
నేను వర్జిన్‌ని
‘‘నేను వర్జిన్‌ని...’ ‘ఫైండింగ్ ఫనీ’ సినిమా కోసం దీపిక పదుకొనే చెప్పిన ఈ ఒక్క డైలాగ్ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ డైలాగ్‌కి సెన్సార్ బోర్డ్ ‘కట్’
‘‘నేను వర్జిన్‌ని...’ ‘ఫైండింగ్ ఫనీ’ సినిమా కోసం దీపిక పదుకొనే చెప్పిన ఈ ఒక్క డైలాగ్ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ డైలాగ్‌కి సెన్సార్ బోర్డ్ ‘కట్’ చెప్పిన విషయం తెలిసిందే. అయితే... ఇక్కడ కథ మరో మలుపు తిరిగింది. కథలో ఈ డైలాగ్ చాలా కీలకం కావడంతో.. ఎలాగైనా ఈ డైలాగుని సినిమాలోకి మళ్లీ తీసుకురావడానికి అన్ని దారుల్ని అన్వేషించడం మొదలుపెట్టారు చిత్ర దర్శకుడు హోమీ అడ్జానియా. ఎట్టకేలకు ఆయనకు ఓ అద్భుతమైన దారి దొరికింది. ఇప్పటికే ఈ డైలాగ్ ప్రచార చిత్రాల రూపంలో ప్రజల్లోకి వెళ్లిపోయి ఉంది.
దాన్నే ఆయుధంగా తీసుకొని సెన్సార్ బోర్డ్‌పై దండెత్తారు హోమీ. ‘‘ట్రైలర్స్ విషయంలో రాని అభ్యంతరం సినిమా విషయంలో ఎందుకొచ్చింది. ఇప్పటికే ఆ డైలాగు జనాల్లో ఉంది. ఇక సినిమాల్లో ఉంటే వస్తే నష్టమేంటి?’ అని సెన్సార్ బోర్డ్ ముందు ఆయన గట్టిగా వాదించే సరికి సెన్సార్ సభ్యులు అవాక్కయ్యారు. ఇక చేసేది లేక... ‘సినిమాలో ఆ డైలాగ్ ఉండొచ్చు’ అని తీర్చు ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. ఆ విధంగా ఆ ఒక్క డైలాగ్ సినిమాకు ఎక్కడ లేని పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అర్జున్‌కపూర్ హీరోగా, నజిరుద్దీన్‌షా, డింపుల్‌కపాడియా కీలక పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 12న హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది.