
సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ప్రభు
ప్రముఖ సీనియర్ జరల్నిస్ట్ ప్రభు సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ బాధ్యతను ఆయన చేపట్టడం ఇది రెండోసారి. ఉత్తమ పాత్రికేయుడిగా నంది అవార్డును కూడా అందుకున్న ప్రభు దివంగత నటుడు ఏయన్నార్ జీవితం ఆధారంగా గతంలో తీసిన ‘నటసామ్రాట్’ అనే సీరియల్‌కు దర్శకత్వం వహించారు.
ఫద్నాలుగవ అంతర్జాతీయ బాలలచలన చిత్రోత్సవాలకు మీడియా కమిటీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. ‘‘ఏ బాధ్యత స్వీకరించినా నా వంతు న్యాయం చేయడానికి కృషి చేస్తాను’’ అని ప్రభు పేర్కొన్నారు.