CBFC chief
-
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
కల్పితం అన్నప్పుడు ఆ పేర్లే ఎందుకు వాడావ్?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. పార్లమెంట్ పానెల్ ముందు సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి, దర్శకుడు భన్సాలీ హాజరై తమ వాదనలు వినిపించారు. చిత్రం కల్పితమని భన్సాలీ చెబుతున్నప్పటికీ.. చరిత్రకారులు చిత్రాన్ని చూసి క్లియరెన్స్ ఇస్తేనే తాము ముందుకు వెళ్తామని ప్రసూన్ జోషి స్పష్టం చేస్తున్నారు. దర్శకుడిగా సతీ ఆచారం చూపించటం.. సీబీఎఫ్సీ కంటే ముందే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకే సినిమా చూపించటం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని పానెల్ సభ్యులు అడిగిన ప్రశ్నకు భన్సాలీ తటపటాయించినట్లు తెలుస్తోంది. ఇక పానెల్ ఎదుట భన్సాలీ, సెన్సార్ సభ్యులు, కమిటీ సభ్యుల మధ్య సంభాషణలు ఇలా ఉన్నాయి... చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని నిరూపించేందుకు తన దగ్గర వేరేదారి లేదని భన్సాలీ సమాధానం ఇవ్వగా.. అలాంటప్పుడు తమ ముందు ఎందుకు హాజరయ్యారంటూ పానెల్ సభ్యులు ఆయనకు చురకలంటిచారు. చిత్ర విడుదలలో జాప్యం మూలంగా తాను నష్టపోతున్నానని భన్సాలీ వివరణ ఇస్తుండగా.. ఎమోషనల్ అంశంతో వ్యాపారం చేయాలని చూస్తున్నారా? అంటూ సభ్యులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంతలో జోక్యం చేసుకున్న సీబీఎఫ్సీ సభ్యులు... సినిమా పూర్తి కల్పితం అని చెబుతున్నప్పుడు.. అసలు పేర్లను ఉపయోగించాల్సిన అవసరం ఏంటని భన్సాలీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కూడా ఆ విషయాన్ని తెలియజేయలేదని వాదించారు. అయితే అలాంటప్పుడు ట్రైలర్‌కు అనుమతి ఎలా ఇచ్చారని పానెల్ కమిటీ సభ్యుడు, సీనియర్‌నేత ఎల్ కే అద్వానీ సెన్సార్బోర్డును తిరిగి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిత్ర విషయంలో తమకన్నా.. సెన్సార్‌బోర్డు కలగజేసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరకు రెండు గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో కమిటీ నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని ప్రకటించింది. ‘‘సినిమా అనేది వినోదాలకు అందించేందిగా ఉండాలే తప్ప.. వివాదాలకు కేంద్ర బిందువు కాకూడదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది అసలు సినిమా ఎలా అవుతుంది?. ఇది చాలా సున్నితమైన అంశం అని ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఆ సినిమాలో ఎన్ని ముద్దులున్నా బాధలేదు
ముంబై: కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్ దర్శక, నిర్మాత విక్రమ్ భట్‌పై విరుచుకుపడ్డారు. బాలీవుడ్లో భట్ క్యాంప్ వారి సినిమాల విడుదలకు ముందు సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం పబ్లిసిటీ కోసమేనని విమర్శించారు. విక్రమ్ భట్ సినిమాలో ఎన్ని ముద్దు సన్నివేశాలున్నా, లేకున్నా తనకు బాధలేదంటూ నిహలానీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన తాజా హర్రర్ మూవీలో ఎఫ్ పదం వాడటాన్ని 32 నుంచి 16 సార్లుకు తగ్గించాలని సెన్సార్ బోర్డు సూచించిందని ఇటీవల విక్రమ్ భట్ చెప్పాడు. అంతేగాక ఈ సినిమా ట్రైలర్‌కు థియేటర్లలో ప్రదర్శించడానికి యూ/ఏ, టీవీల కోసం ఏ సర్టిఫికెట్ ఇచ్చారని విమర్శించాడు. నిహలానీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ విక్రమ్ భట్ సహా భట్ క్యాంప్ సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ కోసం సెన్సార్ బోర్డును, తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్లకు సెన్సార్ బోర్డు మార్కెటింగ్ సాధనంగా మారిందని, ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిలేకపోతే కావాలనే విమర్శలు చేస్తారని మండిపడ్డారు. భట్ క్యాంప్‌నకు కానీ ఇతరులకు కానీ సెన్సార్ బోర్డు ఉచిత పబ్లిసిటీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదట సెన్సార్ బోర్డుపై విమర్శలు చేసి, తర్వాత మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తారని నిహలానీ విమర్శించారు. -
‘కబాలి’ లీక్‌పై నిహ్లాని ఆందోళన
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ ఆన్లైన్ లో లీకైందన్న వార్తలు సినిమా పరిశ్రమలో గుబులు రేపుతున్నాయి. సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమా లీకైందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. దీనిపై సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహ్లాని స్పందించారు. పెద్ద సినిమాలు ఆన్లైన్ లో లీక్ కావడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. ‘రజనీకాంత్ లాంటి పెద్దహీరో కూడా పైరసీదారులు వదలడం లేదు. కబాలి సినిమాన చెన్నైలో సెన్సార్ చేశారు. ముంబైలోని మా కార్యాలయానికి దీంతో ఎటువంటి సంబంధం లేదు. అంతకుముందు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సుల్తాన్ సెన్సార్ చేశాం. ఆన్లైన్ లో లీకవడం పట్ల స్టార్ హీరోల సినిమాల వసూళ్లు ఏమేరకు తగ్గుతాయనేది నేను చెప్పలేను. పైరసీలో చిన్న సినిమాలు బాగా నష్టపోతాయని అనుకుంటున్నా’నని నిహ్లాని చెప్పారు. హిందీ సినిమాలు సుల్తాన్, ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ విడుదలకు ముందే ఆన్లైన్ లో లీకైన విషయం తెలిసిందే. కాగా, ఆన్లైన్ లో కబాలి లింకులు తొలగించాలని నిర్మాత కలైపులి ఎస్.థాను ఇటీవల చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన న్యాయస్థానం కబాలి లింకులు కలిగిన వెబ్సైట్లను మూసివేయాలని ఆదేశించింది. -
వాళ్లే లీక్ చేసివుంటారని అనుమానం?
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా 'ఉడ్తా పంజాబ్'ను తాము లీక్ చేయలేదని సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఈ సినిమాను తామే లీక్ చేసినట్టుగా వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసం నిర్మాతలే లీక్ చేసివుంటారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు సినిమా డీవీడీ ఇచ్చారు. తర్వాత దాన్ని తీసుకుపోయారు. మా సభ్యుల దగ్గర ఈ డీవీడీ ఉండే అవకాశమే లేదు. డీవీడీ తీసుకెళ్లిన సమయంలోనే దీన్ని లీక్ చేసివుండొచ్చ'ని నిహలానీ అన్నారు. 'ఈ సినిమా బుధవారం మధ్యాహ్నం ఆన్లైన్ లో లీకైంది. కోర్టు నుంచి సాయంత్రం 6.30 గంటలకు మాకు కాపీ అందింది. సెన్సార్ బోర్డు సభ్యులు లీక్ చేయడానికి అవకాశమే లేదు. మీరే లీక్ చేశారా అని ఈ సినిమా నిర్మాతలను ఎందుకు అడగరు. పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తుంటార'ని పేర్కొన్నారు. 'ఉడ్తా పంజాబ్'పై ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారని ప్రశ్నించగా.. దీని గురించి నిర్మాతలనే అడగాలని నిహలానీ అన్నారు. ఇటీవల ఆన్లైన్ లో లీకైన సినిమాలు సైరత్ నటసామ్రాట్ దిల్ వాలే మాంజీ- ద మౌంటైన్ మేన్ ది రివనెంట్ ఎన్ ది హేట్‌ఫుల్ ఎయిట్