సెన్సార్ బోర్డు చైర్మన్ ను మార్చనున్నారా?
Published Sat, Jun 11 2016 12:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM
న్యూఢిల్లీ: ఇటీవల ఉడ్తా పంజాబ్ సినిమా సెన్సార్ విషయంలో వివాదంలో చిక్కుకున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ)లో పెను మార్పులు చేసేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్న పహ్లజ్ నిహ్లానీని తొలగించి ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ను నియమించనున్నారని తెలుస్తోంది. ఒక టీవీ ఇంటర్వూలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ త్వరలోనే సెన్నార్ బోర్డులో పెను మార్పులు జరుగనున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత చైర్మన్ నిహ్లానీ నేను మోడీ చెంచానని బాహాటంగా ప్రకటించడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement