second Tests
-
లండన్ చేరిన భారత జట్టు
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సోమవారం రెండో టెస్టు ఆడేందుకు లండన్ పయనమైంది. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందరి రిపోర్టులు నెగెటివ్‌గానే వచి్చనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. నాటింగ్‌హామ్ టెస్టు ఆదివారం వర్షం వల్ల ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి రెండో టెస్టు లార్డ్స్‌లో ఈ నెల 12 నుంచి జరగనుండటంతో కోహ్లి సేన లండన్ చేరుకుంది. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఆడేందుకు శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. పది రోజుల క్వారంటైన్ ఈ నెల 13న ముగియనుంది. గంగూలీ...లార్డ్స్ టెస్టు చూసేందుకు! బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్ టెస్టు చూసేందుకు ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడు. భారత్‌ను తాజాగా ‘రెడ్’ లిస్ట్ నుంచి ‘అంబర్’ జాబితాలోకి మార్చడంతో కఠిన క్వారంటైన్ నిబంధనలు తప్పాయి. ఈ అంబర్ జాబితాలో ఉంటే... వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు కనీస కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తే సరిపోతుంది. 10 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది. దీంతో గంగూలీతో పాటు బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు కూడా ఐదు టెస్టుల సిరీస్‌లో ఒకట్రెండు మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్, వరుసగా ఆరో విజయం
గాలె: స్పిన్నర్ల మాయాజాలంతో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గి రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక నిర్దేశించిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డామ్ సిబ్లీ (56 నాటౌట్; 2 ఫోర్లు), జాస్ బట్లర్ (46; 5 ఫోర్లు) ఐదో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి మరో రోజు ఆట మిగిలిఉండగానే జట్టును గెలిపించారు. శ్రీలంక గడ్డపై ఇంగ్లండ్‌కిది వరుసగా ఆరో టెస్టు విజయం కావడం విశేషం. విదేశీ గడ్డపై ఆతిథ్య జట్టుపై ఇంగ్లండ్ వరుసగా ఆరు టెస్టుల్లో గెలుపొందడం ఇదే ప్రథమం. శ్రీలంకలో 2012లో ఒక టెస్టు నెగ్గిన ఇంగ్లండ్... 2018 పర్యటనలో ఆడిన మూడు టెస్టుల్లోనూ గెలిచింది. తాజా పర్యటనలో ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆట నాలుగోరోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 339/9తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 5 పరుగులు జోడించి 344 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో శ్రీలంకకు 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను ఇంగ్లండ్ స్పిన్నర్లు డామ్ బెస్ (4/49), జాక్ లీచ్ (4/59), జో రూట్ (2/0) దెబ్బతీశారు. ఈ ముగ్గురి ధాటికి లంక 35.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ఇంగ్లండ్ పేసర్లు తీయగా... రెండో ఇన్నింగ్స్‌లోని 10 వికెట్లను స్పిన్నర్లు తీయడం విశేషం. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. -
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయం
వెల్లింగ్టన్: తొలి రెండు రోజులు వర్షం కారణంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యం కాకపోయినా... తర్వాతి మూడు రోజుల్లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో నెగ్గింది. చివరిదైన మూడో టెస్టు ఈనెల 16న క్రైస్ట్‌చర్చ్‌లో మొదలవుతుంది. 223 పరుగులతో వెనుకబడి... ఓవర్‌నైట్ స్కోరు 80/3తో మ్యాచ్ చివరి రోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 56 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మహ్ముదుల్లా (69 బంతుల్లో 67; 12 ఫోర్లు, సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ పేస్ బౌలర్లు నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తమ స్వింగ్, బౌన్స్‌తో హడలెత్తించారు. వాగ్నర్ 45 పరుగులిచ్చి 5 వికెట్లు... బౌల్ట్ 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. డబుల్ సెంచరీ చేసిన కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. తాజా సిరీస్ విజయంతో న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంతో సీజన్‌ను ముగించనుంది. ఫలితంగా ఆ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుంది. టాప్ ర్యాంక్‌లో భారత జట్టు ఉంది. -
శ్రీలంక... ఓటమి దిశగా
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో శ్రీలంక పరాజయం దిశగా పయనిస్తోంది. ఈ టెస్టుతో పాటు సిరీస్ విజయానికి ఆతిథ్య కివీస్ సిద్ధమైంది. నాలుగో రోజు 660 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. గాయపడిన మాథ్యూస్ క్రీజ్‌లోకి దిగడం అనుమానమే. దీంతో మరో వికెట్ లోటుతో లంక ఉంది. 24/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంకను పేసర్ వాగ్నర్ (3/47) దెబ్బతీశాడు. క్రీజ్‌లో పాతుకు పోయిన కుశాల్ మెండిస్ (67; 10 ఫోర్లు), కెప్టెన్ చండిమల్ (56; 5 ఫోర్లు)లతో పాటు రోషన్ సిల్వా (18)ను పెవిలియన్ చేర్చాడు. డిక్వెలా (22) సౌతీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. లంక 208 పరుగుల వద్ద 6 వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి దిల్రువాన్ పెరీరా (22 బ్యాటింగ్; 3 ఫోర్లు), లక్మల్ (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. టెస్టుకు ఆదివారం ఆఖరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లున్న లంక ఇంకా 429 పరుగులు చేయడం అసాధ్యం. దీంతో న్యూజిలాండ్ తొలి సెషన్లోనే మిగతా వికెట్లను పడగొట్టి సిరీస్‌ను చేజిక్కించుకునే అవకాశముంది. తొలి టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. -
మహ్మూదుల్లా సెంచరీ
ఢాకా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌కు రెండో రోజే పట్టుచిక్కింది. బ్యాటింగ్‌లో 500 పైచిలుకు పరుగులు బాదేసింది... బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. రెండో రోజంతా బంగ్లా ఆధిపత్యంలోనే సాగింది. ఓవర్‌నైట్ స్కోరు 259/5తో శనివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లలో 508 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మహ్మూదుల్లా (136; 10 ఫోర్లు) సెంచరీ సాధించాడు. కెప్టెన్ షకీబ్ (80; 6 ఫోర్లు), లిటన్ దాస్ (54; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను స్పిన్నర్లు మెహదీ హసన్ మిరాజ్ (3/36), షకీబుల్ హసన్ (2/15) దెబ్బ తీశారు. దీంతో ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 75 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (0), పావెల్ (4), హోప్ (10), అంబ్రిస్ (7), చేజ్ (0) వరుసగా క్లీన్‌బౌల్డ్ అయ్యారు. -
యాసిర్ సూపర్...
దుబాయ్: పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో న్యూజిలాండ్ స్కోరు 50/0... ఆ తర్వాత లెగ్‌స్పిన్నర్ యాసిర్ షా (8/41) దెబ్బకు 90 ఆలౌట్. కేవలం 40 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 10 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జీత్ రావల్ (30), విలియమ్సన్ (28 నాటౌట్), లాథమ్ (22) మాతమ్రే రెండంకెల స్కోరు చేయగా... ఏకంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. మొత్తం 35.3 ఓవర్లకే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాప్–3 కాకుండా తర్వాతి ఎనిమిది మంది కలిపి 5 పరుగులు మాత్రమే జోడించగలిగారు. షా తీసిన ఎనిమిది వికెట్లు మినహాయిస్తే హసన్ అలీకి ఒక వికెట్ దక్కగా, మరో బ్యాట్స్‌మన్ రనౌటయ్యాడు. రావల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన యాసిర్ తన చివరి 7 వికెట్లను కేవలం 27 బంతుల వ్యవధిలో తీయడం విశేషం. ఒక ఓవర్లో మూడు వికెట్లు తీసిన అతను, ఆ తర్వాత మరో రెండు ఓవర్లలో రెండేసి వికెట్లు పడగొట్టాడు. కివీస్ కుప్పకూలడంతో మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌కు 328 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దాంతో ఫాలో ఆన్ ఇచ్చిన పాక్ ప్రత్యర్థిని మళ్లీ బ్యాటింగ్‌కు దింపింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 131 పరుగులు చేసింది. విలియమ్సన్ (30), రావల్ (2) వెనుదిరగ్గా... రాస్ టేలర్ (49 బ్యాటింగ్), లాథమ్ (44 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రెండు వికెట్లు కూడా యాసిర్ షా ఖాతాలోకే వెళ్లడంతో అతను మ్యాచ్‌లో పది వికెట్లను ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ మరో 197 పరుగులు వెనుకబడి ఉంది. ►3 పాకిస్తాన్ తరఫున ఇన్నింగ్స్‌లో మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను షా నమోదు చేశాడు. అబ్దుల్ ఖాదిర్ (9/56), సర్ఫరాజ్ నవాజ్ (9/86) మాత్రమే ముందున్నారు. ►1 ఒకే రోజు పది వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్‌గా షా నిలిచాడు (తొలి ఇన్నింగ్స్‌లో 8 + రెండో ఇన్నింగ్స్ 2). ►5 ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ కావడం టెస్టుల్లో ఇది ఐదోసారి మాత్రమే. -
అతనొక్కడే
సెంచూరియన్‌లో ఇంకా సెంచరీ మోత మోగలేదు కానీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అంతకంటే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు...వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగి ముందుండి జట్టును నడిపించాడు... తుదికంటా నిలిచి రెండో టెస్టులో మన ఆశలు నిలబెట్టాడు...మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించినా, కోహ్లి అడ్డుగోడ రెండో రోజును పూర్తిగా వారిది కాకుండా చేసింది. మొత్తంగా చూస్తే సఫారీలను తొందరగా ఆలౌట్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో కుప్పకూలని భారత్... కొన్ని అదనపు పరుగులు జోడించడంతో పాటు ఐదు ప్రధాన వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా ఆదివారం ఆటను చెరి సగం పంచుకున్నాయి. బౌలింగ్‌కు పెద్దగా అనుకూలించని పిచ్‌పై మూడో రోజు పాండ్యా, అశ్విన్ అండతో కోహ్లి చెలరేగితే భారత్‌కు మంచి ఆధిక్యం దక్కవచ్చు. సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు అనేక మలుపుల తర్వాత రెండో రోజు దాదాపు సమాన స్థితిలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లి (130 బంతుల్లో 85 బ్యాటింగ్; 8 ఫోర్లు) సెంచరీకి చేరువ కాగా, హార్దిక్ పాండ్యా (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. టీమిండియా ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (142 బంతుల్లో 63; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...అశ్విన్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. 23.5 ఓవర్లలో... ఓవర్‌నైట్ స్కోరు 269/6తో ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ ముందుండి నడిపించాడు. 27 పరుగుల వద్ద డు ప్లెసిస్ ఎల్బీ అవుట్ కోసం అప్పీల్ చేసి భారత్ రివ్యూ కోల్పోయింది. ఎట్టకేలకు మహరాజ్ (18)ను షమీ అవుట్ చేయడంతో 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇది షమీకి 100వ వికెట్ కావడం విశేషం. అయితే ఆ తర్వాత భారత్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా సఫారీలకు కలిసొచ్చింది. అశ్విన్ బౌలింగ్‌లో 1 పరుగు వద్ద వరుస బంతుల్లో రబడ ఇచ్చిన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. ముందుగా స్లిప్‌లో కోహ్లి పొరపాటు చేయగా, షమీతో సమన్వయ లోపంతో పాండ్యా చేతుల్లో పడిన బంతిని వదిలేశాడు. 54 వద్ద డుప్లెసిస్ క్యాచ్‌ను కూడా పార్థివ్ నేలపాలు చేశాడు. కెప్టెన్‌కు అండగా నిలిచిన రబడ (11)ను ఇషాంత్ అవుట్ చేయడంతో 42 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత డు ప్లెసిస్‌ను కూడా ఇషాంతే పెవిలియన్ పంపించగా...తర్వాతి ఓవర్లో మోర్కెల్ (6) వికెట్‌తో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు ఆ జట్టు మొత్తం 66 పరుగులు జోడించింది. వరుస బంతుల్లో... భారత జట్టుకు మరోసారి పేలవమైన ఆరంభం లభించింది. ధావన్ స్థానంలో చోటు దక్కించుకున్న రాహుల్ (10) తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చలేకపోయాడు. మోర్కెల్ బౌలింగ్‌లో పేలవ షాట్‌తో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి బంతికే భారత్‌కు మరో షాక్ తగిలింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే పుజారా (0) లేని సింగిల్ కోసం ప్రయత్నించి ఇన్‌గిడి త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, విజయ్ (126 బంతుల్లో 46; 6 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కోహ్లి ఆరంభంనుంచే ధాటిని ప్రదర్శించగా, విజయ్ తనదైన శైలిలో నెమ్మదిగా ఆడాడు. పిచ్ మరీ ఇబ్బందికరంగా లేకపోవడంతో పాటు దక్షిణాఫ్రికా బౌలింగ్ కూడా అసాధారణంగా ఏమీ లేకపోవడంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. మధ్యలో కొన్ని మంచి బంతులు పడ్డా...పెద్ద ఇబ్బంది లేకపోవడంతో భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. కోహ్లి నిలకడ... టీ విరామం తర్వాత కోహ్లి 68 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మహరాజ్ బౌలింగ్‌లో పదే పదే బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించిన విజయ్ చివరకు అదే బంతికి అవుట్ కాగా, రోహిత్ శర్మ (10) టెస్టుల్లో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. ఈ దశలో పార్థివ్ (19) కొద్ది సేపు కోహ్లికి అండగా నిలిచినా, అతని ఆట కూడా ఎక్కువ సేపు సాగలేదు. ఇన్‌గిడి తొలి వికెట్‌గా అతను వెనుదిరిగాడు. ఈ దశలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా...భారత బ్యాట్స్‌మెన్ మరో ప్రమాదం లేకుండా బయట పడ్డారు. కోహ్లి, పాండ్యా మరో 7.2 ఓవర్లు జాగ్రత్తగా ఆడటంతో దక్షిణాఫ్రికా మరో వికెట్ తీయడంలో విఫలమైంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే భావనతో దక్షిణాఫ్రికా ఈ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను కేశవ్ మహరాజ్‌తో వేయించింది. ఎప్పుడో 1912లో దక్షిణాఫ్రికా ఇలా స్పిన్నర్ (ఆబ్రీ ఫాల్క్‌నర్)తో తొలి ఇన్నింగ్స్ బౌలింగ్ ప్రారంభించిన తర్వాత 106 ఏళ్లకు ఇలా చేయడం విశేషం. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 31; మార్క్రమ్ (సి) పార్థివ్ పటేల్ (బి) అశ్విన్ 94; ఆమ్లా (రనౌట్) 82; డివిలియర్స్ (బి) ఇషాంత్ శర్మ 20; డు ప్లెసిస్ (బి) ఇషాంత్ శర్మ 63; డికాక్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 0; ఫిలాండర్ (రనౌట్) 0; కేశవ్ మహారాజ్ (సి) పార్థివ్ పటేల్ (బి) షమీ 18; రబడ (సి) పాండ్యా (బి) ఇషాంత్ శర్మ 11; మోర్కెల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 6; ఇన్‌గిడి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (113.5 ఓవర్లలో) 335 ఆలౌట్. వికెట్ల పతనం: 1–85, 2–148, 3–199, 4–246, 5–250, 6–251, 7–282, 8–324, 9–333, 10–335. బౌలింగ్: బుమ్రా 22–6–60–0, షమీ 15–2–58–1, ఇషాంత్ శర్మ 22–4–46–3, పాండ్యా 16–4–50–0, అశ్విన్ 38.5–10–113–4. భారత్ ఇన్నింగ్స్: విజయ్ (సి) డికాక్ (బి) మహారాజ్ 46; రాహుల్ (సి అండ్ బి) మోర్కెల్ 10; పుజారా (రనౌట్) 0; కోహ్లి బ్యాటింగ్ 85; రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ (బి) రబడ 10; పార్థివ్ పటేల్ (సి) డికాక్ (బి) ఇన్‌గిడి 19; పాండ్యా బ్యాటింగ్ 11; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (61 ఓవర్లలో 5 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–107, 4–132, 5–164. బౌలింగ్: కేశవ్ మహారాజ్ 16–1–53–1, మోర్కెల్ 15–3–47–1, ఫిలాండర్ 9–3–23–0, రబడ 12–0–33–1, ఇన్‌గిడి 9–2–26–1. 7 షమీ టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌నుంచి ఈ మైలురాయి చేరిన ఏడో ఫాస్ట్ బౌలర్ అతను. 29 టెస్టుల్లో ఈ ఘనత సాధించిన అతను కపిల్ (25), ఇర్ఫాన్ పఠాన్ (28) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. -
లంక ఆటలు సాగలేదు...
-
లంక ఆటలు సాగలేదు...
రెండో టెస్టులో తొలిరోజే భారత్ ఆధిపత్యం, లంక కష్టాలు మొదలయ్యాయి. బౌలర్లు ఆరంభం నుంచే క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పర్యాటక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి కాదు... క్రీజులో నిలిచేందుకే ఆపసోపాలు పడ్డారు. మొత్తానికి పేస్ వికెటే అయినా... స్పిన్నర్లు దెబ్బతీశారు. పిచ్‌పై ఉన్న పచ్చిక ఆరంభంలో పేసర్లకు అనుకూలించినా... తర్వాత పిచ్ పూర్తిగా స్పిన్నర్ల వశమైంది. దీంతో లంక బ్యాట్స్‌మెన్ ఆటలు సాగలేదు. నాగ్‌పూర్: తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బౌలర్లు శ్రీలంకను గట్టిగా దెబ్బ కొట్టారు. ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా పడగొట్టేశారు. శుక్రవారం ఇక్కడ మొదలైన రెండో టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ కరుణరత్నే (147 బంతుల్లో 51; 6 ఫోర్లు), కెప్టెన్ చండిమాల్ (122 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్ ఇషాంత్ (3/37) టాపార్డర్‌ను కూలిస్తే స్పిన్నర్లు అశ్విన్ (4/67), రవీంద్ర జడేజా (3/56) మిగతా బ్యాట్స్‌మెన్ పనిపట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన భారత్ ఆట నిలిచే సమయానికి 8 ఓవర్లలో వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. మురళీ విజయ్ (2 బ్యాటింగ్), పుజారా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ కె.ఎల్.రాహుల్ (7)ను గమగే బౌల్డ్ చేశాడు. ఇషాంత్ పంజా టాస్ నెగ్గిన లంక బ్యాటింగ్‌కే మొగ్గుచూపింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్లు సమరవిక్రమ (13), కరుణరత్నే పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. అదే పనిగా బంతుల్ని డిఫెన్స్‌గా ఆడిన ఈ జోడీ స్కోరుపై పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే ఈ అతి జాగ్రత్త ఎంతోసేపు కాపాడలేకపోయింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో సమరవిక్రమ, స్లిప్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన తిరిమన్నే (58 బంతుల్లో 9) కూడా జిడ్డుగా ఆడి చివరకు అశ్విన్ ఓవర్లో క్లీన్ బౌల్డయ్యాడు. శ్రీలంక 47/2 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఆదుకున్న కరుణరత్నే, చండిమాల్ రెండో సెషన్లో లంక కాస్త పట్టు నిలుపుకుంది. కేవ లం రెండే వికెట్లు కోల్పోయిన పర్యాటక జట్టు 104 పరుగులు జతచేసింది. సెషన్ ఆరంభమైన కాసేపటికే మాథ్యూస్(10) జడేజా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. తర్వాత కరుణరత్నేకు కెప్టెన్ చండిమాల్ జతయ్యాడు. ఇద్దరు నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును వందకు చేర్చారు. ఈ క్రమంలో కరుణరత్నే 132 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే ఇషాంత్ బౌలింగ్‌లో అతను ఎల్బీగా నిష్క్రమించాడు. దీనిపై ఓపెనర్ రివ్యూకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. త ర్వాత చండిమాల్‌కు డిక్వెలా జతయ్యాడు. ఇద్దరు మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు. స్పిన్నర్లకు దాసోహం చివరి సెషన్లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ పూర్తిగా భారత బౌలర్లకు దాసోహమయ్యారు. రెండో సెషన్లో కు దురుగా ఆడిన బ్యాట్స్‌మెన్ అనూహ్యంగా అశ్విన్, జడేజాల స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. ఫలితంగా లంక 54 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. రెండో సెషన్ నుంచి పోరాడిన కెప్టెన్ చండిమాల్ లంక ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. కానీ అండగా నిలచేవారే లేకపోవడంతో అతని అర్ధసెంచరీ జట్టు స్కోరును పెంచలేకపోయింది. డిక్వెలా (24) వికెట్‌తో ప్రారంభమైన పతనం 19 ఓవర్లలోనే పూర్తయింది. చండిమాల్ సహా షనక (2), పెరీరా (15), హెరాత్(4) స్పిన్ ద్వయానికి చిక్కారు. ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలైంది. కాసేపటికే రాహుల్(7) మళ్లీ తక్కువ స్కోరుకే తన వికెట్ పారేసుకున్నాడు. అయితే విజయ్, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 12 అన్ని ఫార్మాట్లలో కలిపి తిరిమన్నేను అశ్విన్ అవుట్ చేయడం ఇది 12వ సారి. అశ్విన్ తన కెరీర్లో ఎక్కువ సార్లు అవుట్ చేసిన బ్యాట్స్‌మన్ తిరిమన్నేనే కావడం విశేషం. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: సమరవిక్రమ (సి) పుజారా (బి) ఇషాంత్ శర్మ 13; కరుణరత్నే ఎల్బీడబ్ల్యూ (బి) ఇషాంత్ శర్మ 51; తిరిమన్నే (బి) అశ్విన్ 9; మాథ్యూస్ ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 10; చండిమాల్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 57; డిక్వెలా (సి) ఇషాంత్ శర్మ (బి) జడేజా 24; షనక (బి) అశ్విన్ 2; పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 15; హెరాత్ (సి) రహానే (బి) అశ్విన్ 4; లక్మల్ (సి) సాహా (బి) ఇషాంత్ శర్మ 17; గమగే నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–20, 2–44, 3–60, 4–122, 5–160, 6–165, 7–184, 8–184, 9–205, 10–205. బౌలింగ్: ఇషాంత్ శర్మ 14–3–37–3, ఉమేశ్ యాదవ్ 16–4–43–0, అశ్విన్ 28.1–7–67–4, జడేజా 21–4–56–3. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) గమగే 7; విజయ్ బ్యాటింగ్ 2; పుజారా బ్యాటింగ్ 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (8 ఓవర్లలో వికెట్‌కు) 11. వికెట్ల పతనం: 1–7. బౌలింగ్: లక్మల్ 4–1–7–0, గమగే 4–2–4–1. -
90 నిమిషాల్లోనే...
దుబాయ్: పాకిస్తాన్ విజయలక్ష్యం 317 పరుగులు... ఓవర్‌నైట్ స్కోరు 198/5. నాలుగో రోజు చివర్లో ఆ జట్టు సాగించిన పోరాటాన్ని బట్టి చూస్తే విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే చివరి రోజు మంగళవారం శ్రీలంక ఆ అవకాశం ఇవ్వలేదు. గంటన్నర వ్యవధిలోనే మిగతా ఐదు వికెట్లు పడగొట్టి పాక్ కథ ముగించింది. 68 పరుగుల తేడాతో రెండో టెస్టులో విజయం సాధించి 2–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 248 పరుగులకు ఆలౌటైంది. అసద్ షఫీఖ్ (176 బంతుల్లో 112; 10 ఫోర్లు) సెంచరీతో పాటు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (130 బంతుల్లో 68; 5 ఫోర్లు) కలిసి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించినా... అది జట్టును రక్షించడానికి సరిపోలేదు. ఆఫ్‌స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా (5/98) పాక్‌ను దెబ్బ తీశాడు. దిముత్ కరుణరత్నేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తొలి టెస్టులో శ్రీలంక 21 పరుగులతో నెగ్గింది. ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఈనెల 13న మొదలవుతుంది. ►1 యూఈఏని తమ సొంత మైదానంగా మార్చుకున్న తర్వాత (2010) పాకిస్తాన్ అక్కడ టెస్టు సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు పాక్ 9 సిరీస్‌లు ఆడగా...5 గెలిచి మరో 4 డ్రా చేసుకుంది. -
గాయంతో శిఖర్ ధావన్ అవుట్
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా శ్రీలంకతో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. తొలి టెస్టు సమయంలో ధావన్ కుడి చేతికి గాయమైంది. మరో ఓపెనర్ మురళీ విజయ్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, మ్యాచ్ ముందు రోజే అతను ఆడేదీ లేనిదీ తెలుస్తుందని భారత జట్టు తెలిపింది. ఒకవేళ విజయ్ కూడా కోలుకోకపోతే పుజారా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.