దుబాయ్: మొదటి టెస్టులో స్వల్ప లక్ష్య ఛేదనలో విజయానికి దగ్గరగా వచ్చి బోల్తాపడిన పాకిస్థాన్ జట్టు రెండో టెస్టులో తన ప్రతీకార విజయం సాధించింది. 328 పరుగుల లోటుతో ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్‌ను 312 పరుగులకే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన యాసిర్ షా.. రెండో ఇన్నింగ్స్‌లో మరో 6వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
టేలర్, నికోల్స్ పోరాడినా..
ఓవర్‌నైట్ స్కోరు 131/2 మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్‌ను మొదట టామ్ లాథమ్(50), ఆ తర్వాత నికోల్స్(77)తో కలసి రాస్ టేలర్(82) ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు 80, నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. టేలర్ అవుటయ్యాక వాట్లింగ్(27) కలసి నికోల్స్ మరో అర్ధసెంచరీ(57) భాగస్వామ్యం ఏర్పరిచాడు. అయితే, జట్టు స్కోరు 255వద్ద వాట్లింగ్ అవుటవడంతో ఆ తర్వాత కివీస్ పతనం వేగంగా సాగింది. గ్రాండ్ హోమ్(14), ఇష్ సోధి(4), వాగ్నర్(10), ట్రెంట్ బౌల్ట్(0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అజాజ్ పటేల్(5) అజేయంగా నిలిచాడు. యాసిర్ షా(6/143) మరోసారి తన స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును కకావికలం చేశాడు. హసన్ అలీకి 3 వికెట్లు దక్కాయి. రెండు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు డిసెంబర్ 3నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment