'ఎవరి ఓటమి, గెలుపు కాదు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై బాంబే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. కోర్టు తీర్పుకు కట్టుబడతానని, న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. ఒక్క కట్ తో రెండు రోజుల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది ఎవరి ఓటమి, గెలుపు కాదని వ్యాఖ్యానించారు. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా తన పని తాను చేశానని అన్నారు. సెన్సార్ బోర్డు నిర్ణయాలపై కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి నిర్మాతకు ఉందని తెలిపారు.
తమకు పెద్ద ఎత్తున మద్దతు రావడం పట్ల 'ఉడ్తా పంజాబ్' సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ, ప్రజలు, మీడియా నుంచి ఊహించని మద్దతు లభించిందని అన్నారు.