
Yasir Shah Accused In Rape Case: అత్యాచారం కేసులో పాకిస్థాన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యాసిర్, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణల నేపథ్యంలో యాసిర్‌పై కేసు బుక్కైంది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ ఫోన్ చేసి బెదిరించినట్లు ఆ అమ్మాయి పేర్కొంది.
యాసిర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. త్వరలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా, 35 ఏళ్ల యాసిర్ షా 46 టెస్టుల్లో 235 వికెట్లు సాధించి అత్యంత విజయవంతమైన పాక్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. షా వన్డేల్లో సైతం రాణించాడు. 25 వన్డేల్లో 24 వికెట్లు సాధించాడు.
చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..!