
సినిమాల్లో అశ్లీలతను అరికట్టలి
విజయనగర్‌కాలనీ: చలన చిత్రాల్లో అశ్లీలత ను అరికట్టాల్సిన సెన్సార్ బోర్డు ప్రేక్ష క పాత్ర పోషిస్తుందని ఆలిండియా మహిళా సాంస్కృతిక సంఘం (ఏఐఎంఎస్‌ఎస్) తెలుగు రాష్ట్రాల కార్యదర్శి సీహెచ్ ప్రమీల విమర్శించారు. సినిమాల్లో ఐటం సాగ్స్, అశ్లీలతను నిరోధించాలంటూ శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు మహిళలు ఆందోళనకు దిగారు.
దేశంలో మహిళలపై అత్యాచారాలు, హింస పెరగడానికి పరోక్షంగా సినిమాల అసభ్యతే కారణమని ఆమె ధ్వజమెత్తారు. నిర్భయ సంఘటన నేరస్తుడు మాన్‌సింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో సంస్థ హైదరాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు హేమలత, ఏఐడీఎస్‌ఓ విద్యార్థి సంఘం నగర అధ్యక్షుడు గంగాధర్, ఏఐఎంఎస్‌ఎస్ ప్రతినిధులు పి.తేజ, జాని గౌడ్, నిశాంతి, సత్యనారాయణ, విద్యార్థినులు పాల్గొన్నారు.