మహ్మూదుల్లా సెంచరీ | Mahmudullah the star as Bangladesh storng to dominant position | Sakshi
Sakshi News home page

మహ్మూదుల్లా సెంచరీ

Published Sun, Dec 2 2018 12:43 AM | Last Updated on Sun, Dec 2 2018 12:43 AM

Mahmudullah the star as Bangladesh storng to dominant position - Sakshi

ఢాకా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌కు రెండో రోజే పట్టుచిక్కింది. బ్యాటింగ్‌లో 500 పైచిలుకు పరుగులు బాదేసింది... బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. రెండో రోజంతా బంగ్లా ఆధిపత్యంలోనే సాగింది. ఓవర్‌నైట్‌ స్కోరు 259/5తో శనివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లలో 508 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మూదుల్లా (136; 10 ఫోర్లు) సెంచరీ సాధించాడు.

కెప్టెన్‌ షకీబ్‌ (80; 6 ఫోర్లు), లిటన్‌ దాస్‌ (54; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను స్పిన్నర్లు మెహదీ హసన్‌ మిరాజ్‌ (3/36), షకీబుల్‌ హసన్‌ (2/15) దెబ్బ తీశారు. దీంతో ఆట ముగిసే సమయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 75 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్‌ (0), పావెల్‌ (4), హోప్‌ (10), అంబ్రిస్‌ (7), చేజ్‌ (0) వరుసగా క్లీన్‌బౌల్డ్‌ అయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement