ప్రభుత్వాల చెప్పు చేతల్లో సెన్సార్‌బోర్డు | Censor board often misused by party in power | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాల చెప్పు చేతల్లో సెన్సార్‌బోర్డు

Published Mon, Feb 1 2016 4:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

ప్రభుత్వాల చెప్పు చేతల్లో సెన్సార్‌బోర్డు

ప్రభుత్వాల చెప్పు చేతల్లో సెన్సార్‌బోర్డు

ప్రభుత్వాల చెప్పు చేతల్లోనే సెన్సార్‌బోర్డు పని చేస్తోందని ప్రముఖ దర్శకుడు మణిరత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా వివాదాల కు దూరంగా ఉండే మణిరత్నం కేంద్ర సెన్సార్‌బోర్డు ప్రభుత్వ పార్టీల అధికారానికి అనుగుణంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కడం విశేషం. బెంగళూర్ లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్న మణిరత్నం అక్కడి ప్రేక్షకులను  ఉద్దేశించి మాట్లాడుతూ తాను 1983లో తాను కన్నడ చిత్రం పల్లవి.. అనుపల్లవి ద్వారా దర్శకుడినయ్యానని గుర్తు చేశారు. ఆ చిత్రానికి ప్రభుత్వం ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును అందించిందన్నారు. భారతీయ సినీ ప్రేక్షకుల అభిరుచిని తక్కువ అంచనా వేయరాదన్నారు.

రేపటి సినిమాను కళ్లముందు ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఇకపోతే సినీ సెన్సార్ బోర్డు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఒక్కోసారి అధికారాన్ని చేపట్టే పార్టీ అధికారం ఇష్టానుసారంగా కేంద్రప్రభుత్వ సెన్సార్‌బోర్డు వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు చేశారు. తాను దర్శకత్వం వహించిన బొంబాయి, ఇరువర్ చిత్రాలకు పలు చాలెంజ్‌లను ఎరుర్కొనే విడుదల చేయాల్సివచ్చిందన్నారు.

ఇప్పుడు కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్‌గా శ్యామ్ బెనగల్ ఎంపిక కావడం సంతోషకరమైన విషయం అన్నారు. ఆయన నేతృత్వంలో సెన్సార్‌బోర్డు పునరుత్తోజం పొందుతుంతని భావిస్తున్నాను. తాను శ్యామ్ బెనగల్, కే.బాలచందర్ చిత్రా లు చూసే యదార్థ కథాచిత్రాలను సృజనాత్మకంగా తెరపై ఆవిష్కరించగలిగాను. 30 ఏళ్ల తరువాత కూడా తన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయంటే అవి సహజత్వంతో కూడి ఉండటమే కావచ్చు అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement