Yasir Shah
-
యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు
టెస్టు క్రికెట్లో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఆస్ట్రేలియన్ దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. జూన్ 4, 1993న వార్న్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన విధానం ఎవరు మరిచిపోలేరు. పూర్తిగా లెగ్‌స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టి.. క్రీజులో ఉన్న మైక్ గాటింగ్ సహా.. ఆసీస్ తోటి ఆటగాళ్లు, అభిమానులు సహా యావత్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. క్రికెట్ బతికున్నంతవరకు షేన్ వార్న్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆ తర్వాత ఎంతో మంది బౌలర్లు వార్న్ లాగే ఆ ఫీట్ అందుకున్నప్పటికీ వార్న్ వేసిన బంతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ స్టార్ యాసిర్ షా కూడా అచ్చం వార్న్ తరహాలోనే వేసిన బంతిని క్రికెట్ అభిమానులు సహా కామెంటేటర్స్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా అభివర్ణిస్తున్నారు. అయితే యాసిర్ వేసిన బంతిని దిగ్గజ బౌలర్‌తో పోల్చడం ఏంటని కొందరు అభిమానులు కొట్టిపారేసినప్పటికి.. అచ్చం వార్న్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉండే.. యాసిర్ షా వేసిన బంతి కూడా అదే తరహాలో చరిత్రలో నిలిచిపోనుంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. యాసిర్ షా డెలివరీకి అప్పటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కుషాల్ మెండిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. కుషాల్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 56వ ఓవర్లో యాసిర్ షా బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్‌కు పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్ అవుతుందని యాషిర్ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో లంక పాక్ ముందు 342 పరుగుల టార్గెట్ ఉంచింది. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 3, బాబర్ ఆజం 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 185 పరుగులు దూరంలో ఉండగా.. మరొక రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో శ్రీలంక మిగిలిన 8 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. Ball of the Century candidate❓ Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 18, 2022 The greatest Test delivery ever? pic.twitter.com/MQ8n9Vk3aI — cricket.com.au (@cricketcomau) March 4, 2022 చదవండి: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్ Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో యాసిర్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాసిర్ షా ఐదో స్థానానికి చేరుకున్నాడు. లంక సీనియర్ బ్యాట్స్‌మన్ ఏంజెల్లో మాథ్యూస్‌ను ఔట్ చేయడం ద్వారా యాసిర్ టెస్టుల్లో 237వ వికెట్‌ను దక్కించుకున్నాడు. తద్వారా అబ్దుల్ ఖాదీర్(236 వికెట్లు)ను దాటిన యాసిర్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక యాసిర్ షా కంటే ముందు పాక్ దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్(414 వికెట్లు), వకార్ యూనిస్(373 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్(362 వికెట్లు), దానిష్ కనేరియా(261) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక యాసిర్ షా పాకిస్తాన్ క్రికెట్లో పెను సంచలనం. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ►2014లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యాసిర్ షా పాకిస్తాన్ తరపున 50 వికెట్లు అత్యంత వేగంగా తీసిన బౌలర్‌గా నిలిచాడు. ►టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని(17 టెస్టుల్లో 100 వికెట్లు) అందుకున్న ఆటగాడిగా మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ►200 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా యాసిర్ షా చరిత్ర. 33 టెస్టుల్లో యాసిర్ 200 వికెట్లు సాధించాడు. అంతకముందు ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్(36 టెస్టుల్లో 200 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. ►ఇప్పటివరకు యాసిర్ షా పాకిస్తాన్ తరపున 47 టెస్టుల్లో 237 వికెట్లు, 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్‌ను 16 సార్లు అందుకున్నాడు. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్న యాసిర్ షా లంకతో టెస్టులో మంచి ప్రదర్శననే ఇచ్చాడు. 21 ఓవర్లు వేసిన యాసిర్ షా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. అజర్ అలీ (3), బాబర్ ఆజం(1) క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ అయింది. చండీమల్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహీస్ తీక్షణ 38 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. యాసిర్ షా, హసన్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. -
పాకిస్థాన్ స్పిన్నర్‌పై అత్యాచారం కేసు నమోదు..!
Yasir Shah Accused In Rape Case: అత్యాచారం కేసులో పాకిస్థాన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణల నేపథ్యంలో యాసిర్‌పై కేసు బుక్కైంది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ ఫోన్ చేసి బెదిరించినట్లు ఆ అమ్మాయి పేర్కొంది. యాసిర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. త్వరలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా, 35 ఏళ్ల యాసిర్ షా 46 టెస్టుల్లో 235 వికెట్లు సాధించి అత్యంత విజయవంతమైన పాక్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. షా వన్డేల్లో సైతం రాణించాడు. 25 వన్డేల్లో 24 వికెట్లు సాధించాడు. చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! -
'గెట్ అవుట్ మ్యాన్' అంటూ క్రికెటర్ అసహనం
మౌంట్ మాంగనుయ్ : కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్తాన్ బౌలర్ యాసిర్ షా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్పై నోరు పారేసుకున్నాడు. ఆటలో మొదటిరోజు కివీస్ జట్టు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్లు జిడ్డుగా బ్యాటింగ్ చేస్తూనే పరుగులు రాబట్టారు. 120 పరుగులు భాగస్వామ్యం అనంతరం 70 పరుగుల వద్ద రాస్ టేలర్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన హెన్రీ నికోలస్‌తో కలిసి మరో వికెట్ పడకుండా 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అలా కివీస్ 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. (చదవండి : సిరాజ్ కోసం ఉదయం 4 గంటలకే టీవీ ముందుకు..) అయితే 90 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన పాక్ బౌలర్లు వికెట్లు తీయడానికి నానా కష్టాలు పడ్డారు. షాహిన్ ఆఫ్రిది తప్ప ఏ ఒక్క బౌలర్ ఆకట్టుకోలేదు. అప్పటికే 16 ఓవర్లు వేసిన స్పిన్నర్ యాసిర్ షా 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తీవ్ర అసహనంతో ఉన్న యాసిర్ షా 77వ ఓవర్లో నికోల్స్పై మాట జారాడు. ఈ లెగ్ స్పిన్నర్ వేసిన డెలివరినీ నికోల్స్ కట్‌షాట్ ఆడదామని భావించాడు. అయితే బంతి మిస్ అయి కీపర్ చేతుల్లో పడింది. దీంతో చిర్రెత్తిపోయిన షా నికోల్స్‌ను ఉద్దేశించి 'ఔట్ ఓ జా బూత్నీకే'( గెట్ అవుట్ మ్యాన్) అంటూ గట్టిగా అరించాడు. అయితే షా అన్న మాట నికోల్స్‌కు అర్థం కాకపోవడంతో ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యాసిర్ షా చర్యను తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. OUT hoja Bhootni kay 😂😂😂😂😂😂😂😂😂😂 Yasir larky pic.twitter.com/2JSUc8W9uw — ... (@7Strang_er18) December 26, 2020 ఇక 227/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ 155 ఓవర్లలో 431 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విలియమ్సన్ 129 పరుగులు.. సెంచరీతో మెరవగా, నికోల్స్ 56, కీపర్ వాట్లింగ్ 73 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో ఆఫ్రిది 4, యాసిర్ షా 3, అబ్బాస్, నసీమ్ షా, ఫహీమ్ అశ్రఫ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. అబీద్ అలీ 19, మహ్మద్ అబ్బాస్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : పైన్ అద్భుత క్యాచ్‌కు పుజారా బలి) -
‘అతనేమీ వార్న్ కాదు.. కుంబ్లే అనుకోండి’
సౌతాంప్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా రాణించాలంటే ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో స్పిన్నర్ యాసిర్ షాను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని నేర్చుకోవాలని ఇంగ్లిష్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సూచించాడు. పాక్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టులో యాసిర్ షా బౌలింగ్ ఆడటానికి భయపడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లను ఉద్దేశించి హుస్సేన్ మాట్లాడాడు. అసలు యాసిర్ షా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎటువంటి భయాందోళనలు వద్దని, మానసికంగా దృఢంగా ఉంటే అతని బౌలింగ్‌ను ఆడటం కష్టం కాదన్నాడు. అదే సమయంలో లెగ్ బ్రేక్ బౌలర్ యాసిర్ షాను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌లా ట్రీట్ చేయవద్దని చురకలంటించాడు. (చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన దాదా) యాసిర్ షా ఒక సాధారణ స్పిన్నర్ మాత్రమేనని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే తరహా బౌలర్‌గా యాసిర్ షాను భావించాలన్నాడు. ఇక్కడ తానేమీ కుంబ్లేను తక్కువ చేయడం లేదన్నాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిబ్లే, ఓలీ పోప్లు యాసిర్ షాకు ఔట్ కావడంపై నాసిర్ హుస్సేన్ స్పందించాడు. సిబ్లే ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఓలీ పోప్లు బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరూ బ్యాక్‌ఫుట్ ఆడుతూ వికెట్లు సమర్పించుకోవడంతో హుస్సేన్ కాస్త సెటైరిక్‌గా మాట్లాడాడు. దానిలో భాగంగానే వార్న్, కుంబ్లే ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘ యాసిర్ షాను మరో వార్న్ అనుకోకండి. అతనొక సాధారణ లెగ్ స్పిన్నర్. కుంబ్లే తరహా బౌలర్ అనుకోండి. నేను ఇక్కడ కుంబ్లేను కించపరచడం లేదు. కేవలం విషయం చెబుతున్నా. వార్న్ ఏ వికెట్‌పైనైనా తొలి రోజు నుంచే టెస్టుల్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. కుంబ్లే అలా కాదు. క్రమంగా వికెట్‌పై పట్టు సాధిస్తాడు. దాంతోనే వార్న్-కుంబ్లేల పోలిక తెచ్చా’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకూ యాసిర్ షా 11 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్) సెంచరీ సాధించాడు. అలాగే టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని దాటి అరుదైన జాబితాలో చేరిపోయాడు.(చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’) -
