Chitrangda Singh
-
ఆ సీన్ లో నటించమన్నారు: హీరోయిన్
అభ్యంతకర సన్నివేశంలో నటించమన్నందుకే 'బాబుమోశాయ్ బందూక్ బాజ్' సినిమా నుంచి తప్పుకున్నానని బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ తెలిపింది. సినిమా షూటింగ్ లో తనను బాధ పెట్టారని వెల్లడించింది. దర్శకుడు కుషాన్ నంది తనను అభ్యంతకర సన్నివేశంలో నటించమని పదేపదే వేధించారని వాపోయింది. ఈ సినిమా నుంచి తాను తప్పుకోవడానికి కారణం ఇదేనని వెల్లడించింది. 'ఓ సన్నివేశంలో నవాజుద్దీన్ పై పడుకుని నటించే సీన్ ఉంది. షాట్ పూర్తి చేసినా బాగా రాలేదని కుషాన్ అన్నాడు. మరోసారి చేయాలని చెప్పాడు. అయితే నేను పెట్టి కోట్ మాత్రమే వేసుకుని ఉన్నానని వివరించి నా ఇబ్బంది గురించి చెప్పాను. అతడు నా మాట వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగాడు. ఆ సన్నివేశంలో మళ్లీ నటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చాడు. ఆ షాట్ మళ్లీ చేసేది లేదని తేల్చిచెప్పాను. ఇంతలో నిర్మాత కిరణ్ శ్యామ్ ష్రాఫ్ జోక్యం చేసుకుంది. హీరోను గాఢంగా చుంబించాలని చెప్పింది. ఇదంతా చెప్పడానికి నువ్వు ఎవరని అడిగాను. దర్శకుడు కిషానా, కిరణా అని ప్రశ్నించాను. దాంతో ఆమెను కుషాన్ అక్కడి నుంచి పంపించేశాడు. జరిగిన విషయం దాచిపెట్టి నేను సరిగా నటించలేదని అబద్ధం చెబుతున్నార'ని చిత్రాంగద సింగ్ తెలిపింది. అయితే తమపై చిత్రాంగద చేస్తున్న ఆరోపణలు అవాస్తమని కుషాన్, కిరణ్ అన్నారు. -
అమితాబ్ నాకు స్క్రీన్ ఐడాల్:చిత్రాంగద సింగ్
ముంబై: ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది నటి చిత్రాంగద సింగ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. నగరంలో ఆదివారం రాత్రి జరిగిన యాంబీవ్యాలీ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నటి చిత్రాంగద సింగ్ తరుణ్ తహిల్యానీ రూపొందించిన ఎర్ర లెహంగాతో నడి చింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘స్క్రీన్ ఐడాల్ సరసన నటించే అవకాశం నాకు రావడంతో చిన్ననాటి కల నిజమైందా అనిపిస్తోంది. అమితాబ్‌బచ్చన్‌కు అంత సమయం ఉండదు. చిన్ననాటినుంచే నాకు ఆయన స్క్రీన్ ఐడాల్. నాకు ఈ విషయం ఎంతో ఉల్లాసం, ఉత్సాహంగా కలిగించింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది’ అని చిత్రాంగద తెలిపింది. ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో చిత్రాంగద గురువు సుధీర్ శర్మ కూడా నటిస్తున్నాడు. గతంలో హజారోం ఖ్వాయిషే ఐసీ, యే సాలీ జిందగీ, ఇన్కార్ సినిమాలలో వీరిరువురూ కలసి పనిచేశారు.