బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు ఆ జట్టు ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన తర్వాత పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని వసీం అక్రమ్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఎటువంటి పరిపక్వత లేని ఆటగాళ్లు మాత్రమే ఇలా చేస్తారంటూ ధ్వజమెత్తాడు. రెండు చేతుల్లోని పైకి ఎత్తి ఒక చేత్తో ఐదు వేళ్లను, మరో చేత్తో రెండు వేళ్లను చూపించడం ఎందుకు నిదర్శనమన్నాడు. ఒకవేళ స్టీవ్ స్మిత్‌ను ఇప్పటివరకూ ఏడుసార్లు ఔట్ చేస్తే మాత్రం ఈ తరహాలో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మనం జట్టు విజయం కోసం ఏం చేశామన్నదే ముఖ్యమని, ఇలా తానే ఏదో సాధించానన్నట్లు సెలబ్రేట్ చేసుకుని అవతలి ఆటగాడ్ని ఎత్తిచూపడం ఎంతమాత్రం తగదన్నాడు.
‘ మన సమయం ఏమిటో నీకు తెలుసు. నేను ఆడుతున్నప్పుడు ఎవర్నైనా ఔట్ చేసిన సందర్భాల్లో ఈ తరహాలో సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ రోజుల్లో ఎవరు ఏమిటో ప్రతీ ఒక్కరికి తెలుసు. ప్రత్యేకంగా గణాంకాల విషయంలో అంతా ఓపెన్‌గా ఉంటుంది. మరి అటువంటప్పుడు ఇలా వేళ్లు చూపించి సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా. ఒక బౌలర్‌గా మనం ప్రాక్టీస్ చేస్తున్నామా.. లేదా.. పాకిస్తాన్ జట్టుకు విజయం అందిస్తున్నామా.. లేదా అనేది ముఖ్యం.
మనం జట్టుకు ఉపయోగపడనప్పుడు ఏడుసార్లు ఒక ఆటగాడ్ని ఔట్ చేస్తే లాభం ఏమిటి. అది అనుభవలేమి అంటారు’ అని అక్రమ్ విమర్శించాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవాలంటే గేమ్ పరిస్థితి ఎలా ఉందో ముందు అర్థం చేసుకోవాలన్నాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో స్మిత్‌ను యాసిర్ షా ఏడు సార్లు ఔట్ చేశాడు. ఆ క్రమంలోనే యాసిర్ షా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. కాకపోతే ఆ టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతోనే యాసిర్ షా సెలబ్రేషన్స్‌ను అక్రమ్ వేలెత్తి చూపాడు.
Comments
Please login to add a commentAdd a comment