ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదు: వర్మ | Ram Gopal Varma Comments on Movie Censor | Sakshi
Sakshi News home page

ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదు: వర్మ

Published Fri, Nov 29 2019 1:39 PM | Last Updated on Fri, Nov 29 2019 1:42 PM

Ram Gopal Varma Comments on Movie Censor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తాను ఏ కులాన్ని తక్కువ చేయలేదని దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ తెలిపారు. రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదని, కానీ, అన్ని రూల్స్‌ను తన సినిమా మీదే ప్రయోగించారని ఆయన వాపోయారు. సెటైర్ కోసమే ఈ సినిమా చేశానని, ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో సినిమా తీయలేదని వర్మ తెలిపారు. తనను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా లేస్తానని, అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నానని వర్మ ప్రకటించారు.

సెన్సార్ అనేది కాలం చెల్లిన వ్యవస్థగా మారిందని, దాన్ని గురించి మాట్లాడనని తెలిపారు. ‘ఓటు వేసి మనకు కావలసిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమాను చూడాలి.. దేనిని చూడకూడదనేది తెలియదా? అది ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్ళు చూసి చెప్పాలా?’ అంటూ వర్మ చిర్రుబుర్రులాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement