అబుదాబి: పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో యాసిర్ షా ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్ సోమర్‌విల్లేను ఔట్ చేయడం ద్వారా యాసిర్ షా రెండొందల వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. యాసిర్ షా 33వ టెస్టుల్లోనే రెండొందల వికెట్లు సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
ఈ క్రమంలోనే 82 ఏళ్ల రికార్డును యాసిర్ షా బద్ధలు కొట్టాడు. 1936లో ఆసీస్ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ రెండొందల వికెట్‌ను 36వ టెస్టులో సాధించాడు. ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమం కాగా, దాన్ని యాసిర్ షా సవరించాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు సాధించిన యాసిర్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. నాల్గో రోజు ఆటలో ఇప్పటివరకూ రెండు వికెట్లను తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment