళనకు గురి చేస్తున్నారని గిర్‌గౌమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘కార్యాలయ ప్రాంగణంలో నిరంతరం నా వెంట పడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. అత్యుత్సాహంతో నన్ను నిబ్బంది పెడుతున్నారు. అనవసరంగా ఫొటోలు తీయడం, సంబంధంలేని ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నారు. ఆమె లోనికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మా కార్యాలయ సెక్యురిటీ, సిబ్బందిపై దూషణలకు పాల్పడ్డార’ని నిహ్లాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసందర్భ ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారని, తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని నిహ్లాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సదరు టీవీ చానల్, రిపోర్టర్ తోసిపుచ్చారు. నిహ్లాని తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ప్రొఫెషన్లో భాగంగా రిపోర్టర్ ప్రశ్నలు అడగడం సాధారమని, ఇది వేధింపులకు కిందకు రాదని టీవీ చానల్ ఎడిటర్ పేర్కొన్నారు. తమ రిపోర్టర్ పట్ల నిహ్లాని అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. -
'సెన్సార్ చేయకముందే ఆ మూవీ చూడాలి'
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ రోజులను నేపథ్యంగా ఎంచుకుని దర్శకుడు మధుర్ భండార్కర్ తీసిన ‘ఇందు సర్కార్’ మూవీపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మూవీని బోర్డు సెన్సార్ చేయకముందుగానే తాను చూడాలని కోరుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీకి మంగళవారం ఓ లేఖ రాశారు. తనతో పాటు మరికొందరు పార్టీ నేతలకు ఈ మూవీ స్టోరీపై అనుమానాలున్నట్లు తెలిపారు. 'ఈ మూవీ ట్రైలర్ చూశాను. ఎమర్జెన్సీ రోజుల్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను చూపించారు. ఇందిరాగాంధీ, సంజయ్ తో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలను చెడు కోణంలో చూపించారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కారణం వల్ల మాకు ఇందు సర్కార్ మూవీని సెన్సార్ చేయకముందే ఓసారి ప్రత్యేక షో చూపించాలని' సీబీఎఫ్సీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మూవీలో తరచుగా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ పాత్రలు కూడా వచ్చి పోతుంటాయి. ఇందిరా గాంధీగా కొత్త నటి సుప్రియా వినోద్, సంజయ్ గాంధీగా నీల్ నితిష్ నటించాడు. కీర్తి కుల్హారి, అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో కనిపిస్తారు. 1975 జూన్ 26న మొదలైన ఎమర్జెన్సీ దమనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ముగిసింది. అనంతరం జరిగిన ఎలక్షన్లలో జనం ఇందిరాగాంధీని చావుదెబ్బ తీయగా, జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలోని జనతాపార్టీని అందలం ఎక్కించారు. మరోవైపు ఇందిరాగాంధీ జీవితంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా ఎమర్జన్సీని మచ్చగా, దాచిపెట్టాల్సిన విషయంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. -
ఆ సినిమాలో ఎన్ని ముద్దులున్నా బాధలేదు
ముంబై: కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్ దర్శక, నిర్మాత విక్రమ్ భట్‌పై విరుచుకుపడ్డారు. బాలీవుడ్లో భట్ క్యాంప్ వారి సినిమాల విడుదలకు ముందు సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం పబ్లిసిటీ కోసమేనని విమర్శించారు. విక్రమ్ భట్ సినిమాలో ఎన్ని ముద్దు సన్నివేశాలున్నా, లేకున్నా తనకు బాధలేదంటూ నిహలానీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన తాజా హర్రర్ మూవీలో ఎఫ్ పదం వాడటాన్ని 32 నుంచి 16 సార్లుకు తగ్గించాలని సెన్సార్ బోర్డు సూచించిందని ఇటీవల విక్రమ్ భట్ చెప్పాడు. అంతేగాక ఈ సినిమా ట్రైలర్‌కు థియేటర్లలో ప్రదర్శించడానికి యూ/ఏ, టీవీల కోసం ఏ సర్టిఫికెట్ ఇచ్చారని విమర్శించాడు. నిహలానీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ విక్రమ్ భట్ సహా భట్ క్యాంప్ సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ కోసం సెన్సార్ బోర్డును, తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్లకు సెన్సార్ బోర్డు మార్కెటింగ్ సాధనంగా మారిందని, ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిలేకపోతే కావాలనే విమర్శలు చేస్తారని మండిపడ్డారు. భట్ క్యాంప్‌నకు కానీ ఇతరులకు కానీ సెన్సార్ బోర్డు ఉచిత పబ్లిసిటీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదట సెన్సార్ బోర్డుపై విమర్శలు చేసి, తర్వాత మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తారని నిహలానీ విమర్శించారు. -
‘కబాలి’ లీక్‌పై నిహ్లాని ఆందోళన
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ ఆన్లైన్ లో లీకైందన్న వార్తలు సినిమా పరిశ్రమలో గుబులు రేపుతున్నాయి. సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమా లీకైందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. దీనిపై సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహ్లాని స్పందించారు. పెద్ద సినిమాలు ఆన్లైన్ లో లీక్ కావడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. ‘రజనీకాంత్ లాంటి పెద్దహీరో కూడా పైరసీదారులు వదలడం లేదు. కబాలి సినిమాన చెన్నైలో సెన్సార్ చేశారు. ముంబైలోని మా కార్యాలయానికి దీంతో ఎటువంటి సంబంధం లేదు. అంతకుముందు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సుల్తాన్ సెన్సార్ చేశాం. ఆన్లైన్ లో లీకవడం పట్ల స్టార్ హీరోల సినిమాల వసూళ్లు ఏమేరకు తగ్గుతాయనేది నేను చెప్పలేను. పైరసీలో చిన్న సినిమాలు బాగా నష్టపోతాయని అనుకుంటున్నా’నని నిహ్లాని చెప్పారు. హిందీ సినిమాలు సుల్తాన్, ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ విడుదలకు ముందే ఆన్లైన్ లో లీకైన విషయం తెలిసిందే. కాగా, ఆన్లైన్ లో కబాలి లింకులు తొలగించాలని నిర్మాత కలైపులి ఎస్.థాను ఇటీవల చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన న్యాయస్థానం కబాలి లింకులు కలిగిన వెబ్సైట్లను మూసివేయాలని ఆదేశించింది. -
ఆ విషయంలో దర్శకులు జాగ్రత్తగా ఉండాలి
ముంబై: బాలీవుడ్ చిత్రం ఉడ్తా పంజాబ్ సెన్సార్ విషయంలో వార్తల్లో నిలిచిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలాని.. ‘ఢిష్యూం’ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించిన పాట వివాదాస్పదం కావడంపై స్పందించారు. మత విశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో సినీ దర్శకులు జాగ్రత్తగా ఉండాలని నిహలాని సూచించారు. తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఢిష్యూం సినిమాలో పాటను చిత్రీకరించారని సిక్కు మతస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై నిహలాని స్పందిస్తూ.. దర్శకులు భావప్రకటన స్చేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తే సమస్యలు వస్తాయని అన్నారు. ‘దేశంలో మతవిశ్వాసాలు చాలా సున్నితమైన అంశం. తమ మత విశ్వాసాలకు భంగం కలిగితే ప్రజలు బాధపడతారు. సమస్యలు ఏర్పడతాయి’ అని చెప్పారు. సున్నితమైన మతవిషయాలకు సంబంధించిన సినిమా దృశ్యాలను మతగురువుల సమక్షంలో సెన్సార్ చేయాలని నిహలాని ప్రతిపాదించారు . -
వాళ్లే లీక్ చేసివుంటారని అనుమానం?
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా 'ఉడ్తా పంజాబ్'ను తాము లీక్ చేయలేదని సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఈ సినిమాను తామే లీక్ చేసినట్టుగా వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసం నిర్మాతలే లీక్ చేసివుంటారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు సినిమా డీవీడీ ఇచ్చారు. తర్వాత దాన్ని తీసుకుపోయారు. మా సభ్యుల దగ్గర ఈ డీవీడీ ఉండే అవకాశమే లేదు. డీవీడీ తీసుకెళ్లిన సమయంలోనే దీన్ని లీక్ చేసివుండొచ్చ'ని నిహలానీ అన్నారు. 'ఈ సినిమా బుధవారం మధ్యాహ్నం ఆన్లైన్ లో లీకైంది. కోర్టు నుంచి సాయంత్రం 6.30 గంటలకు మాకు కాపీ అందింది. సెన్సార్ బోర్డు సభ్యులు లీక్ చేయడానికి అవకాశమే లేదు. మీరే లీక్ చేశారా అని ఈ సినిమా నిర్మాతలను ఎందుకు అడగరు. పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తుంటార'ని పేర్కొన్నారు. 'ఉడ్తా పంజాబ్'పై ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారని ప్రశ్నించగా.. దీని గురించి నిర్మాతలనే అడగాలని నిహలానీ అన్నారు. ఇటీవల ఆన్లైన్ లో లీకైన సినిమాలు సైరత్ నటసామ్రాట్ దిల్ వాలే మాంజీ- ద మౌంటైన్ మేన్ ది రివనెంట్ ఎన్ ది హేట్‌ఫుల్ ఎయిట్ -
'ఎవరి ఓటమి, గెలుపు కాదు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై బాంబే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. కోర్టు తీర్పుకు కట్టుబడతానని, న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. ఒక్క కట్ తో రెండు రోజుల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది ఎవరి ఓటమి, గెలుపు కాదని వ్యాఖ్యానించారు. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా తన పని తాను చేశానని అన్నారు. సెన్సార్ బోర్డు నిర్ణయాలపై కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి నిర్మాతకు ఉందని తెలిపారు. తమకు పెద్ద ఎత్తున మద్దతు రావడం పట్ల 'ఉడ్తా పంజాబ్' సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ, ప్రజలు, మీడియా నుంచి ఊహించని మద్దతు లభించిందని అన్నారు. -
'ఆయన సినిమా నాలెడ్జికి కాలం చెల్లింది'
ముంబయి: తన చిత్రాల విడుదలకు సంబంధించి తాను కూడా గతంలో సెన్సార్ బోర్డు నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా అన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహలానీని తప్పుబట్టారు. నిహ్లాజ్కు ప్రస్తుతం ఉన్న సినిమా జ్ఞానానికి కాలం చెల్లిందని అన్నారు. ఆయనదంతా ఔట్ డేటెడ్ సినిమా నాలెడ్జి అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బాలీవుడ్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉడ్తా పంజాబ్ చిత్ర వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఆయనను ఆ చిత్ర విడుదలపై సెన్సార్ బోర్డు పనితీరును ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇది పూర్తిగా హాస్యాస్పదం. అసలు సమస్య ఏమిటంటే ఒక అర్హత లేని వ్యక్తికి ఆపదవి కట్టబెట్టారు. పహ్లాజ్ నిహ్లానీకి నాకు ఎలాంటి వైరుద్యం లేదు. కానీ, ఈరోజుల్లో ఒక వ్యక్తికి ఉండాల్సిన సినిమా నాలెడ్జితో పోలిస్తే ప్రస్తుతం ఆయనకు ఉన్న సినిమా జ్ఞానం పూర్తిగా కాలం చెల్లినది. దాని ఫలితమే ప్రస్తుత సమస్య' అంటూ ఆయన విమర్శించారు. -
సెన్సార్ బోర్డు చైర్మన్ ను మార్చనున్నారా?
న్యూఢిల్లీ: ఇటీవల ఉడ్తా పంజాబ్ సినిమా సెన్సార్ విషయంలో వివాదంలో చిక్కుకున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ)లో పెను మార్పులు చేసేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్న పహ్లజ్ నిహ్లానీని తొలగించి ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ను నియమించనున్నారని తెలుస్తోంది. ఒక టీవీ ఇంటర్వూలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ త్వరలోనే సెన్నార్ బోర్డులో పెను మార్పులు జరుగనున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత చైర్మన్ నిహ్లానీ నేను మోడీ చెంచానని బాహాటంగా ప్రకటించడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
'ఫిలిమ్ ఇండస్ట్రీని అవమానించారు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమాకు బాలీవుడ్ నటులు, దర్శకులు బాసటగా నిలిచారు. మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అనురాగ్ కశ్యప్ పై అసత్య ఆరోపణలు చేసిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లజ్ నిహలానీ క్షమాపణలు చెప్పాలని దర్శకులు డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అశోక్ పండిట్ నేతృత్వంలో నటులు, దర్శకులు మీడియాతో మాట్లాడారు. మన దేశం సౌదీ అరేబియాలా మారరాదని దర్శకుడు మహేశ్ భట్ అన్నారు. సమాజంలో జరిగిన వాటినే సినిమాలు మలుస్తున్నామని, ఊహించి లేదా సృషించి సినిమాలు తీయడం లేదని మరో దర్శకుడు రాహుల్ దొలాకియా తెలిపారు. ఈ సినిమాలోని సందేశం అందరికీ చేరేలా సహకరించాలని హీరో షాహిద్ కపూర్ విజ్ఞప్తి చేశాడు. సాధారణంగా సినిమా వర్గాలు సైలెంట్ గా మద్దతు తెల్పుతుంటాయని, మొదటిసారిగా ఒక సినిమాకు బహిరంగంగా సపోర్టు చేస్తున్నారని నటుడు, దర్శకుడు సతీశ్ కౌషిక్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి అనురాగ్ కశ్యప్ లంచం తీసుకున్నారని ఆరోపణలు చేసి సినిమా పరిశ్రమను నిహలానీ అవమానించారని అశోక్ పండిట్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు పదవికి నిహలానీ తగరని ముఖేశ్ భట్ ధ్వజమెత్తారు. -
'నిర్మాతలు లంచాలతో ప్రలోభపెట్టారు'
సిగ్గులేని వారు అలాంటి పనులు చేస్తారు సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీ న్యూఢిల్లీ: భారత చలన చిత్ర సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నిర్మాతలు తమ మూవీలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని కోరుతూ వారు తనకు అనేక పర్యాయాలు లంచం ఇవ్వజూపారని సెన్సార్ చీఫ్ వెల్లడించారు. సిగ్గులేని వారు మాత్రమే ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడతారని, పనిని ప్రేమించేవారు ఈ చర్యలకు పాల్పడరని వ్యాఖ్యానించారు. ఆయన క్రూరుడని, నిరంకుశ పాలన చేస్తారని ఇదే బోర్డులోని ఓ సభ్యుడు చంద్రప్రకాశ్ ద్వివేది కూడా బోర్డులోని పాలన యంత్రాంగం సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడ వ్యవహారాలు అంత సజావుగా ఉండవన్న విషయాన్ని బయటపెట్టాడు. సెన్సార్ బోర్డు ఎవరి నుంచీ బహుమతులు గానీ, డబ్బులు గానీ ఆశించదని పేర్కొన్నారు. మా బోర్డు సభ్యులు కూడా దీపావళి గిఫ్ట్స్ వస్తే వాటిని తిరస్కరించారని, అందుకు వారని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. సెన్సార్ బోర్డు అనేది జీరో కరప్షన్ బోర్డు అని, ఓ మేగజైన్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాల్లోని కొన్ని సీన్లకు కత్తెర వేయకుండా చూడాలని తనకు విజ్ఞప్తి చేసేశారని, అందుకు ప్రతిఫలంగా తనకు కొంత మేరకు డబ్బు ముట్టజెప్పాలని చూసేశారని ఆరోపించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు. అయితే లంచం ఇవ్వడానికి ఆఫర్ చేసిన వారి పేర్లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. -
ఆవు ప్లస్ ఆ నలుగురు
న్యూఢిల్లీ: సమాజంలో మంచికైనా, చెడుకైనా సంచలనం సృష్టించిన అంశాలు ఈ ఏడాది ప్రధానంగా ఐదు ఉన్నాయి. అందులో ఆవు అంశం ఒకటి. హిందువుల ఆరాధించే ఆవు మాంసాన్ని ఎవరూ కలిగి ఉండరాదని, తినకూడదని, అలా చేస్తే పదేళ్లు జైలు శిక్ష విధిస్తామంటూ మహారాష్ట్రలోని బీజేవీ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చి సంచనలం సృష్టించింది. అదే తరహాలో హర్యానా కూడా కఠిన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ముస్లింల హత్యలకు దారి తీశాయి. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఓ ముస్లిం కుటుంబం ఆవు మాంసం భద్రపర్చారనే మిషతో ఆ ఇంటిమీద కొంత మంది దాడులు జరిపి ఇంటి యజమానిని కొట్టి చంపారు. మరోచోట ఆవులను ఎత్తుకుపోతున్నారన్న ఆరోపణలతో ఓ ట్రక్కు డ్రైవర్‌ను హతమార్చారు. ఆవు మాంసం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదుపై ఢిల్లీలోని కేరళ హౌస్‌పై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపారు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేపింది. ఇది చివరకు దేశంలో అసహనం పెరిగిపోతోందన్న ఆందోళనకు దారితీసింది. రెండో అంశం షీనా బోరా 24 ఏళ్ల షీనా బోరా హత్య కేసు. మూడేళ్ల క్రితం జరిగిన ఆమె హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియాకు ప్రధాన కథాంశంగా మారింది. ఈ కేసులో అరెస్టయిన ఇందిరాణి ముఖర్జీ చుట్టూ పలు కథనాలు వెలువడ్డాయి. ఊహంచని విధంగా గత నవంబర్ మారు తండ్రి, మీడియా బిగ్‌విగ్ పీటర్ ముఖర్జీ కూడా అరెస్టయ్యారు. 500 నుంచి 600 కోట్ల రూపాయల లావా దేవీలకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా బదిలీ అవడంతో కేసు దర్యాప్తు బలహీనపడినట్టు కనిపిస్తోంది. ఏదే మైనా వార్తలపరంగా ఈ కేసు 2015 సంవత్సరానికి ‘గాసిప్ ఇయర్’ అన్న పేరును తెచ్చింది. మూడో అంశం హార్థిక్ పటేల్ హార్థిక్ పటేల్ కూడా ఈ ఏడాది దేశంలో సంచలనం సృష్టించారు. వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ రాణిస్తున్న పటేళ్ల వర్గానికి బీసీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టిన పటేల్ అనతి కాలంలోనే ఏ రాజకీయ నాయకుడికిరానంత పేరు తెచ్చుకున్నారు. నాలుగైదు లక్షల మందితో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం గుండెల్లో గుబులు పుట్టించారు. సోషల్ మీడియాలో కూడా హీరో అనిపించుకున్నారు. అయితే, ఎంత వేగంగా హీరో అయ్యారో, అంతేవేగంగా జీరో అయ్యారు. ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే! మహేశ్ శర్మ ఆరెస్సెస్‌లో సుదీర్ఘకాలంగా సభ్యుడిగా ఉన్న డాక్టర్ మహేశ్ శర్మ ఊహించని విధంగా మంత్రిపదవి దక్కించుకొని చ ర్చల్లో వ్యక్తి అయ్యారు. లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైన ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా స్వతంత్య్ర బాధ్యతలు నిర్విహ స్తూ ‘దాద్రి’ సంఘటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా సంచలనం సృష్టించారు. దాద్రి సంఘటన యాదృశ్ఛికంగా జరిగిందే తప్పా ఎవరు ఉద్ధేశపూర్వకంగా చేసింది కాదంటూ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఎవరినైనా కొడితే శరీరానికే గాయాలవుతాయని, ఆవును చంపితే మాత్రం మనిషిలోని గుండెకాయకు గాయం అవుతుందనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంకు కేటాయించిన బంగాళాను దక్కించుకోవడం ద్వారా కూడా శర్మ సంచలనం సృష్టించారు. మొదటిసారి ఎంపీ అయినావారెవరికి ఇలాంటి బంగళాను కేటాయించిన చరిత్ర దేశంలో లేదు. పహ్లాజ్ నెహ్లాని 2015, జనవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చైర్మన్‌గా నియమితులైన పహ్లాజ్ నెహ్లాని తన వివాదాస్పద నిర్ణయాలతో సంచలనం సృష్టించారు. బాంబే అనే పదంతోపాటు 13 ఆంగ్ల పదాలను, 11 హిందీ పదాలను సినిమాల్లో వాడకూడదంటూ నిషేధం విధించారు. ఇటీవల వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ చిత్రంలో ముద్దు సీన్‌ను కుదించారు. ఎందుకు ఇలా చేశారంటూ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నించగా ‘మీరు ఇంట్లో తలుపులు తెరచుకొని అందరికి కనపడేలా సెక్స్‌లో పాల్గొంటారా?’ లాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. -
'భగవాన్' స్థానంలో 'ఊపర్‌వాలా'..!
