పలు సినిమాలు మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నా.. సెన్సార్ బోర్డు అలాంటి దృశ్యాలను ఎందుకు తొలగించడం లేదని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశ్నించారు. విజయవాడ సమీపంలో ని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలకు గవర్నర్ శనివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలను కొందరు ఫొటోలు తీస్తున్నారని, అలాంటి వాటిని మీడియాలో చూపించడం సరికాదని, ఇలా చూపించిన మీడియాను విచారిం చే పరిస్థితి రావాలని చెప్పారు.