'వార్న్ సలహాలు తీసుకుంటున్నా' | Pakistan spinner Yasir takes Warne's advice before England tour | Sakshi
Sakshi News home page

'వార్న్ సలహాలు తీసుకుంటున్నా'

Published Sun, Jun 19 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

'వార్న్ సలహాలు తీసుకుంటున్నా'

'వార్న్ సలహాలు తీసుకుంటున్నా'

లాహోర్: గతేడాది డోపింగ్ పాల్పడి ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన లెగ్ స్పిన్నర్ యాసిర్ షాకు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ పాఠాలు చెబుతున్నాడట.  త్వరలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో వార్న్ సలహాలు తీసుకుంటున్నట్లు  యాసిర్ షా వెల్లడించాడు.  ఇంగ్లండ్ గడ్డపై అపార అనుభవం ఉన్న వార్న్కు అక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉండటంతో అతని నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నట్లు యాసిర్ తెలిపాడు.

 

'ఇప్పటికే వార్న్ ఇంగ్లండ్ లో ఆడిన వీడియోలు చూశా. దాంతో పాటు వార్న్ తో చాట్ చేస్తూ అక్కడి బౌలింగ్ చేసే విధానంపై మెళకువలు తెలుసుకుంటున్నా. అక్కడ వార్న్కు మంచి రికార్డు ఉండటమే అతని సలహాలు తీసుకోవడానికి కారణం'అని యాసిర్ తెలిపాడు.వచ్చే నెలలో ఇంగ్లండ్ తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ తనకు ఒక పెద్ద సవాల్ అని యాసిర్ అభిప్రాయపడ్డాడు. అయితే సవాల్తో కూడిన మ్యాచ్లంటే తనకిష్టమన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement