తాను కథలు రాసేటప్పుడు సెన్సార్ బోర్డును దృష్టిలో పెట్టుకోనని రచయిత జషీన్ ఖాద్రీ స్పష్టం చేశాడు.
ముంబై: తాను కథలు రాసేటప్పుడు సెన్సార్ బోర్డును దృష్టిలో పెట్టుకోనని రచయిత జషీన్ ఖాద్రీ స్పష్టం చేశాడు. ఓ క్రైమ్ కథ ఆధారంగా రూపొందుతున్న 'మీరుథియా గ్యాంగ్ స్టర్స్' సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న జషీన్ ఖాద్రీ మీడియాకు పలువిషయాలను వెల్లడించాడు.'నేను ఎప్పుడూ కూడా కథలే ప్రాధాన్యం ఇస్తాను. సెన్సార్ బోర్డును దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేయను.ఒకవేళ నా సినిమాకు ఏ-సర్టిఫికేట్ వచ్చినా బాధపడును'అని జషీన్ తెలిపాడు. తాను గతంలో రాసిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేయపూర్ చిత్రానికి కూడా ఏ-సర్టిఫికేట్ వచ్చిన సంగతిని గుర్తు చేశాడు.
ప్రస్తుతం దర్శకత్వం వహించబోతున్న తన చిత్రాన్ని స్వయంగా సెన్సార్ బోర్డు ముందుకు తీసుకువెళతానన్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. 'మిరుథియా గ్యాంగ్ స్టర్స్' చిత్రానికి తప్పకుండా యూ అండ్ ఏ సర్టిఫికెట్ లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.