సెన్సార్ బోర్డ్కు 'స్పైడర్' టీం రిక్వెస్ట్..! | Spyder team Request Censor Board | Sakshi
Sakshi News home page

సెన్సార్ బోర్డ్కు 'స్పైడర్' టీం రిక్వెస్ట్..!

Published Sun, Sep 3 2017 10:52 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

సెన్సార్ బోర్డ్కు 'స్పైడర్' టీం రిక్వెస్ట్..!

సెన్సార్ బోర్డ్కు 'స్పైడర్' టీం రిక్వెస్ట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతోంది. గత కొంత కాలంగా సెన్సార్ బోర్డ్ ఆదేశాల మేరకు సినిమాల ప్రదర్శనకు ముందే ధూమపానం, మద్యపానానికి సంబంధించిన స్టాట్యూటరీ వీడియోను ప్లే చేస్తున్నారు. ప్రతీ సినిమాలో ఏదో ఒక సందర్భంగా ధూమపానం, మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి గనుక ఈ వీడియో తప్పనిసరి అయ్యింది.

అయితే మహేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో ఏ ఒక్క సీన్ లోనూ ధూమపానం, మద్యపానం చేస్తూ ఎవరూ కనిపంచరట. విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య కూడా సినిమా అంతా గ్రీన్ టీ తాగుతూనే కనిపిస్తాడట. బ్యాక్ గ్రౌండ్ లోనూ ఇలాంటి విజువల్స్ లేవు కాబట్టి తమ సినిమాకు స్టాట్యూటరి వార్నింగ్ వీడియో లేకుండా ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ ను కోరుతున్నారు స్పైడర్ యూనిట్. మరి సెన్సార్ బోర్డ్ మురుగదాస్ టీం అభ్యర్థనను ఎంత వరకు మన్నిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement