Babumoshai Bandookbaaz
-
48 కట్స్‌ను 8 కి తగ్గించారు..!
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు గతంలో సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన సంగతి తెలిసిందే. నిబందనల పట్ల కఠినంగా వ్యవహరించిన అప్పటి సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేశారు. దీంతో బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది. సెన్సార్ బోర్డ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన చిత్రయూనిట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ నుంచి బాబు మొషాయ్ చిత్రానికి రిలీఫ్ లభించింది. సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన ఈ సినిమాకు రివ్యూ కమిటీ కేవలం 8 కట్స్ మాత్రమే సూచించటం విశేషం. సెన్సార్ క్లియరెన్స్ లభించిన ఆనందంలో బాబు మొషాయ్ టీం మరో సాంగ్ ను రిలీజ్ చేసింది. -
ఆడదానివై ఉండి.. ఈ సినిమా ఎలా తీశావ్!
నిర్మాతపై సెన్సార్ బోర్డు సభ్యురాలి షాకింగ్ కామెంట్స్ 'నువ్వు ఒక మహిళవై ఉండి.. ఇలాంటి సినిమాను ఎలా తీశావు?' ఇది కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) నుంచి నిర్మాత కిరణ్ ష్రఫ్‌కు ఎదురైన ప్రశ్న. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా కిరణ్ ష్రఫ్ 'బాబుమోషాయ్ బందూక్‌బాజ్' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఏకంగా 48 కత్తెర్లు వేసిన పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సీబీఎఫ్సీ.. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు తనను కూడా దుర్భాషలు ఆడిందని నిర్మాత కిరణ్ ష్రఫ్ తెలిపారు. 'సినిమాను చూసిన తర్వాత సీబీఎఫ్సీ సభ్యులు దాదాపు గంటసేపు తమలో తాము చర్చించుకున్నారు. మొదట మా సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అనంతరం సినిమాలో 48 కట్లు ఉంటాయని చెప్పారు. సినిమా పెద్దల కోసమే అయినప్పుడు అన్ని కట్లు ఎందుకు అని మేం వాదించాం. వాళ్లు అది ఏమీ పట్టించుకోలేదు. తాము ఎందుకు కట్ చేస్తున్నామో వివరించుకుంటూ పోయారు' అని నిర్మాత కిరణ్ ష్రఫ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. 'ఈ దశలో సెన్సార్ బోర్డులోని ఓ మహిళా సభ్యురాలు నావైపు తిరిగి.. 'మీరు ఆడవారై ఉండి ఇలాంటి సినిమాను ఎలా తీశారు?' అని ప్రశ్నించింది. దీనికి మరో సభ్యుడు కలుగజేసుకుంటూ.. 'చూడండి ప్యాంటు, షర్ట్ వేసుకుంది. మహిళ ఎలా అవుతుంది' అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో నాకు దిమ్మతిరిగిపోయింది. ఇది తిరోగమన ఆలోచన. నిర్మాతలు ఈ తరహా అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. ధరించే దుస్తుల ఆధారంగా మహిళలను జడ్జ్ చేసే వ్యక్తులు.. నా సినిమాకు ఎంతమేరకు సర్టిఫికేట్ ఇవ్వగలరో గ్రహించవచ్చు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు పెద్ద ఎత్తున కత్తెర్లు వేయడంపై దర్శకుడు కుషాన్ నందీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో తిట్లు అన్ని ఎత్తివేయాలని, 80శాతం రొమాంటిక్ సీన్లను కట్ చేయాలని సీబీఎఫ్సీ ఆదేశించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. -
మరో సినిమాకు సెన్సార్ షాక్: 48 కట్స్
సెన్సార్ బోర్డ్ మరో బాలీవుడ్ సినిమాకు షాక్ ఇచ్చింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు ఏకంగా 48 కట్స్ తో ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రస్తుత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ నిబందనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేస్తున్నారు. దీంతో సెన్సార్ దెబ్బకు బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది. కేవలం అభ్యంతరకర షాట్స్ మాత్రమే తొలగించమని సూచించామని, సీన్స్ ను తీసివేయలేదని సెన్సార్ బోర్డ్ చెపుతున్నా.. చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.' సినిమాలోని కళాత్మక కోణాన్ని పట్టించుకోకుండా, పదుల సంఖ్యలో కట్ చెప్పడం కరెక్ట్ కాదని, అలా చేస్తే సినిమా తీయటం ఎందుకు' అంటున్నారు. మరి 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' టీం కూడా సెన్సార్ బోర్డ్ పై యుద్ధం ప్రకటిస్తుందేమో చూడాలి. -
ఆ సీన్ లో నటించమన్నారు: హీరోయిన్
అభ్యంతకర సన్నివేశంలో నటించమన్నందుకే 'బాబుమోశాయ్ బందూక్ బాజ్' సినిమా నుంచి తప్పుకున్నానని బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ తెలిపింది. సినిమా షూటింగ్ లో తనను బాధ పెట్టారని వెల్లడించింది. దర్శకుడు కుషాన్ నంది తనను అభ్యంతకర సన్నివేశంలో నటించమని పదేపదే వేధించారని వాపోయింది. ఈ సినిమా నుంచి తాను తప్పుకోవడానికి కారణం ఇదేనని వెల్లడించింది. 'ఓ సన్నివేశంలో నవాజుద్దీన్ పై పడుకుని నటించే సీన్ ఉంది. షాట్ పూర్తి చేసినా బాగా రాలేదని కుషాన్ అన్నాడు. మరోసారి చేయాలని చెప్పాడు. అయితే నేను పెట్టి కోట్ మాత్రమే వేసుకుని ఉన్నానని వివరించి నా ఇబ్బంది గురించి చెప్పాను. అతడు నా మాట వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగాడు. ఆ సన్నివేశంలో మళ్లీ నటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చాడు. ఆ షాట్ మళ్లీ చేసేది లేదని తేల్చిచెప్పాను. ఇంతలో నిర్మాత కిరణ్ శ్యామ్ ష్రాఫ్ జోక్యం చేసుకుంది. హీరోను గాఢంగా చుంబించాలని చెప్పింది. ఇదంతా చెప్పడానికి నువ్వు ఎవరని అడిగాను. దర్శకుడు కిషానా, కిరణా అని ప్రశ్నించాను. దాంతో ఆమెను కుషాన్ అక్కడి నుంచి పంపించేశాడు. జరిగిన విషయం దాచిపెట్టి నేను సరిగా నటించలేదని అబద్ధం చెబుతున్నార'ని చిత్రాంగద సింగ్ తెలిపింది. అయితే తమపై చిత్రాంగద చేస్తున్న ఆరోపణలు అవాస్తమని కుషాన్, కిరణ్ అన్నారు. -
చిత్రంగదా...
కుషాన్ నంది తదుపరి చిత్రం ‘బాబు మొషాయ్ బందూక్‌బాజ్’ కోసం బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ సరికొత్త అవతారం ఎత్తనుంది. ఇందులో చెప్పులు కుట్టే యువతి పాత్రలో కనిపించనుందీ భామ. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ సహజంగా ఉండేందుకు... చెప్పులు కుట్టడం టోంది. అలాగే, కథ అవసరం మేరకు ఈ ఢిల్లీ బ్యూటీ బెంగాలీ భాష కూడా నేర్చుకుంటోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ కథానాయుకుడుగా నటిస్తున్న ఈ చిత్రం పశ్చిమబెంగాల్లోని కరువు జిల్లాలైన పురిలియా, బుర్ద్వాన్‌లలో షూటింగ్ జరుపుకోనుంది.