కత్రిన, కరీనా మధ్య కమల్‌హాసన్‌కి పనేంటి? | Katrina Kareena Madhyalo Kamal Haasan Movie Opening | Sakshi
Sakshi News home page

కత్రిన, కరీనా మధ్య కమల్‌హాసన్‌కి పనేంటి?

Published Thu, Sep 18 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

కత్రిన, కరీనా మధ్య కమల్‌హాసన్‌కి పనేంటి?

కత్రిన, కరీనా మధ్య కమల్‌హాసన్‌కి పనేంటి?

 ఓ అమ్మాయి పేరు కత్రినా, మరో అమ్మాయి పేరు కరీనా.. వీరిద్దరి మధ్యకు కమల్‌హాసన్ అనే కుర్రాడు చేరాడు. అప్పుడు ఈ అమ్మాయిల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘కత్రిన కరీనా మధ్యలో కమల్‌హాసన్’. విజయ్‌సాయి, సోనాలి దీక్షిత్, పావన ప్రధాన పాత్రధారులు. రత్న కోరెపల్లి దర్శకుడు.
 
 కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల  ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు. ఇందులోని అయిదు పాటలకు సంగీత దర్శకుడు శ్రీకర్ శ్రావ్యమైన బాణీలిచ్చారని నిర్మాతలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement