ఆ సీన్ లో నటించమన్నారు: హీరోయిన్ | Kushan wanted me to lie on top of Nawaz in a petticoat: Chitrangda Singh | Sakshi
Sakshi News home page

ఆ సీన్ లో నటించమన్నారు: హీరోయిన్

Published Wed, Jun 15 2016 9:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

ఆ సీన్ లో నటించమన్నారు: హీరోయిన్

ఆ సీన్ లో నటించమన్నారు: హీరోయిన్

అభ్యంతకర సన్నివేశంలో నటించమన్నందుకే 'బాబుమోశాయ్ బందూక్ బాజ్' సినిమా నుంచి తప్పుకున్నానని బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ తెలిపింది. సినిమా షూటింగ్ లో తనను బాధ పెట్టారని వెల్లడించింది. దర్శకుడు కుషాన్ నంది తనను అభ్యంతకర సన్నివేశంలో నటించమని పదేపదే వేధించారని వాపోయింది. ఈ సినిమా నుంచి తాను తప్పుకోవడానికి కారణం ఇదేనని వెల్లడించింది.

'ఓ సన్నివేశంలో నవాజుద్దీన్ పై పడుకుని నటించే సీన్ ఉంది. షాట్ పూర్తి చేసినా బాగా రాలేదని కుషాన్ అన్నాడు. మరోసారి చేయాలని చెప్పాడు. అయితే నేను పెట్టి కోట్ మాత్రమే వేసుకుని ఉన్నానని వివరించి నా ఇబ్బంది గురించి చెప్పాను. అతడు నా మాట వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగాడు. ఆ సన్నివేశంలో మళ్లీ నటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చాడు. ఆ షాట్ మళ్లీ చేసేది లేదని తేల్చిచెప్పాను.

ఇంతలో నిర్మాత కిరణ్ శ్యామ్ ష్రాఫ్ జోక్యం చేసుకుంది. హీరోను గాఢంగా చుంబించాలని చెప్పింది. ఇదంతా చెప్పడానికి నువ్వు ఎవరని అడిగాను. దర్శకుడు కిషానా, కిరణా అని ప్రశ్నించాను. దాంతో ఆమెను కుషాన్ అక్కడి నుంచి పంపించేశాడు. జరిగిన విషయం దాచిపెట్టి నేను సరిగా నటించలేదని అబద్ధం చెబుతున్నార'ని చిత్రాంగద సింగ్ తెలిపింది. అయితే తమపై చిత్రాంగద చేస్తున్న ఆరోపణలు అవాస్తమని కుషాన్, కిరణ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement