మరో సినిమాకు సెన్సార్ షాక్: 48 కట్స్
సెన్సార్ బోర్డ్ మరో బాలీవుడ్ సినిమాకు షాక్ ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు ఏకంగా 48 కట్స్ తో ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రస్తుత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ నిబందనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేస్తున్నారు. దీంతో సెన్సార్ దెబ్బకు బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది.
కేవలం అభ్యంతరకర షాట్స్ మాత్రమే తొలగించమని సూచించామని, సీన్స్ ను తీసివేయలేదని సెన్సార్ బోర్డ్ చెపుతున్నా.. చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.' సినిమాలోని కళాత్మక కోణాన్ని పట్టించుకోకుండా, పదుల సంఖ్యలో కట్ చెప్పడం కరెక్ట్ కాదని, అలా చేస్తే సినిమా తీయటం ఎందుకు' అంటున్నారు. మరి 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' టీం కూడా సెన్సార్ బోర్డ్ పై యుద్ధం ప్రకటిస్తుందేమో చూడాలి.