katrina kareena madhyalo kamal haasan
-
కత్రినా.. కరీనా సమస్య తీరింది!
‘‘మీ ఇంటి పరిస్థితి, మీ మానసిక పరిస్థితిని బట్టి మా చిత్రాల మీద అభిప్రాయం చెప్పడం న్యాయం కాదు. తెలుగు సినిమాలను ఉరి తీయకండి’’ అని సెన్సార్ బోర్డ్ పై ‘కత్రిన, కరీన, మధ్యలో కమల్‌హాసన్’ చిత్ర దర్శకుడు రత్న మండి పడ్డారు. ఇందులో శశాంక్ మౌళి, మమతా రావత్ హీరోహీరోయిన్లు. విలేకరుల సమావేశంలో రత్న మాట్లాడుతూ – ‘‘మా సినిమా షో చూసిన తర్వాత, సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. దాంతో రివైజ్ కమిటీకి చూపించాం. వారు కూడా తిరస్కరించారు. ఆ తర్వాత ట్రిబ్యూనల్‌కి వెళ్లాం. వాళ్లు 60 రోజుల తర్వాత సినిమా చూసి, విత్ అవుట్ కట్స్‌తో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రస్తుతం అమ్మాయిలు ఫేస్ చేస్తున్న సమస్యనే కామెడీగా తెరకెక్కించాం. మా సినిమా అభ్యంతరకరంగా ఉంటే ప్రేక్షకులే రిజెక్ట్ చేస్తారు. అంతే కాని సెన్సార్ బోర్డు ఇంతగా ఇబ్బందిపెట్టాల్సిన అవసరంలేదు’’ అన్నారు. -
కత్రిన, కరీనా మధ్య కమల్‌హాసన్‌కి పనేంటి?
ఓ అమ్మాయి పేరు కత్రినా, మరో అమ్మాయి పేరు కరీనా.. వీరిద్దరి మధ్యకు కమల్‌హాసన్ అనే కుర్రాడు చేరాడు. అప్పుడు ఈ అమ్మాయిల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘కత్రిన కరీనా మధ్యలో కమల్‌హాసన్’. విజయ్‌సాయి, సోనాలి దీక్షిత్, పావన ప్రధాన పాత్రధారులు. రత్న కోరెపల్లి దర్శకుడు. కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు. ఇందులోని అయిదు పాటలకు సంగీత దర్శకుడు శ్రీకర్ శ్రావ్యమైన బాణీలిచ్చారని నిర్మాతలు చెప్పారు.