యాసిర్ షా నిషేధంపై పీసీబీ అప్పీల్ | PCB to appeal against suspension of Yasir Shah | Sakshi
Sakshi News home page

యాసిర్ షా నిషేధంపై పీసీబీ అప్పీల్

Published Tue, Jan 5 2016 5:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

యాసిర్ షా నిషేధంపై పీసీబీ అప్పీల్

యాసిర్ షా నిషేధంపై పీసీబీ అప్పీల్

కరాచీ:ఇటీవల పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ ను సస్పెండ్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) అప్పీల్ కు వెళ్లనుంది.  గతేడాది నవంబర్ లో ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ సందర్భంగా యాసిర్ నిషేధిత ఉత్పేరకాలు వాడినట్లు డోప్ టెస్టులో వెల్లడి కావడంతో అతనిపై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది.

 

కాగా, ఆ నిర్ణయంపై తిరిగి అప్పీల్ వెళ్లే అవకాశం ఉన్నందున దానిపై పీసీబీ దృష్టి సారించింది. ఈ మేరకు వైద్య నిపుణుల సలహాతో ముందుకు వెళ్లుతున్నట్లు పీసీబీ అధికారి ఒకరు తాజాగా పేర్కొన్నారు.  యాసిర్ తీసుకున్న క్లోర్ టేలిడాన్ అనే మాత్ర ఉద్దేశపూర్వకంగా తీసుకున్నది కాదని, అతనికి రక్తపోటు ఉన్న కారణంగానే ఆ మాత్రను వాడాల్సి వచ్చిందనేది పీసీబీ తన వాదనలో ప్రధానంగా వినిపించనుంది.  మరోవైపు యాసిర్ కు తామంతా అండగా ఉంటామని పీసీబీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజామ్ సేథీ స్పష్టం చేశారు.అతన్ని నిషేధం నుంచి బయటపడేయడానికి తమశాయశక్తులా  కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement