పాకిస్తాన్ ఘన విజయం | West Indies in the second Test by 133 runs in the rough | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ ఘన విజయం

Published Tue, Oct 25 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

పాకిస్తాన్ ఘన విజయం

పాకిస్తాన్ ఘన విజయం

రెండో టెస్టులో 133 పరుగులతో విండీస్ చిత్తు 


అబుదాబి: వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. మంగళవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో పాక్ 133 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. 456 పరుగులను ఛేదించే క్రమంలో 171/4తో చివరి రోజు ఆట ప్రారంభించిన విండీస్ తమ రెండో ఇన్నింగ్‌‌సలో 322 పరుగులకు ఆలౌటైంది. బ్లాక్‌వుడ్ (127 బంతుల్లో 95; 11 ఫోర్లు) సెంచరీ కోల్పోగా... చివర్లో హోప్ (41) పోరాడినా లాభం లేకపోరుుంది.

లెగ్‌స్పిన్నర్ యాసిర్ షా (6/124) ఆరు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఆఖరి రోజు వరుసగా 21 ఓవర్లు వేసిన అతను విండీస్ పతనాన్ని శాసించాడు. కెరీర్‌లో రెండో సారి మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన యాసిర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో అత్యధిక సిరీస్ విజయాలు (10) సాధించిన ఉపఖండపు కెప్టెన్‌గా మిస్బా...గంగూలీ, ధోని (9)లను అధిగమించాడు. చివరిదైన మూడో టెస్టు ఈ నెల 30నుంచి షార్జాలో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement