తిరవనంతపురం: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్దోస్ కున్నప్పిల్లిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆరు నెలల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే తన సొంత నియోజకవర్గం పెరుంబవోర్‌లో మాత్రం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. శనివారం సమావేశమైన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరణ్ వెల్లడించారు.
కున్నప్పల్లిపై ఆయన పాత స్నేహితురాలే అత్యాచార, హత్యాయత్నం ఆరోపలు చేస్తూ కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. గురవారం ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో 11 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న ఎల్దోస్.. శనివారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనను ప్రశ్నించిన అధికారులు, సోమవారం మరోసారి విచారణకు రావాలన్నారు.
ఎల్దోద్ పాత స్నేహితురాలైన ఓ మహిళ.. తనను అతను కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని ఆరోపించారు. కోవలం బీచ్‌లోని కొండపైనుంచి తోసేసేందుకు ప్రయత్నించాడని పోలీసులను ఆశ్రయించారు.
చదవండి: వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
Comments
Please login to add a commentAdd a comment