‘వారితో ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయా’
కరాచీ: తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకూ 37 టెస్టులు ఆడి 207 వికెట్లు సాధించినప్పటికీ టీమిండియాతో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదని పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా ఆవేదన వ్యక్తం చేశాడు. పటిష్టమైన భారత్‌తో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టంగా యాసిర్ అభివర్ణించాడు. పాకిస్తాన్ తరఫున 2011లో యాసిర్ అరంగేట్రం చేయగా, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్‌తో వారి దేశంలో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. దాంతో భారత్‌తో రెడ్ బాల్ క్రికెట్‌ను ఆడే అవకాశం యాసిర్‌కు రాలేదు. దీనిపై మాట్లాడిన యాసిర్.. ‘ టీమిండియాతో టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం నా కెరీర్లో ఒక దురదృష్టకరమైన ఘటనే. టెస్టుల్లో కోహ్లికి బౌలింగ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ వారితో టెస్టు ఆడే అవకాశం ఇప్పటివరకూ రాలేదు. భారత్‌తో ఆడాలనే ఉత్సాహం నాలో చాలా ఉంది. ఆ జట్టులో చాలా మంది టాప్ ఆటగాళ్లు ఉన్నారు. ఒక లెగ్ స్పిన్నర్‌గా నేను కోరుకునేది ఇదే. కోహ్లి స్థాయి వంటి ఆటగాడికి బౌలింగ్ చేయడం కంటే ఆనందం ఏముంటుంది. త్వరలోనే భారత్‌తో ఆడే అవకాశం పాకిస్తాన్‌కు వస్తుందని ఆశిస్తున్నా’ అని యాసిర్ పేర్కొన్నాడు. 2012లో భారత పర్యటనకు పాకిస్తాన్ వచ్చినప్పటికీ అది పరిమిత ఓవర్ల సిరీస్. కాకపోతే 2008 నుంచి ఇరు జట్లు ఎక్కడా కూడా కనీసం ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా ఆడలేదు. -
యాసిర్ ఇచ్చేశాడు.. బాదేశాడు
అడిలైడ్: యాసిర్ షా తన చెత్త బౌలింగ్‌తో విరివిగా పరుగులిచ్చుకున్నాడు. ఒక్క వికెటైనా తీయకుండా దాదాపు రెండొందల (197) పరుగులు సమర్పించుకున్నాడు. అదే యాసిర్ షా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కాదు... మిడిలార్డర్లో దిగలేదు... కానీ ఈ బౌలర్ టెయిలెండర్‌గా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ‘శత’క్కొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 96/6తో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 94.4 ఓవర్లలో 302 పరుగుల వద్ద ఆలౌటైంది. యాసిర్ షా (213 బంతుల్లో 113; 13 ఫోర్లు) పోరాటపటిమ కనబరిచాడు. ప్రధాన బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌తో కలిసి మూడో రోజు ఆట ప్రారంభించిన యాసిర్ ఓ బ్యాట్స్‌మన్‌ను తలపించాడు. ఇద్దరు కుదురుగా ఆడటంతో ఆసీస్ బౌలర్లకు వికెట్ తీయడం కష్టమైంది. మొదట బాబర్ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... ఇతని అండతో నింపాదిగా ఆడిన యాసిర్ షా కూడా ఫిఫ్టీ చేశాడు. సాఫీగా సాగుతున్న భాగస్వామ్యాన్ని స్టార్క్ విడదీశాడు. సెంచరీకి కేవలం మూడే పరుగుల దూరంలో ఉన్న బాబర్... స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో ఏడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇదే జోరుతో స్టార్క్ తన మరుసటి బంతికి షాహిన్ ఆఫ్రిది (0)ని ఎల్బీగా డకౌట్ చేశాడు. 213/8 స్కోరు వద్ద పాక్ భోజన విరామానికెళ్లింది. అనంతరం మొహమ్మద్ అబ్బాస్ (78 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో యాసిర్ షా సెంచరీ దిశగా సాగాడు. 192 బంతుల్లో 12 ఫోర్లతో కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో వికెట్‌కు 87 పరుగులు జోడించాక అబ్బాస్‌తో పాటు జట్టు స్కోరు 300 పరుగులు దాటాక యాసిర్‌ను కమిన్స్ ఔట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ్రస్టేలియాకు 287 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో పాక్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. ఆట ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 39 పరుగులు చేసింది. షాన్ మసూద్ (14 బ్యాటింగ్), అసద్ షఫీక్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అజహర్ అలీ (9)ని స్టార్క్... ఇమామ్ (0), బాబర్ (8)లను హాజల్‌వుడ్ పెవిలియన్ పంపారు. ►13 పదమూడేళ్ల తర్వాత పాక్ తరఫున నంబర్–8లో వచ్చిన బ్యాట్స్‌మన్ సెంచరీ చేశాడు. చివరిసారి 2006 కరాచీలో భారత్‌తో టెస్టులో కమ్రాన్ అక్మల్ (113) ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా పాక్ తరఫున తొమ్మిది మంది నంబర్–8లో వచ్చి సెంచరీలు చేశారు. -
పాక్‌కు తప్పని ఫాలోఆన్
అడిలైడ్: యాసిర్ షా సెంచరీ, బాబర్ అజామ్‌ల పోరాటం పాకిస్తాన్‌ను ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించలేకపోయాయి. ఆసీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ ఫాలోఆన్‌కు సిద్ధమైంది. పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను వెంటనే ఆరంభించాల్చి వచ్చింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 287 పరుగులు వెనుకబడి ఉండటంతో పాకిస్తాన్ ఫాలోఆన్ ఆడక తప్పలేదు. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఫాలోఆన్కే మొగ్గు చూపడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. పాక్ ఇన్నింగ్స్‌ను షాన్ మసూద్, ఇమాముల్ హక్‌లు ఆరంభించారు. పాక్ ఆటగాళ్లలో యాసిర్ షా(113; 213 బంతుల్లో 13 ఫోర్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతనికి జతగా బాబర్ అజామ్(97) సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు సాధించగా, ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. హజల్‌వుడ్‌కు వికెట్ దక్కింది. అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. డేవిడ్ వార్నర్(335 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ సాధించగా, లబూషేన్(162) భారీ శతకంతో మెరిశాడు. -
ఆసీస్‌కు చుక్కలు.. యాసిర్ మెరుపులు
అడిలైడ్: ఆసీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ సీనియర్ స్పిన్నర్ యాసిర్ షా ఇప్పటివరకూ నాలుగు వికెట్లు మాత్రమే తీసి నాలుగు వందలకు పైగా పరుగులిచ్చి చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దాంతో యాసిర్ షాను పాక్ మాజీలు ఏకిపారేశారు. అదే యాసిర్ షాలో కసిని పెంచిందేమో.. ఏకంగా సెంచరీతో సమాధానం చెప్పాడు. తాను పరుగులు ఇవ్వడమే కాదు.. పరుగులు కూడా చేయలగను అని బ్యాట్‌తోనే అందుకు బదులిచ్చాడు. పాకిస్తాన్ జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో శతకంతో మెరిశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆసీస్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు మూడంకెల స్కోరు నమోదు చేసి ఇది తన పవర్ అని నిరూపించుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ అజామ్(97) తృటిలో సెంచరీని కోల్పోతే, యాసిర్ షా మాత్రం శతకం సాధించాడు. ఏడో వికెట్‌కు అజామ్‌తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన యాసిర్ షా.. మహ్మద్ అబ్బాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునః నిర్మించాడు. ఈ క్రమంలోనే 192 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరాడు. యాసిర్ షాకు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. యాసిర్ షా రాణించడంతో పాకిస్తాన్ తేరుకుంది. 87 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 273 పరుగులతో ఉంది. అంతకుముందు 96/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్‌కు బాబర్ అజామ్ ఆదుకునే యత్నం చేశాడు. యాసిర్ షాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని సాధించాడు. కాగా, అజామ్ ఏడో వికెట్‌గా ఔటై తృటిలో సెంచరీ కోల్పోయాడు. అజామ్ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. స్టార్క్ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్ ఔటయ్యాడు. అనంతరం షాహిన్ ఆఫ్రిది గోల్డెన్ డక్ అయ్యాడు.దాంతో స్టార్క్ ఖాతాలో ఆరో వికెట్ చేరగా, పాకిస్తాన్ 194 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. అటు తర్వాత యాసిర్ షా- మహ్మద్ అబ్బాస్‌లు స్కోరు బోర్డును కాస్త గాడిలో పెట్టారు. -
నాలుగు వికెట్లు.. నాలుగు వందల పరుగులు
అడిలైడ్: ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షాకు మరొకసారి పీడకలగా మారిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో యాసిర్ షా ఇప్పటివరకూ ఇచ్చిన పరుగులు 402. ఒకవేళ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం వస్తే యాసిర్ ఇంకా ఎన్ని పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలను నమోదు చేస్తాడో చూడాలి.బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ కేవలం ఇన్నింగ్స్ మాత్రమే ఆడగా యాసిర్ షా 48.4 ఓవర్లు వేసి 205 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ నాలుగు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇవ్వడంతో యాసిర్ షాది నామ మాత్రపు బౌలింగ్గానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలవడంతో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.(ఇక్కడ చదవండి:ఏడుసార్లు ఔట్ చేస్తే మాత్రం..: అక్రమ్ చురకలు) ఇక అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో భాగంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇందులో డేవిడ్ వార్నర్(335 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ సాధించగా, లబూషేన్(162) భారీ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే యాసిర్ షా 32 ఓవర్లు వేసి 197 పరుగులు ఇచ్చాడు. అంటే రెండు టెస్టుల్లో కలిసి 80.4 ఓవర్లు వేసిన యాసిర్ షా 402 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో అతని బౌలింగ్ యావరేజ్ 100.5 గా ఉండగా, స్టైక్‌రేట్(వికెట్ తీయడానికి పట్టిన బంతులు) 121గా నమోదైంది. అడిలైడ్ టెస్టులో యాసిర్ షా 197 పరుగులిస్తే, అందులో వార్నర్ ఒక్కడే 111 పరుగులు సాధించడం ఇక్కడ గమనార్హం.2016-17 సీజన్లో ఆస్ట్రేలియాలో పర్యటించిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్న యాసిర్ షా.. మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లోనే 207 పరుగులిచ్చాడు. ఇప్పుడు కూడా యాసిర్ షా బౌలింగ్‌ను ఆస్ట్రేలియన్లు ఆడేసుకోవడంతో అతను చెత్త గణాంకాలతో మరోసారి స్వదేశానికి వెళ్లనున్నాడు. -
ఏడుసార్లు ఔట్ చేస్తే మాత్రం..: అక్రమ్ చురకలు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు ఆ జట్టు ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన తర్వాత పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని వసీం అక్రమ్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఎటువంటి పరిపక్వత లేని ఆటగాళ్లు మాత్రమే ఇలా చేస్తారంటూ ధ్వజమెత్తాడు. రెండు చేతుల్లోని పైకి ఎత్తి ఒక చేత్తో ఐదు వేళ్లను, మరో చేత్తో రెండు వేళ్లను చూపించడం ఎందుకు నిదర్శనమన్నాడు. ఒకవేళ స్టీవ్ స్మిత్‌ను ఇప్పటివరకూ ఏడుసార్లు ఔట్ చేస్తే మాత్రం ఈ తరహాలో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మనం జట్టు విజయం కోసం ఏం చేశామన్నదే ముఖ్యమని, ఇలా తానే ఏదో సాధించానన్నట్లు సెలబ్రేట్ చేసుకుని అవతలి ఆటగాడ్ని ఎత్తిచూపడం ఎంతమాత్రం తగదన్నాడు. ‘ మన సమయం ఏమిటో నీకు తెలుసు. నేను ఆడుతున్నప్పుడు ఎవర్నైనా ఔట్ చేసిన సందర్భాల్లో ఈ తరహాలో సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ రోజుల్లో ఎవరు ఏమిటో ప్రతీ ఒక్కరికి తెలుసు. ప్రత్యేకంగా గణాంకాల విషయంలో అంతా ఓపెన్‌గా ఉంటుంది. మరి అటువంటప్పుడు ఇలా వేళ్లు చూపించి సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా. ఒక బౌలర్‌గా మనం ప్రాక్టీస్ చేస్తున్నామా.. లేదా.. పాకిస్తాన్ జట్టుకు విజయం అందిస్తున్నామా.. లేదా అనేది ముఖ్యం. మనం జట్టుకు ఉపయోగపడనప్పుడు ఏడుసార్లు ఒక ఆటగాడ్ని ఔట్ చేస్తే లాభం ఏమిటి. అది అనుభవలేమి అంటారు’ అని అక్రమ్ విమర్శించాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవాలంటే గేమ్ పరిస్థితి ఎలా ఉందో ముందు అర్థం చేసుకోవాలన్నాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో స్మిత్‌ను యాసిర్ షా ఏడు సార్లు ఔట్ చేశాడు. ఆ క్రమంలోనే యాసిర్ షా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. కాకపోతే ఆ టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతోనే యాసిర్ షా సెలబ్రేషన్స్‌ను అక్రమ్ వేలెత్తి చూపాడు. -
82 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు..
అబుదాబి: పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో యాసిర్ షా ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్ సోమర్‌విల్లేను ఔట్ చేయడం ద్వారా యాసిర్ షా రెండొందల వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. యాసిర్ షా 33వ టెస్టుల్లోనే రెండొందల వికెట్లు సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ క్రమంలోనే 82 ఏళ్ల రికార్డును యాసిర్ షా బద్ధలు కొట్టాడు. 1936లో ఆసీస్ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ రెండొందల వికెట్‌ను 36వ టెస్టులో సాధించాడు. ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమం కాగా, దాన్ని యాసిర్ షా సవరించాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు సాధించిన యాసిర్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. నాల్గో రోజు ఆటలో ఇప్పటివరకూ రెండు వికెట్లను తీశాడు. -
పాక్ ఇన్నింగ్స్ విజయం
దుబాయ్: తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న పాకిస్తాన్ రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పాక్ లెగ్‌స్పిన్నర్ యాసిర్ షా (6/143) కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మంగళవారం నాలుగో రోజు ఫాలోఆన్‌లో ఓవర్‌నైట్ స్కోరు 131/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ (82; 7 ఫోర్లు, 1 సిక్స్), లాథమ్ (50; 4 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించాక లాథమ్ నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన నికోల్స్ అండతో ఇన్నింగ్స్‌ను నడిపించిన టేలర్ జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఓ వైపు నికోల్స్ (77; 7 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడుతున్నప్పటికీ ఇతర బ్యాట్స్‌మెన్‌ను యాసిర్ షా తన స్పిన్ మాయాజాలంతో పడేశాడు. దీంతో టి విరామం తర్వాత కొద్దిసేపటికే కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాచ్‌లో మొత్తం 14 వికెట్లు పడగొట్టిన యాసిర్ షాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చివరి టెస్టు వచ్చే నెల 3 నుంచి అబుదాబిలో జరుగుతుంది. -
పాక్ ప్రతీకార విజయం
దుబాయ్: మొదటి టెస్టులో స్వల్ప లక్ష్య ఛేదనలో విజయానికి దగ్గరగా వచ్చి బోల్తాపడిన పాకిస్థాన్ జట్టు రెండో టెస్టులో తన ప్రతీకార విజయం సాధించింది. 328 పరుగుల లోటుతో ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్‌ను 312 పరుగులకే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన యాసిర్ షా.. రెండో ఇన్నింగ్స్‌లో మరో 6వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టేలర్, నికోల్స్ పోరాడినా.. ఓవర్‌నైట్ స్కోరు 131/2 మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్‌ను మొదట టామ్ లాథమ్(50), ఆ తర్వాత నికోల్స్(77)తో కలసి రాస్ టేలర్(82) ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు 80, నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. టేలర్ అవుటయ్యాక వాట్లింగ్(27) కలసి నికోల్స్ మరో అర్ధసెంచరీ(57) భాగస్వామ్యం ఏర్పరిచాడు. అయితే, జట్టు స్కోరు 255వద్ద వాట్లింగ్ అవుటవడంతో ఆ తర్వాత కివీస్ పతనం వేగంగా సాగింది. గ్రాండ్ హోమ్(14), ఇష్ సోధి(4), వాగ్నర్(10), ట్రెంట్ బౌల్ట్(0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అజాజ్ పటేల్(5) అజేయంగా నిలిచాడు. యాసిర్ షా(6/143) మరోసారి తన స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును కకావికలం చేశాడు. హసన్ అలీకి 3 వికెట్లు దక్కాయి. రెండు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు డిసెంబర్ 3నుంచి ప్రారంభం కానుంది. -
యాసిర్ సూపర్...
దుబాయ్: పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో న్యూజిలాండ్ స్కోరు 50/0... ఆ తర్వాత లెగ్‌స్పిన్నర్ యాసిర్ షా (8/41) దెబ్బకు 90 ఆలౌట్. కేవలం 40 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 10 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జీత్ రావల్ (30), విలియమ్సన్ (28 నాటౌట్), లాథమ్ (22) మాతమ్రే రెండంకెల స్కోరు చేయగా... ఏకంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. మొత్తం 35.3 ఓవర్లకే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాప్–3 కాకుండా తర్వాతి ఎనిమిది మంది కలిపి 5 పరుగులు మాత్రమే జోడించగలిగారు. షా తీసిన ఎనిమిది వికెట్లు మినహాయిస్తే హసన్ అలీకి ఒక వికెట్ దక్కగా, మరో బ్యాట్స్‌మన్ రనౌటయ్యాడు. రావల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన యాసిర్ తన చివరి 7 వికెట్లను కేవలం 27 బంతుల వ్యవధిలో తీయడం విశేషం. ఒక ఓవర్లో మూడు వికెట్లు తీసిన అతను, ఆ తర్వాత మరో రెండు ఓవర్లలో రెండేసి వికెట్లు పడగొట్టాడు. కివీస్ కుప్పకూలడంతో మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌కు 328 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దాంతో ఫాలో ఆన్ ఇచ్చిన పాక్ ప్రత్యర్థిని మళ్లీ బ్యాటింగ్‌కు దింపింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 131 పరుగులు చేసింది. విలియమ్సన్ (30), రావల్ (2) వెనుదిరగ్గా... రాస్ టేలర్ (49 బ్యాటింగ్), లాథమ్ (44 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రెండు వికెట్లు కూడా యాసిర్ షా ఖాతాలోకే వెళ్లడంతో అతను మ్యాచ్‌లో పది వికెట్లను ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ మరో 197 పరుగులు వెనుకబడి ఉంది. ►3 పాకిస్తాన్ తరఫున ఇన్నింగ్స్‌లో మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను షా నమోదు చేశాడు. అబ్దుల్ ఖాదిర్ (9/56), సర్ఫరాజ్ నవాజ్ (9/86) మాత్రమే ముందున్నారు. ►1 ఒకే రోజు పది వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్‌గా షా నిలిచాడు (తొలి ఇన్నింగ్స్‌లో 8 + రెండో ఇన్నింగ్స్ 2). ►5 ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ కావడం టెస్టుల్లో ఇది ఐదోసారి మాత్రమే. -
50–0 నుంచి 90 ఆలౌట్!
దుబాయ్: తొలి టెస్టులో విజయానికి దగ్గరగా వచ్చి చతికిలపడిన పాకిస్థాన్... రెండో టెస్టులో ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెడుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో హారిస్ సొహైల్(147), బాబర్ ఆజామ్(127 నాటౌట్) సెంచరీలతో 418/5 వద్ద డిక్లేర్ చేసిన పాక్.. అనంతరం కివీస్‌ను 90 పరుగులకే ఆలౌట్ చేసింది. యాసిర్ షా మాయాజాలం.. ఓవర్‌నైట్ స్కోరు 24/0తో ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ దశలో యాసిర్ షా మాయాజాలం మొదలైంది. ఓపెనర్ జీత్ రావల్ వికెట్‌తో మొదలుపెట్టిన యాసిర్ .. క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌నూ కుదురుకోనివ్వలేదు. దీంతో కివీస్ 50–0 నుంచి 90కే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ విలియమ్సన్(28 నాటౌట్), ఓపెనర్లు జీత్ రావల్(31), టామ్ లాథమ్(22) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కివీస్ జట్టులో ఏకంగా ఆరుగురు డకౌట్ అయ్యారు. అనంతరం ఫాలోఆన్‌కు దిగిన న్యూజిలాండ్‌ను యాసిర్ షా మరోసారి దెబ్బకొట్టాడు. ఓపెనర్ జీత్ రావల్(2), కెప్టెన్ కేన్ విలియమ్స్(30)ను ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(44 బ్యాటింగ్), రాస్ టేలర్(49 బ్యాటింగ్ ఉన్నారు. -
సహనం కోల్పోయి ఫీల్డర్‌పైకి బంతి విసిరేశాడు
-
వీడియో వైరల్: ఫీల్డర్‌పైకి బంతి విసిరిన బౌలర్!
షార్జా: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో మరోసారి ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు సహనం కోల్పోయి ప్రవర్తించారు. బుధవారం క్వెటా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా లాహోర్ క్వాలండర్స్ ఆటగాళ్లు సొహైల్ ఖాన్-యాసిర్ షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్వెటా ఇన్నింగ్స్ భాగంగా 19 ఓవర్‌ను లాహోర్ బౌలర్ సొహైల్ అందుకున్నాడు. ఆ క్రమంలోనే నాల్గో బంతికి సొహైల్ తన నియంత్రణను కోల్పోయాడు. ఫీల్డింగ్ సెట్ చేసే క్రమంలోనే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యాసిర్ షాను ఫలానా చోట ఫీల్డింగ్ చేయాలంటూ ఆదేశించాడు. దానికి యాసిర్ షా నుంచి సరైన స్పందన రాకపోవడంతో అతనిపైకే బంతి విసిరి అక్కడ ఫీల్డింగ్‌లో నిలబడు అంటూ అసహనాన్ని ప్రదర్శించాడు సొహైల్. ఈ క్రమంలోనే యాసిర్-సొహైల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ బంతిని తిరిగి అందుకున్న యాసిర్.. సొహైల్ వైపు అంతే వేగంగా విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గత వారం గ్లాడియేటర్స్ పేసర్ రహత్ అలీ, కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీంల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. -
36 పరుగులకే ఐదు వికెట్లు..
అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. శ్రీలంక నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ వరుసగా వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాకిస్తాన్ కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు వికెట్లు స్పిన్నర్లకు దక్కాయి. రంగనా హెరాత్, దిల్రువాన్ పెరీరా తలో రెండు వికెట్లు తీసి పాక్ కు షాకిచ్చారు. మరొక వికెట్ పేసర్ సురంగా అక్మల్ కు దక్కింది. అంతకుముందు 69/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. యాసిర్ షా దెబ్బకు విలవిల్లాడారు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ యాసిర్ కు దాసోహమయ్యారు. లంక ఆటగాళ్లలో నిరోషాన్ డిక్ వెల్లా(40 నాటౌట్;76 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 138 పరుగులకే చాపచుట్టేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 419 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138 ఆలౌట్ పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 422 ఆలౌట్ -
యాసిర్ షా విజృంభణ
అబుదాబి:శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా విజృంభించాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించి సత్తా చాటుకున్నాడు. ఫలితంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 138 పరుగులకే చాపచుట్టేసింది. తద్వారా పాకిస్తాన్ కు 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. 69/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. యాసిర్ షా దెబ్బకు విలవిల్లాడారు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ యాసిర్ కు దాసోహమయ్యారు. లంక ఆటగాళ్లలో నిరోషాన్ డిక్ వెల్లా(40 నాటౌట్;76 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. నిన్నటి ఆటలో రెండు వికెట్లు తీసిన యాసిర్.. ఈ రోజు ఆటలో మూడు వికెట్లు సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో యాసిర్ ఎనిమిది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో యాసిర్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 419 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138 ఆలౌట్ పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 422 ఆలౌట్ -
అతన్ని కుల్దీప్ ఛాలెంజ్ చేస్తాడు: షేన్ వార్న్
న్యూఢిల్లీ: ప్రపంచ అత్యుతమ స్సిన్నర్ గా ఎదిగే సత్తా భారత యువ సంచలనం కుల్దీప్ యాదవ్ కు ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కుల్దీప్ యాదవ్ అన్ని ఫార్మాట్లలో ఓపికగా బౌలింగ్ చేసిన పక్షంలో అతని తిరుగులేదని కొనియాడాడు. కుల్దీప్ చైనామన్ బౌలర్(ఎడమచేతి మణికట్టు బౌలర్) కావడంతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు ఇబ్బందులు తప్పవని జోస్యం చెప్పాడు. కాకపోతే కుల్దీప్ కు ఇక్కడ ఓపిక అనేది చాలా అవసరంగా వార్న్ సూచించాడు. 'ఆసీస్ తో వన్డే సిరీస్ తరహాలో కుల్దీప్ ఓపికగా బౌలింగ్ చేస్తే.. అతను ప్రపంచ మేటి స్పిన్నర్ గా ఎదుగుతాడు. పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాను ఛాలెంజ్ చేసే సత్తా కుల్దీప్ కు ఉంది. ప్రస్తుత క్రికెట్ లో యాసిర్ షా అత్యుత్తమ స్పిన్నర్ గా ఉన్నాడు. అతన్ని కుల్దీప్ అధిగమిస్తాడనేది నా అభిప్రాయం. కుల్దీప్ ఇదే జోరును కొంతకాలం కొనసాగించగల్గితే బెస్ట్ లెగ్ స్పిన్నర్ కావడం ఖాయం'అని వార్న్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ జూన్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో కుల్దీప్ అరంగేట్రం చేశాడు.ఆసీస్ తో జరిగిన సిరీస్ లో కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేశాడనే చెప్పాలి. ఈ సిరీస్ లో ఒక హ్యాట్రిక్ ను నమోదు చేసిన కుల్దీప్.. నాగ్ పూర్ వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక మెయిడిన్ సాయంతో 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. -
యాసిర్ షా రికార్డు
అబుదాబి: పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్కును చేరిన తొలి స్పిన్నర్ గా నిలిచాడు. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు యాసిర్ షా ఈ ఘనతను సాధించాడు. లంక బ్యాట్స్‌మన్ లహిరు తిరుమన్నే ను లెగ్ బిఫోర్‌గా అవుట్ చేయడం ద్వారా 150వ టెస్టు వికెట్ల మార్కును చేరాడు. తద్వారా ఈ ఫీట్ ను సాధించిన తొలి స్పిన్నర్ గా రికార్డు సాధించాడు. కాగా, ఓవరాల్ గా పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. గతంలో వకార్ యూనిస్ తన కెరీర్ లో 27 వ టెస్టు ఆడుతున్న సమయంలో ఈ ఫీట్ ను నమోదు చేశాడు. తాజాగా అతని సరసన యాసిర్ షా చేరిపోయాడు. ఇది యాసిర్ షాకు 27 వ టెస్టు. ఇదిలా ఉంచితే, 150 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ సిడ్నీ బార్న్స్ తొలి స్థానంలో ఉన్నాడు. సిడ్నీ బార్న్స్ 24 టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. గతేడాది 100 టెస్టు వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్ గా యాసిర్ షా నిలిచిన సంగతి తెలిసిందే. 17వ టెస్టులో వంద వికెట్ల ఘనతను యాసిర్ సాధించాడు. -
విండీస్ 247 ఆలౌట్
రొసియూ (డొమినికా): పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 115 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు శనివారం ఓవర్‌నైట్ స్కోరు 218/5తో ఆట కొనసాగించిన వెస్టిండీస్ మరో 29 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. పాక్ బౌలర్లలో అబ్బాస్ ఐదు, యాసిర్ షా మూడు వికెట్లు తీశారు. 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన పాక్ కడపటి వార్తలు అందే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. -
ఆ క్రికెటర్లు కొట్టుకున్నంత పనిచేశారు!
బ్రిస్బేన్:పాకిస్తాన్ క్రికెట్లో వివాదాలు కొత్తేమీ కాదు. ఆ క్రికెటర్లు ఏదొక వివాదాన్ని సృష్టస్తూ క్రికెట్ బోర్డుకు తలనొప్పిని తెచ్చిపెట్టడాన్ని చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా పాక్ క్రికెటర్ల మధ్య వాడివేడి మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇద్దరు సీనియర్ క్రికెటర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షాల మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. వీరిద్దర మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ చివరకు ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. బుధవారం ఫుట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రియాజ్‌తో యాసిర్ గొడవ పడ్డాడు. దాంతో నువ్వేంత అంటే నువ్వెంత అనే వరకూ ఆ క్రికెటర్లు తమ మాటల వాడిని కొనసాగించారు. ఆ గొడవ ముదరడంతో జట్టు సభ్యులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ మేరకువారి మధ్య జరిగిన ఘర్షణ ఫోటోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్వీట్ చేసింది. దాంతో ఆ క్రికెటర్లపై చర్యలు తప్పవని అంతా భావించారు. కాగా, ఆ గొడవను పాక్ క్రికెట్ టీమ్ మేనేజర్ వాసిమ్ బారి కొట్టిపారేశారు. ఇది పెద్ద ఘర్షణగా కాదని పేర్కొన్న బారి.. ఆ క్రికెటర్లపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించాడు. గతంలో షోయబ్ అక్తర్-మొహ్మద్ అసిఫ్‌లు ఫీల్డ్‌లోనే ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. 2007 వరల్డ్ టీ 20 సమయంలో షోయబ్ అక్తర్ అసిఫ్ ను బ్యాట్‌తో కొట్టాడు. అది అప్పట్లో అది పెద్ద వివాదమైంది. ఆ తరువాత తన కెరీర్ ముగింపుకు వసీం అక్రమే కారణమంటూ అక్తర్ ధ్వజమెత్తి మరో వివాదానికి తెరలేపాడు. ఇదిలా ఉండగా, ఒక టీ షోలో మొహ్మద్ యూసఫ్-రమీజ్ రాజాలు ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకున్నారు. మరొకవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీసీఎల్)లో వాహబ్ రియాజ్- అహ్మద్ షెహ్‌జాద్‌లు ఒకర్నినొకరు తోసుకున్నారు. దాంతో పాటు దూషణలకు దిగి వివాదాన్నిపెద్దది చేశారు. -
పాకిస్తాన్ ఘన విజయం
రెండో టెస్టులో 133 పరుగులతో విండీస్ చిత్తు అబుదాబి: వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. మంగళవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో పాక్ 133 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. 456 పరుగులను ఛేదించే క్రమంలో 171/4తో చివరి రోజు ఆట ప్రారంభించిన విండీస్ తమ రెండో ఇన్నింగ్సలో 322 పరుగులకు ఆలౌటైంది. బ్లాక్‌వుడ్ (127 బంతుల్లో 95; 11 ఫోర్లు) సెంచరీ కోల్పోగా... చివర్లో హోప్ (41) పోరాడినా లాభం లేకపోరుుంది. లెగ్‌స్పిన్నర్ యాసిర్ షా (6/124) ఆరు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఆఖరి రోజు వరుసగా 21 ఓవర్లు వేసిన అతను విండీస్ పతనాన్ని శాసించాడు. కెరీర్లో రెండో సారి మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన యాసిర్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో అత్యధిక సిరీస్ విజయాలు (10) సాధించిన ఉపఖండపు కెప్టెన్‌గా మిస్బా...గంగూలీ, ధోని (9)లను అధిగమించాడు. చివరిదైన మూడో టెస్టు ఈ నెల 30నుంచి షార్జాలో జరుగుతుంది.