విడుదలకు ఒక్క రోజు ముందు ‘సీతారామం’చిత్రానికి భారీ షాక్ తగిలింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
(చదవండి: సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?)
ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర యూనిట్‌కి సెన్సార్ భారీ షాకిచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లనుందట.
మరి సెన్సార్ బోర్డ్ నిజంగానే గల్ఫ్ దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేస్తారా? లేదా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రిలీజ్‌కు అనుమతి ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడంతో టాలీవుడ్‌లో ‘సీతారామం’పై భారీ అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment