Censor Board Conditions For Nani Dasara Movie, Know Details Inside - Sakshi
Sakshi News home page

Nani Dasara Movie: సెన్సార్‌ పూర్తి చేసుకున్న దసరా మూవీ, బోర్డు సభ్యులు ఏమన్నారంటే..

Published Sat, Mar 25 2023 10:16 AM | Last Updated on Sat, Mar 25 2023 11:07 AM

Censor Board Conditions For Nani Dasara Movie - Sakshi

నేచులర్‌ స్టార్‌ నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ దసరా. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 విడుదల కాబోతోంది. ఇంకా విడుదలకు కొద్ది రోజులే ఉండగా ఈ సినిమాకు తాజాగా సెన్సార్‌ బోర్డ్‌ షాకిచ్చింది. ఈ మూవీలో భారీ మార్పులు చేయాలని హెచ్చరించిదట. ఈ చిత్రంలోనే అభ్యంతరకర సన్నివేశాలను కట్‌ చేయాలంటూ పెద్ద జాబితే ఇచ్చింది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న దసరా మూవీకి బోర్డు పలు కండిషన్స్‌తో కూడిన యూఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది.

చదవండి: అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్‌ కొన్న ఏకైక హీరోయిన్‌ కేఆర్‌ విజయ.. ఇప్పుడెలా ఉందంటే!

ఇందులో సెన్సార్‌ మొత్తం 36 కట్స్‌ చెప్పినట్లు ప్రచారం జరుగుతుండగా మరో వైపు 16 కట్స్‌ మాత్రమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్‌ ముందు భాగంలో 20 కట్స్‌, ఇంటర్వెల్‌ తర్వాత భాగంలో 16 సీన్లను కట్‌ చేయాలని సెన్సార్‌ చూసించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అసభ్యకర సంభాషణలకు మ్యూట్‌ పెట్టాలని, డిస్‌క్లైమర్‌(ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం) అనే ఫాంట్‌ పెంచమని చెప్పింది. అదే విధంగా వైలెన్స్‌ సన్నివేశాలను సీజీతో కవర్‌ చేయాలని బోర్డు చిత్ర బృందానికి సూచిందట.

చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేసిన బలగం.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌

సెన్సార్‌ బోర్డు చెప్పినట్టుగా అభ్యంతరక సన్నివేశాలు కట్‌ చేయగా మూవీ నిడివి 2 గంటల 39 నిమిషాలు ఉంది. కాగా ఈ సినిమా పూర్తి గ్రామీణ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ యాసతో రావడం కొన్ని పదాలకు ఈ కట్స్ పెట్టాల్సి వచ్చినట్లు చెప్తున్నారు. ఇక నాని తొలిసారి పూర్తిగా ఊరమాస్‌ పాత్రలో నటించడంతో పాటు ఆయన తొలి పాన్‌ ఇండియా చిత్రం కావడంతో దసరా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నాని ఇటీవల నటించిన చిత్రాలేవి పెద్దగా విజయం అందుకోలేపోయాయి. ఇక మంచి హిట్‌ కోసం ఎదురు చూస్తున్న నాని ఆశలన్ని దసరాపైనే ఉన్నాయి. సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement