నిజాలను నిగ్గుతేల్చడానికి.. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ | Ram Gopal Varma Lakshmis NTR New Trailer | Sakshi
Sakshi News home page

నిజాలను నిగ్గుతేల్చడానికి.. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

Mar 27 2019 10:41 AM | Updated on Mar 27 2019 10:59 AM

Ram Gopal Varma Lakshmis NTR New Trailer - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ దర్శతక్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే ఎన్నో వివాదాలతో భారీ హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామంటున్నాడు. ఇప్పటికే కోర్టుల రిలీజ్‌కు అనుమతి ఇవ్వటంతో పాటు సెన్సార్‌బోర్డ్‌ కూడా క్లీ యు సర్టిఫికేట్ ఇవ్వటంతో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రిలీజ్‌కు అడ్డంకులన్ని తొలిగిపోయినట్టైంది. దీంతో వర్మ ప్రమోషన్‌ జోరు పెంచాడు. తనదైన స్టైల్‌లో సెటైర్‌లు వేస్తూ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాడు.

తాజాగా కమల్‌ అనే వ్యక్తి క్రియేట్‌ చేసిన యానిమేషన్‌ ట్రైలర్‌ను తన ట్విటర్‌లో రిలీజ్ చేశాడు వర్మ. రామ్‌ గోపాల్ వర్మ స్వయంగా రిక్షా తొక్కుతూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్టుగా ట్రైలర్‌ను రూపొందించారు. వర్మ, అగస్త్య మంజు తో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్‌ కుమార్ నటిస్తుండగా లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞశెట్టి కనిపించనున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్‌ నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement