OMG 2 Movie Controversy: 'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం' అని తెలుగులో ఓ సామెత ఉంది. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ తీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే గత నెలలో రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి అలా జరగకుండా ముందే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ హీరో నటించిన ఓ సినిమా ఇరకాటంలో పడిందనిపిస్తుంది.
అక్షయ్‌కి దెబ్బ మీద దెబ్బ
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్‌ది సెపరేట్ రూటు. వేరే ఎవరికీ సాధ్యం కాని విధంగా యమ ఫాస్ట్ గా సినిమాలు చేస్తుంటాడు. ఏడాదికి 5-6 మూవీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఇతడికి అస్సలు కలిసి రావడం లేదు. గతేడాది ఆరు సినిమాలు రిలీజ్ చేస్తే.. అన్నీ బోల్తా కొట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే 'సెల్ఫీ' అని ఓ రీమేక్ తో వచ్చాడు కానీ ఘోరంగా ఫ్లాప్ అయింది.
(ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!)
దేవుడే రక్షించాలి
ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమా 'ఓ మై గాడ్ 2'. గతంలో వచ్చిన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా టీజర్ విడుదల చేశారు. స్టోరీ ఏంటనేది పెద్దగా చూపించకుండా, కేవలం పాత్రల్ని పరిచయం చేశారంతే. ఈ సినిమా హిట్ అయితేనే అక్షయ్ కాస్తయినా కుదురుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమే.
కాంట్రవర్సీ కాన్సెప్ట్!
ఈ మధ్యే రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో సెన్సార్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. హనుమాన్ డైలాగ్స్ వల్ల చాలామంది తిట్టారు. ఇప్పుడు 'ఓ మై గాడ్ 2'కి అలా జరగక ముందే సెన్సార్ బోర్డు కళ్లు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో అభ్యంతరం చెప్పడంతో పాటు రివిజన్ కమిటీ వద్దకు ఈ సినిమాను పంపిందట. టీజర్ లో చూపించినట్లు ఇది దేవుడి సినిమానే అయినప్పటికీ.. అసలు కాన్సెప్ట్ సెక్స్ ఎడ్యుకేషన్, ఎల్జీబీటీక్యూ(ట్రాన్స్‌జెండర్ బైసెక్సువల్ లెస్బియన్) అని తెలుస్తోంది. ఇప్పుడిది కాస్త కాంట్రవర్సీగా మారింది. ఆగస్టు 11న థియేటర్లలోకి రావాల్సి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఏంటో?
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్)
Comments
Please login to add a commentAdd a comment