వాళ్లే లీక్ చేసివుంటారని అనుమానం?
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా 'ఉడ్తా పంజాబ్'ను తాము లీక్ చేయలేదని సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఈ సినిమాను తామే లీక్ చేసినట్టుగా వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసం నిర్మాతలే లీక్ చేసివుంటారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు సినిమా డీవీడీ ఇచ్చారు. తర్వాత దాన్ని తీసుకుపోయారు. మా సభ్యుల దగ్గర ఈ డీవీడీ ఉండే అవకాశమే లేదు. డీవీడీ తీసుకెళ్లిన సమయంలోనే దీన్ని లీక్ చేసివుండొచ్చ'ని నిహలానీ అన్నారు.
'ఈ సినిమా బుధవారం మధ్యాహ్నం ఆన్లైన్ లో లీకైంది. కోర్టు నుంచి సాయంత్రం 6.30 గంటలకు మాకు కాపీ అందింది. సెన్సార్ బోర్డు సభ్యులు లీక్ చేయడానికి అవకాశమే లేదు. మీరే లీక్ చేశారా అని ఈ సినిమా నిర్మాతలను ఎందుకు అడగరు. పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తుంటార'ని పేర్కొన్నారు. 'ఉడ్తా పంజాబ్'పై ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారని ప్రశ్నించగా.. దీని గురించి నిర్మాతలనే అడగాలని నిహలానీ అన్నారు.
ఇటీవల ఆన్లైన్ లో లీకైన సినిమాలు
సైరత్
నటసామ్రాట్
దిల్ వాలే
మాంజీ- ద మౌంటైన్ మేన్
ది రివనెంట్ ఎన్ ది హేట్ఫుల్ ఎయిట్