ఈ మధ్యకాలంలో పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సెన్సార్ బృందం కత్తెర బారిన పడని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నచిన్న విషయాలకే చాలా సినిమాలకు కత్తెర వేసినట్టు సెన్సార్ బోర్డు విమర్శలు ఎదుర్కొంటున్నది. తాజాగా 'హేట్‌స్టోరీ-3' సినిమా కూడా సెన్సార్ బోర్డు కత్తెర బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఎరోటిక థ్రిల్లర్ అయిన ఈ సినిమా సహజంగానే 'ఏ' సర్టిఫికెట్ (పెద్దలకు మాత్రమే) కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో సినిమాకు కత్తెర పడబోదని చిత్రబృందం భావించింది. అయితే నిహలానీ నేత్వత్వంలోని కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) మాత్రం ఈ సినిమాను కూడా విడిచిపెట్టలేదని తెలుస్తున్నది. విశాల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన 'హేట్‌స్టోరీ-3'లో శర్మాన్ జోషీ, కరణ్‌సింగ్ గ్రోవర్, జరీనా ఖాన్, డైసీ షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పలుచోట్ల డైలాగ్‌లకు సెన్సార్‌బోర్డు మార్పులు సూచించినట్టు తెలిసింది. చిత్రంలోని ఓ సన్నివేశంలో శర్మాన్ జోషీ 'ఓ భగవాన్ కో మై జీత్నే నహీ దూంగా' అని అంటాడు. ఈ డైలాగ్‌లో 'భగవాన్' అన్న స్థానంలో 'ఊపర్‌వాలా' అనే పదాన్ని సెన్సార్‌బోర్డు సూచించింది. 'భగవాన్' పదంతో ఓ వర్గం ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందనే కారణంతో ఈ మేరకు మార్పులు చేయించింది. అదేవిధంగా టీజర్లో వినిపించే 'సంభోగ్' పదాన్ని తీయించి.. దాని స్థానంలో 'మిలన్' పదాన్ని చేర్చారు. ఇంకొన్ని డైలాగ్‌లు కూడా అభ్యంతరంగా ఉన్నాయంటూ మార్పులు సూచించారు. జేమ్స్‌బాండ్ సినిమా 'స్పెక్టర్'లో ముద్దు సీన్ నిడివిని సెన్సార్‌బోర్డు సగానికి తగ్గించడంపై వివాదం చెలరేగింది. అయినప్పటికీ 'హేట్‌స్టోరీ-3' సినిమాను శుద్ధిచేయడంలో సెన్సార్‌బోర్డు వెనుకంజ వేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘సెన్సార్’ చైర్‌పర్సన్‌గా పహ్లాజ్
సభ్యులుగా జీవిత సహా మరో తొమ్మిది మంది న్యూఢిల్లీ: కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్సీ) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రముఖ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. బోర్డులో కొత్తగా తొమ్మిది మంది సభ్యులను కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నటి, బీజేపీ నాయకురాలు జీవిత కూడా ఉన్నారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రంపై వివాదం నేపథ్యంలో లీలా శాంసన్.. సెన్సార్ బోర్డు చైర్పర్సన్ పదవికి కొద్దిరోజుల కిందటే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా బోర్డు సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. సోమవారం నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిహలానీ పదవిలో కొనసాగుతారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. సభ్యులుగా బీజేపీ నేతలు వాణి త్రిపాఠి టికూ, జీవిత, జార్జ్ బేకర్, నిర్మాతలు అశోక్ పండిత్, చంద్ర ప్రకాశ్, సినీ రచయిత మిహిర్ భుటా, సయ్యద్ అబ్దుల్ బారీ, రమేశ్ పటాన్గే, నటుడు ఎస్.వి.శేఖర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. ప్రఖ్యాత దర్శకుడు గోవింద్ నిహలానీ సోదరుడైన పహ్లాజ్ నిహలానీ.. ఆంఖేన్, తలాశ్: ద హంట్ బిగిన్స్, షోలా ఔర్ షబ్నమ్ వంటి చిత్రాలను నిర్మించారు.