దుబాయ్: పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో న్యూజిలాండ్ స్కోరు 50/0... ఆ తర్వాత లెగ్‌స్పిన్నర్ యాసిర్ షా (8/41) దెబ్బకు 90 ఆలౌట్. కేవలం 40 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 10 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జీత్ రావల్ (30), విలియమ్సన్ (28 నాటౌట్), లాథమ్ (22) మాతమ్రే రెండంకెల స్కోరు చేయగా... ఏకంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. మొత్తం 35.3 ఓవర్లకే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాప్–3 కాకుండా తర్వాతి ఎనిమిది మంది కలిపి 5 పరుగులు మాత్రమే జోడించగలిగారు. షా తీసిన ఎనిమిది వికెట్లు మినహాయిస్తే హసన్ అలీకి ఒక వికెట్ దక్కగా, మరో బ్యాట్స్‌మన్ రనౌటయ్యాడు. రావల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన యాసిర్ తన చివరి 7 వికెట్లను కేవలం 27 బంతుల వ్యవధిలో తీయడం విశేషం. ఒక ఓవర్లో మూడు వికెట్లు తీసిన అతను, ఆ తర్వాత మరో రెండు ఓవర్లలో రెండేసి వికెట్లు పడగొట్టాడు. కివీస్ కుప్పకూలడంతో మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌కు 328 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దాంతో ఫాలో ఆన్ ఇచ్చిన పాక్ ప్రత్యర్థిని మళ్లీ బ్యాటింగ్‌కు దింపింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 131 పరుగులు చేసింది. విలియమ్సన్ (30), రావల్ (2) వెనుదిరగ్గా... రాస్ టేలర్ (49 బ్యాటింగ్), లాథమ్ (44 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రెండు వికెట్లు కూడా యాసిర్ షా ఖాతాలోకే వెళ్లడంతో అతను మ్యాచ్‌లో పది వికెట్లను ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ మరో 197 పరుగులు వెనుకబడి ఉంది.
►3 పాకిస్తాన్ తరఫున ఇన్నింగ్స్‌లో మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను షా నమోదు చేశాడు. అబ్దుల్ ఖాదిర్ (9/56), సర్ఫరాజ్ నవాజ్ (9/86) మాత్రమే ముందున్నారు.
►1 ఒకే రోజు పది వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్‌గా షా నిలిచాడు (తొలి ఇన్నింగ్స్‌లో 8 + రెండో ఇన్నింగ్స్ 2).
►5 ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ కావడం టెస్టుల్లో ఇది ఐదోసారి మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment