కత్రినా.. కరీనా సమస్య తీరింది! | katrina kareena madhyalo kamal haasan Censor Board Trouble | Sakshi
Sakshi News home page

కత్రినా.. కరీనా సమస్య తీరింది!

Published Sat, Mar 11 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

కత్రినా.. కరీనా సమస్య తీరింది!

కత్రినా.. కరీనా సమస్య తీరింది!

‘‘మీ ఇంటి పరిస్థితి, మీ మానసిక పరిస్థితిని బట్టి మా చిత్రాల మీద అభిప్రాయం చెప్పడం న్యాయం కాదు. తెలుగు సినిమాలను ఉరి తీయకండి’’ అని సెన్సార్‌ బోర్డ్‌ పై  ‘కత్రిన, కరీన, మధ్యలో కమల్‌హాసన్‌’ చిత్ర దర్శకుడు రత్న మండి పడ్డారు. ఇందులో శశాంక్‌ మౌళి, మమతా రావత్‌ హీరోహీరోయిన్లు. విలేకరుల సమావేశంలో రత్న మాట్లాడుతూ – ‘‘మా సినిమా షో చూసిన తర్వాత, సర్టిఫికెట్‌ ఇవ్వడానికి సెన్సార్‌ బోర్డ్‌ నిరాకరించింది.

దాంతో రివైజ్‌ కమిటీకి చూపించాం. వారు కూడా తిరస్కరించారు. ఆ తర్వాత ట్రిబ్యూనల్‌కి  వెళ్లాం. వాళ్లు 60 రోజుల తర్వాత సినిమా చూసి, విత్‌ అవుట్‌ కట్స్‌తో ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ప్రస్తుతం అమ్మాయిలు ఫేస్‌ చేస్తున్న సమస్యనే కామెడీగా తెరకెక్కించాం. మా సినిమా అభ్యంతరకరంగా ఉంటే ప్రేక్షకులే రిజెక్ట్‌ చేస్తారు. అంతే కాని సెన్సార్‌ బోర్డు ఇంతగా ఇబ్బందిపెట్టాల్సిన అవసరంలేదు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement