స్టార్ హీరోకు సెన్సార్ షాక్ : సినిమా రిలీజ్ వాయిదా
సెన్సార్ బోర్డ్ అధ్యక్షుడిగా పంకజ్ నిహ్లానిని తప్పించి ప్రసూన్ జోషికి బాధ్యతలు అప్పగించిన తరువాత కూడా సెన్సార్ వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా సెన్సార్ బోర్డ్ ఓ స్టార్ హీరో సినిమాకు ఏకంగా 70 కట్స్ ను సూచించడం మరోసారి వివాదాస్పదమైంది. సైఫ్ అలీఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలాకాండీ అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 8న రిలీజ్ చేయాలని భావించారు. అయితే సెన్సార్ బోర్డ్ చిత్రయూనిట్ కు షాక్ ఇచ్చింది. సినిమాలో ఎక్కువగా అసభ్య పదాలు ఉన్నాయన్న కారణంతో ఏకంగా 73 కట్స్ ను సూచించింది. దీంతో ఆలోచనలో పడ్డ చిత్రయూనిట్ ప్రస్తుతానికి సినిమాను విడువలను వాయిదా వేసిన చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్ తో యుద్ధనికి రెడీ అవుతోంది.