
సెన్సార్‌ను రద్దు చేయాలి
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్‌లో తక్షణం అందుబాటులో ఉంటోందని, ఇలాంటి కాలంలో సెన్సార్ బోర్డు అవసరం లేదని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అభిప్రాయపడ్డారు. సెన్సార్ వ్యవస్థను రద్దు చేయడం మంచిదని భావిస్తున్నానన్నారు. పోర్న్ సైట్లు చూడాలనుకున్నా.. సెల్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయని, మనం డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నామని, నలుగురైదుగురు కూర్చుని దేశం మొత్తం ఏం చూడాలి..
ఏం చూడకూడదు అనేదానిపై నిర్ణయం తీసుకోవడమనేది అసంబద్ధంగా ఉందన్నారు. జేమ్స్‌బాండ్ సిరీస్ తాజా చిత్రం స్పెక్టర్‌లో ఓ ముద్దు సన్నివేశాన్ని కుదించడంపై సెన్సార్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ లిట్ ఫెస్టివల్ సందర్భంగా వర్మపై వ్యాఖ్యలు చేశారు. అయితే సెన్సార్ బోర్డు చీఫ్ నిహ్లానీ తన పని తాను చేశారని, నిబంధనల మేరకే నడుచుకున్నారని చెప్పారు.